MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • రాబిన్ హుడ్: బడ్జెట్, బిజినెస్ వివరాలు!

రాబిన్ హుడ్: బడ్జెట్, బిజినెస్ వివరాలు!

నితిన్ హీరోగా, శ్రీ లీల హీరోయిన్ గా రాబిన్ హుడ్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

2 Min read
Author : Surya Prakash
Published : Mar 26 2025, 09:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Robinhood Budget, Censor and Business Details in telugu

Robinhood Budget, Censor and Business Details in telugu


నితిన్ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం రాబిన్ హుడ్. చలో, భీష్మ సినిమాలు డైరెక్ట్ చేసిన వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కావటంతో మంచి క్రేజ్ ఉంది.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ స్టఫ్ సినిమా మీద ఎక్సపెక్టేషన్స్ ని పెంచింది.

ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అయ్యింది, బడ్జెట్ ఎంత పెట్టారు, బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలి వంటి విషయాలు చూద్దాం.

23
Robinhood Budget, Censor and Business Details in telugu

Robinhood Budget, Censor and Business Details in telugu


 ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రంకు మ్యాడ్ సినిమా నుంచి పోటి ఎక్కువ ఉండటంతో నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్స్ కు మధ్య నెగోషియేషన్స్ బాగా జరిగాయంటున్నారు.

ఈ క్రమంలో ఆంధ్రా ఏరియాని 15 కోట్లకు అనుకున్నది 12 కోట్లు, చివరకు 10 కోట్లు దగ్గరకు వచ్చి ఫైనల్ అయ్యిందిట. అలాగే సీడెడ్ ఏరియారు మూడున్నర కోట్లు బిజినెస్ సాగింది.

ఇక నైజాంలో నిర్మాతలు స్వయంగా రిలీజ్ చేస్తున్నారు. మొత్తం 26 కోట్ల నుంచి 27 కోట్ల లోపు థియేటర్ బిజినెస్ అయ్యినట్లు. అంటే థియేటర్ షేర్ 40 కోట్లు దాకా రాబట్టాల్సి ఉంది. అప్పుడు లాభాల్లో పడతారు.

33
Robinhood Budget, Censor and Business Details in telugu

Robinhood Budget, Censor and Business Details in telugu


 
అయితే నితిన్ కెరియర్ లోనే అత్యంత హైయెస్ట్ నాన్ దియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ జీ ఫైవ్ సంస్థ కొనుగోలు చేయగా శాటిలైట్ రైట్స్ జీ తెలుగు కొనుగోలు చేసింది.

నితిన్ కెరీర్ లోనే అత్యంత భారీ రేటుకు ఈ హక్కులు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.   మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశకంర్‌లు దాదాపు రూ.70 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మార్చి 28న రాబిన్ హుడ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
తెలుగు సినిమా
ఐబొమ్మ
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved