బాలీవుడ్ పై రెజీనా షాకింగ్ కామెంట్స్, ఇలా అనేసిందేంటి?
నటి రెజీనా బాలీవుడ్ పరిశ్రమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది తారలకు బాలీవుడ్‌లో అవకాశాలు పెరుగుతున్నాయని, కరోనా తర్వాత పరిస్థితులు మారాయని ఆమె అభిప్రాయపడ్డారు.

రెజీనా తెలుగులోనే కాదు తమిళ్, మలయాళం, కన్నడం, హిందీ తదితర భాషల్లోనూ నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తెలుగులో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్,పిల్ల నువ్వు లెని జీవితం,సౌఖ్యం వంటి చిత్రాల్లో ఆమెకు గుర్తింపు వచ్చింది. పలు చిత్రాల్లో ఐటమ్స్ సాంగ్స్‌లో నటించిన ఆమె ఆచార్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో స్టెప్పులు వేసింది.
ఈ మధ్య కొన్ని వెబ్ సిరీస్‌ల్లోనూ ఆమె నటించారు. తాజాగా నటుడు అజిత్ హీరోగా నటించిన విడాముయర్చి చిత్రంలో ముఖ్యపాత్రను పోషించారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె హిందీ పరిశ్రమపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసారు.
హిందీ చిత్ర పరిశ్రమను ఉద్దేశించి నటి రెజీనా (Regina) మాట్లాడుతూ.,,, ప్రస్తుతం ఆ ఇండస్ట్రీకి సౌత్ స్టార్స్ అవసరం ఉందని ఆమె అన్నారు. ఆ పరిశ్రమలో సౌత్ స్టార్స్ కు ఉండే అవకాశాల గురించి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రెజీనా మాట్లాడారు. ‘‘బాలీవుడ్ వాళ్లకు ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు. గతంలో గడ్డు పరిస్థితులు ఉండేవి. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన తారలకు అక్కడ అవకాశాలు దొరకడం ఎంతో కష్టంగా ఉండేది. అప్పట్లో మీరు సౌత్ నుంచి వచ్చారని తెలిస్తే ఛాన్సులు ఇచ్చేవాళ్లు కాదు.
దానికి భాషాపరమైన ఇబ్బందులు కూడా ఓ కారణమై ఉండొచ్చు. కానీ, కరోనా తర్వాత ఇండస్ట్రీలో పరిస్థితులు మారాయి. సౌత్‌కు చెందిన సినీతారలకు ఇప్పుడు వాళ్లు కూడా అవకాశాలు ఇస్తున్నారు. తమ చిత్రాలను ఎక్కువమంది ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లడం కోసం వారు దక్షిణాది తారలను ఎంచుకోవడం అవసరంగా మారింది’’ అని చెప్పారు. బాలీవుడ్‌లో ప్రాజెక్టులు చేయడంపై మాట్లాడుతూ ఇలాంటి ఇబ్బందులు ఏవీ తాను ఎదుర్కోలేదని తెలిపారు.
Regina Cassandra
రెజీనా నటించిన తాజా చిత్రం ‘విదాముయార్చి’. అజిత్ హీరోగా దర్శకుడు మాగిజ్ తిరుమేని దీనిని రూపొందించారు. త్రిష కథానాయిక. అర్జున్ కీలక పాత్ర పోషించారు. ఇందులో రెజీనా అర్జున్‌కు జోడీగా కనిపించనున్నారు. ఫిబ్రవరి 6న ఈ సినిమా విడుదల కానుంది.
ఈ చిత్రంలో తన రోల్ గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా ప్రమోషనల్ వీడియోలు చూసి చాలామంది నా పాత్ర గురించి చర్చించుకుంటున్నారు. నాది పాజిటివ్ రోల్? లేదా నెగిటివ్ రోల్? అని సందేహం వ్యక్తంచేస్తున్నారు. నా పాత్ర గురించి ప్రేక్షకులు ఆవిధంగా మాట్లాడుకోవడం నాకెంతో నచ్చింది’’ అని అన్నారు. మాగిజ్ ఈ సినిమా కోసం తనని సంప్రదించినప్పుడు వేరే రోల్ గురించి తొలుత చెప్పారని.. తర్వాత ఈ రోల్ ను ఆఫర్ చేశారని తెలిపారు.