- Home
- Entertainment
- Entertainment News
- RGV Sister Vijaya Lakshmi : తొమ్మిదేండ్లకే షాకిచ్చిన ఆర్జీవీ.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన విజయ లక్ష్మి
RGV Sister Vijaya Lakshmi : తొమ్మిదేండ్లకే షాకిచ్చిన ఆర్జీవీ.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన విజయ లక్ష్మి
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఎప్పుడూ నూతనోత్సహంతో కనిపిస్తుంటారు. సోషల్ ఇన్సిడెంట్స్ ను గమనిస్తూ ఎప్పటికప్పుడు ప్రశ్నలు సంధిస్తూ ఉంటాడు. అయితే తన ఇంట్లో ఎలా ఉంటాడో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. ఆర్జీవీ గురించి ఆయన సోదరి విజయ లక్ష్మి ఆశ్చర్య పోయే నిజాలను వెల్లడించింది.

ఇంచుమించుగా రామ్ గోపాల్ వర్మ పేరు, ఊరు, సినిమా వివరాలు అందరికీ తెలిసినవే. ఆయన ప్రవర్తన కాస్తా మిగతా వ్యక్తుల కంటే భిన్నంగానూ కొందరు అభిప్రాయపడితే.. చాలా ఉన్నతంగానూ ఉందని మరికొందరు అంటుంటారు. అందరినీ మానిప్యూలేట్ చేస్తూ.. లాజిక్స్ తో ఎదుటి వ్యక్తిని తన దారిలోకి తెచ్చుకోవడంలో ఆర్జీవీ మేటి.
ముఖ్యంగా ఆర్జీవీ సమయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఏ విషయాన్నైనా రిజల్ట్ బేస్డ్ గా విశ్లేసిస్తూ అతి తక్కువ టైంలోనే ఎక్కువ రిజల్ట్ వచ్చేలా ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఆర్జీవీ వ్యక్తిగత విషయాలకు వస్తే కుటుంబం, పెండ్లి, బంధువులకు పెద్దగా ప్రయారిటీ ఇవ్వరు ఆర్జీవీ. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లోనూ ఆయనే వెల్లడించారు.
కానీ ఆర్జీవీ గురించి ఎవరికీ తెలియని విషయాలను ఆయన సోదరి విజయలక్ష్మి ( RGVs Sister Vijaya Lakshmi) తన మొదటి ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇప్పటి వరకు ఏ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇవ్వని విజయ లక్ష్మి తొలిసారిగా ఐ డ్రీమ్ య్యూటూబ్ ఛానెల్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ స్వప్న (Anchor Swapna) ఆర్జీవీకి గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ ఆర్జీవీ ఎంత మేధావో.. ఆయన కుటుంబ సభ్యులతో ఎలా ఉంటారో తెలియజేసింది. తన బాల్య జీవితంలో ఆర్జీవీ అడిగిన ఓ ప్రశ్నను గుర్తు చేస్తూ ఆయన ఫ్యామిలీకి ఎలా షాకిచ్చారో చెప్పింది. చిన్నప్పటి నుంచే ఆర్జీవీ భిన్నంగా ఆలోచించేవాడంట. ఆయన అసలు ఎవరికీ అర్థం అయ్యేవాడు కాదని తెలిపింది విజయ లక్ష్మి.
తొమ్మిదేండ్ల వయస్సులోనే ఆర్జీవీ తన మేధస్సును సరిగా ఉపయోగించే వాడని తెలిపారు. 50 ఏండ్ల ఆర్జీవీ, విజయలక్ష్మి, వారి మామయ్యతో కలిసి ఓ సినిమాకు వెళ్లారు. తిరిగి వచ్చాక ఆర్జీవీ వాళ్ల మామయ్యను తన సందేహాన్ని తెలియజేశాడు. ‘ఆ మూవీలో ట్రైన్ ను బ్లాస్ట్ చేసేందుకు కొందరు రైలు పట్టాలపై టైం బాంబ్ ను ఏర్పాటు చేస్తారు. కొంత టైం సెట్ చేసి.. ఆ రైలు అక్కిడి రాగానే పేలిపోయేలా ప్లాన్ చేస్తారు.’ ఇదే విషయాన్ని ఆర్జీవీ తన మామయ్యను అడిగాడంట.
అసలు మన దేశంలో ట్రైన్ ఎప్పుడైనా సరైన టైంకి వస్తుందా? అలాంటప్పుడు ఆ మూవీ డైరెక్టర్ టైమ్ బాంబును సెట్ చేయడం ఏంటీ? అని ప్రశ్నించాడంట. నిజమే కదా అందులో లాజిక్ లేదని తేలిపోయింది. అప్పటి నుంచే ఆర్జీవీ ప్రతి విషయాన్ని ప్రశ్నించడం, లాజికల్ గా థింక్ చేయడం ప్రారంభించాడంట. అప్పటి నుంచి ఆయన చేసే ప్రతి పని ఇంట్లో వారిని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయని విజయలక్ష్మి తెలియజేసింది. కానీ ఆర్జీవీ పేరు విన్న.. ఆయనతో కాసేపు మాట్లాడిన చాలా హై ఫీలింగ్ ఉంటుందని ఆర్జీవీ సోదరి విజయలక్ష్మి తెలుపుతోంది. అలాగే ఆర్జీవీ ఇంట్లో వారితో ఏ విషయంలోనూ ఎక్కువగా డిస్కస్ చేయరంట.. ‘ఎస్ ఆర్ నో’తో అన్నీ తేల్చేస్తారంట. కొన్నేండ్ల తర్వాత విజయ లక్ష్మి కూడా ఆర్జీవీ మైండ్ సెట్ కు ట్యూన్ అయిపోయారని చెప్పారు.
గత 30 ఏండ్లుగా ఆర్జీవీ అసలు రెస్ట్ తీసుకోవడం చూడలేదని తెలిపింది. ఒక్క క్షణం కూడా వేస్ట్ చేసేందుకు ఇష్టపడడని, తాను చెప్పాలనుకుంది ముక్కు సూటిగా చెప్పేస్తాడు.. అడగాలనుకుంది ధైర్యంగా అడిగేస్తాడంటూ చెప్పింది. లైఫ్ పట్ల ఆర్జీవీ వ్యూ తన జీవితంపైనా ప్రభావం చూపించిందనన్నారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి పూర్తి ఇంటర్వ్యూ ను తన ఇన్ స్టాలో షేర్ చేశాడు ఆర్జీవీ. ‘నా పట్ల నా సోదరి అభిప్రాయం.. నాకు తన అభిప్రాయం మీద ఉన్న అభిప్రాయం ఒకేలా లేవు’ అంటూ క్యాప్షన్ పెట్టారు.