RRR Release:జపాన్, చైనాతో పాటు 30 దేశాల్లో ట్రిపుల్ ఆర్ రిలీజ్
ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ఆర్ఆర్ఆర్ మార్చ్ 25న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ సాధించింది. ఈ ఘనవిజయం తో ఇండియా బాక్సాఫీస్ ను ట్రిపుల్ ఆర్ కొల్లగొడుతోంది. ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 570 కోట్లకు పైగా షేర్ ను 1,045 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.

ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ఆర్ఆర్ఆర్ మార్చ్ 25న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ సాధించింది. ఈ ఘనవిజయం తో ఇండియా బాక్సాఫీస్ ను ట్రిపుల్ ఆర్ కొల్లగొడుతోంది. ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 570 కోట్లకు పైగా షేర్ ను 1,045 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.
గతంలో బాహుబలి క్రియేట్ చేసిన రికార్డ్స్ ను బ్రేక్ చేయాలని చూశారు ట్రిపుల్ ఆర్ మేకర్స్. అయితే బాహుబలి తరహాలోనే ట్రిపుల్ ఆర్ కూడా ఇతర దేశాల్లో రిలీజ్ కు ర డీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఓవర్ సిస్ లో సత్తా చాటింది జక్కన్న చెక్కిన చిత్రం.
ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఆసక్తి కరమైన సమాచారాన్ని అందించారు. ప్రపంచ వ్యాప్తంగా మరో 30 దేశాల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు చెప్పారు.
రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాకు జపాన్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది అప్పుడు. ప్రభాస్ కు డై హార్ట్ ఫ్యాన్స్ కూడా ఏర్పడ్డారక్కడ. ఇక ట్రిపుల్ ఆర్ కూడా జపాన్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది. అక్టోబర్ లో ఈ సినిమా జపాన్ లో విడుదల అవుతుందని తెలిపారు.
జపాన్ ప్రమోషన్స్ కోసం తాను, తారక్ తో పాటు మూవీ యూనిట్ రెండు రోజుల పాటు ఆ దేశంలో పర్యటిస్తామని అన్నారు చరణ్. అంతే కాదు చైనాలో కూడా ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉందని చరణ్ అన్నారు.
ఇప్పటికీ వెయ్యి కోట్లు కలెక్షన్లు దాటి పరుగులు పెడుతున్న ట్రిపుల్ ఆర్ సినిమాను ఎలాగైనా బాహుబలి కలెక్షన్స్ దాటించే ప్రయత్నం జరుగుతున్నట్ట తెలుస్తోంది. మరో 30 దేశాల్లో సినిమా రిలీజ్ అయితే.. కలెక్షన్ల పరంగా కూడా గట్టిగా ఇంప్రువ్ మెంట్ ఉంటుందని చూస్తున్నారు జక్కన్న టీమ్.
తారక్ కొమురం భీమ్ గా.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించిన ఈ సినిమాలో సీత పాత్రలో చరణ్ జోడీతగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటించగా.. బాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో అజయ్ దేవగణ్, శ్రీయా శరణ్ లాంటి ప్రముఖులు ఇంపార్టెంట్ రోల్స్ లో నటించారు.