రొమాంటిక్ వీరుడికే సాధ్యం.. రిషి కపూర్ టాప్ 10 మూవీస్
బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్ నేడు మరణించిన సంగతి తెలిసిందే. రిషి కపూర్ సినీ కెరీర్ లో మరచిపోలేని అద్భుతమైన టాప్ టెన్ మూవీస్ ఇవే.
బాబీ(1973): రిషి కపూర్, డింపుల్ కపాడియా ఈ చిత్రంలో జంటగా నటించారు. ఏ చిత్రం ఘనవిజయం సాధించింది. రిషి కపూర్ కి రొమాంటిక్ హీరోగా క్రేజ్ రావడానికి నాంది పలికిన తొలి చిత్రం ఇదే.
ఖేల్ ఖేల్ మేయిన్ (1975): రవి టాండన్ దర్శత్వంలో రిషి కపూర్, నీతూ కపూర్ జంటగా నటించారు. ఈ చిత్రంలో రొమాన్స్, థ్రిల్ అంశాలు హైలైట్ గా నిలిచాయి. ఫలితంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయం సాధించింది.
కర్జ్ (1980): పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రిషి కపూర్, తినా మునిమ్ జంటగా నటించారు. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.
కభీ కభీ (1976): ఫ్యామిలీ ఎమోషన్స్, రొమాన్స్ కలగలిపిన ఈ చిత్రాన్ని యశ్ చోప్రా తెరకెక్కించారు. అమితాబ్, రాఖీ, శశి కపూర్, రిషి కపూర్, నీతూ కపూర్ కలసి నటించిన మల్టీస్టారర్ మూవీ ఇది.
లైలా మజ్ను ( 1976): లైలా, మజ్ను ప్రేమ కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో రిషి కపూర్, రంజిత జంటగా నటించారు.
అమర్ అక్బర్ ఆంథోని (1977): అమితాబ్, రిషి కపూర్, వినోద్ ఖన్నా నటించిన మల్టీస్టార్ చిత్రం ఇది. చరిత్రలో నిలిచిపోయే ఈ చిత్రంతో ఈ ముగ్గురు హీరోలు సూపర్ క్రేజ్ ని చేసుకున్నారు.
ప్రేమ్ రోగ్ ( 1982): రిషి కపూర్, పద్మిని ఈ చిత్రంలో నటించారు. ఓ విధవని యువకుడు పెళ్లి చేసుకునే పాయింట్ తో ఈ చిత్రం తెరకెక్కింది.
నాగిన్ (1986) : శ్రీదేవి, రిషి కపూర్ కలసి నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
అగ్నిపథ్(2012) : హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రా నటించిన ఈ చిత్రంలో రిషి కపూర్ నెగిటివ్ షేడ్స్ లో అదరగొట్టారు. ఆయన భీకరమైన నటన ప్రేక్షకులని ఫిదా చేసింది.
కపూర్ అండ్ సన్స్ (2016): సిద్ధార్థ్ మల్హోత్రా, ఫవాద్ ఖాన్, అలియా భట్ నటించిన నటించిన ఈ చిత్రంలో రిషి కపూర్ నాటీ గ్రాండ్ ఫాదర్ గా హాస్యం పండించారు.