MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • పవన్ కళ్యాణ్ గెలుపుపై రేణు దేశాయ్ రియాక్షన్

పవన్ కళ్యాణ్ గెలుపుపై రేణు దేశాయ్ రియాక్షన్

పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో మాత్రం తన పార్టీని గెలిపించుకోవడమే కాకుండా.. కూటమి కూడా విజయం సాధించేలా పావులు కదిపారు. 

3 Min read
Surya Prakash
Published : Jun 05 2024, 07:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి భారీ విజయం దిశగా దూసుకెళ్లిన సంగతి తెలిసిందే.  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా విజయకేతనం ఎగురవేశారు. దాదాపు 70 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.  జనసేన అధినేత విజయంపై తెలుగు సినీ పరిశ్రమలోని నటీనటులు, డైరెక్టర్స్, నిర్మాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అభినందనలు తెలియచేస్తున్నారు. మరో ప్రక్క  తెలుగు రాష్ట్రాల్లో పవన్ అభిమానులు సంబరాలు చేసుకుంటారు.

213


 పలువురు సినీ సెలబ్రెటీలు పవన్ ను విష్ చెస్తూ పోస్టులు పెడుతున్నారు. సాయి ధరమ్ తేజ్, నితిన్, మెగాస్టార్ చిరంజీవి, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ పవన్ కు అభినందనలు తెలుపుతూ పోస్టులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇక పవన్ సక్సెస్ పై ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

313


“ఆద్య, అకీరాలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ తీర్పు వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నాను” అంటూ ఇంట్లో ఆధ్య సంతోషంగా ఉన్న క్షణాలను తన ఇన్ స్టాలో షేర్ చేశారు. ప్రస్తుతం రేణూ దేశాయ్ పోస్ట్ పై నెటిజన్లతోపాటు పవన్ అభిమానులు రియాక్ట్ అవుతున్నారు. 
 

413

మరో ప్రక్క “ఈ అద్భుత విజయంపై పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక అభినందనలు. ప్రజలుక సేవ చేయాలని ఎన్నో సంవత్సరాలుగా మీరు చేసిన కృషి, మీ అంకితా భావం, మీ నిబద్ధత ఎప్పటికీ హార్ట్ టచింగ్. ప్రజా సేవలో మీ సరికొత్త ప్రయాణానికి ఆల్ ది బెస్ట్ ” అంటూ బన్నీ పోస్ట్ చేశాడు.
 

513

న్యాచురల్ స్టార్ నాని కూడా పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ హీరో అయిన పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు. మిమ్మల్ని ఎంత అనుమానించినా మీరు పోరాటం చేసిన విధానం.. మీరు గెలిచిన తీరు అంతా కేవలం ఒక కథ కాదు. అందరూ నేర్చుకోవాల్సిన పాఠం కూడా. మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది సార్.. భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలని. ప్రతి ఒక్కరికీ రోల్ మోడల్ కావాలని కోరుకుంటున్నారు అంటూ నాని పోస్ట్ చేశారు.

613
Pawan renu

Pawan renu


చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గార్లకు కంగ్రాట్స్.. పిఠాపురంలో గొప్ప చరిత్రను సృష్టించారు.. ఆంధ్రాలో ఎన్టీఏ కూటమి అధికారంలోకి వచ్చింది.. అంటూ అనిల్ రావిపూడి ట్వీట్ వేశాడు. 

713
Pawan Renu

Pawan Renu

ఏపీ ప్రజలు మాట్లాడారు.. తీర్పునిచ్చారు.. చంద్రబాబు గారు, బాలయ్య గారు, నారా లోకేష్ గార్లకు.. కంగ్రాట్స్.. పవన్ కళ్యాణ్ గారికి సెలెబ్రేట్ చేసుకునే రోజు వచ్చింది.. ఎప్పుడో రావాల్సిన విజయం ఇది.. ప్రజా ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్నామని రామ్ అన్నాడు.

813
pawan

pawan

అద్భుత విజయం సాధించారు.. ఇక మీ నాయకత్వంలో ఏపీ అనేది అభివృద్దిలో దూసుకుపోతోందనే విషయంలో డౌటే లేదు.. అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, బాలకృష్ణలకు కంగ్రాట్స్ చెప్పాడు మోహన్ బాబు. 

913

 రామ్ గోపాల్ వర్మ ట్వీట్ వేస్తూ.. కంగ్రాట్స్ అని ఫైర్ ఎమోజీలను షేర్ చేశాడు. నారా లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబులను ట్యాగ్ చేశాడు.

1013


పిఠాపురంలో గెలిచిన పవన్ కళ్యాణ్ గారికి కంగ్రాట్స్.. మీ జర్నీ అద్భుతంగా.. ఎన్నో కష్టాల్ని ఎదుర్కొని నిలబడ్డారు.. ఇక మీ ప్రజా సేవ దిగ్విజయంగా సాగాలని, అందరిలోనూ స్పూర్తి నింపాలని కోరుకుంటున్నాను అని రవితేజ అన్నాడు.

1113
pawan

pawan


జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేసిన ఆయనకు ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 70,354 ఓట్ల మెజార్టీతో పవన్‌ విజయాన్ని అందుకున్నారు. 

1213
Pawan Kalyan, Janasena

Pawan Kalyan, Janasena


గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓటమి పాలైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో మాత్రం తన పార్టీని గెలిపించుకోవడమే కాకుండా.. కూటమి కూడా విజయం సాధించేలా పావులు కదిపారు. అనుకున్నట్లుగానే ఈ ఎన్నికల్లో జనసేన పార్టీకి అద్బుతమైన ఫలితాలు వచ్చాయి. నిలబడ్డ ప్రతీ చోటా జనసేన గెలిచింది.

1313

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ అన్న మాటలను నిలబెట్టుకున్నాురు. ఎవడ్రా మనల్ని ఆపేది.. బైబై వైసీపీ నినాదాలతో రాష్ట్రమంతా ప్రభావం చూపిన జనసేనాని.. లాస్ట్ టైమ్ ఎలక్షన్స్ లో రెండు చోట్ల ఓడిపోయి.. ఎన్నో విమర్షలు ఎదుర్కొన్నారు. ఇక ఈసారి మాత్రం పిఠాపురం నుంచి భారీమెజారిటీతో గెలిచి మొదటి సారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved