- Home
- Entertainment
- Entertainment News
- Aditi Shankar : గని ‘రోమియో జూలియట్’ పాడింది డైరెక్టర్ శంకర్ కూతురే.. అన్నింటా ముందే ‘అదితి శంకర్’..
Aditi Shankar : గని ‘రోమియో జూలియట్’ పాడింది డైరెక్టర్ శంకర్ కూతురే.. అన్నింటా ముందే ‘అదితి శంకర్’..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘గని’నుంచి తాజాగా లాంచ్ అయిన ‘రోమియో జూలియట్’సాంగ్ పాడింది మరేవరో కాదు.. స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు ‘అదితి శంకర్’. ప్రస్తుతం ఈ సాంగ్ దూసుకెళ్తోంది.. అదితి గురించి మరిన్ని విషయాలు..

సార్ట్ డైరెక్టర్ శంకర్ కూతురు అన్నింటా ముందే. ఇప్పుడిప్పుడే తన స్కిల్స్ ను బయటపెడుతోంది. చదువు, సింగింగ్, డ్యాన్స్, నటనలోనూ ప్రతిభావంతురాలే. తాజాగా గని మూవీనుంచి విడుదలైన ‘రోమియో జూలియట్’ సాంగ్ ను పాడి యూత్ ను అట్రాక్ట్ చేస్తోంది.
ఈ సాంగ్ ను ట్రెండీ ట్యూన్ లో పాడటమే కాకుండా లిరికల్ వీడియోలోనూ అదిరిపోయే స్టెప్పులేసి అందరిని ఆకట్టుకుంటోంది అదితి శంకర్. అయితే తెలుగు మూవీ ‘గని’లో తొలిసారిగా తను సింగర్ గా అవకాశం పొందింది. తొలిపాటతోనే తన సింగింగ్ లో తన ప్రతిభ చూపించింది.
ఈ పాటను థమన్ ఏడేండ్ల కిందనే ట్యూన్ చేసిన పట్టుకున్నానని, ప్రత్యేక శంకర్ కూతరు అదితి శంకర్ తోనే పాడించాలని అనుకున్నట్టు కూడా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పేర్కొన్నాడు. థమన్ ఊహించిన దానికంటే ఎక్కువ రిజల్ట్ వచ్చిందంటూ ‘అదితి’ని ప్రశంసించాడు. మరోవైపు అదితి త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పైనా కనిపించనుంది.
తమిళ డైరెక్టర్, 'కొంబన్' దర్శకుడు ముత్తయ్య దర్శకత్వంలో 'విరుమాన్' అనే చిత్రంలో అదితి నటించనుంది. ఈ మూవీలో హీరో ‘కార్తీ’ ప్రధాన ప్రాత పోషిస్తుండగా అదితి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీతో సినీరంగంలోని ఎంట్రీ ఇవ్వనుంది.
అదితికి ఒక సిస్టర్ ఐశ్వర్య, తమ్ముడు ఆదిత్యా శంకర్ ఉన్నారు. వీరిద్దరూ వారి వారి ప్రోఫెషన్స్ లో ముందుకెళ్తున్నారు. డాక్టర్ ఐశ్వర్య ఇప్పటికే పాండిచెర్రీ క్రికెట్ టీమ్ కెప్టెన్ రోహిత్ దామోదరన్ ను వివాహామాడింది. మరో ఆసక్తిరమైన విషయం ఏంటంటే అదిథి చదువులోనూ ఫస్టే. ఇటీవల ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని డాక్టరేట్ ను కూడా పొందింది.
వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ జంటగా నటించిన చిత్రం ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన మూడు పాటలు ఆకట్టుకుంటున్నాయి. ‘రోమియో జూటియట్’ సాంగ్ కు యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారు.