- Home
- Entertainment
- Entertainment News
- దీపికా పదుకొణె డిప్రెషన్ పై.. ఫస్ట్ టైమ్ స్పందించిన రణ్ వీర్ సింగ్, ఏమన్నాడంటే..?
దీపికా పదుకొణె డిప్రెషన్ పై.. ఫస్ట్ టైమ్ స్పందించిన రణ్ వీర్ సింగ్, ఏమన్నాడంటే..?
తన భార్య దీపికా పదుకొణె గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.. బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్. మరీ ముఖ్యంగా దీపికా పదుకొణె డిఫ్రెషన్ కు సబంధించిన ఆయన మాట్లాడిన పాయింట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..?

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది దీపికా పదుకునే. స్టార్ హీరోల సరసన అద్భుతమైన పాత్రలు చేసింది. గ్లామర్ షోతో బాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసింది. అంతే కాదు.. బాలీవుడ్ తో పాటు..సౌత్ లో కూడా తన ఫ్యాన్ బేస్ ను.. సోఫల్ మీడియా ఫాలోవర్స్ ను సంపాదించుకుంది బ్యూటీ.
ఇక ఆమె తన కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులుఫేస్ చేసింది. రణ్ బీర్ తో లవ్.. ఆతరువాత బ్రేకప్.. కొన్నాళ్లు డిప్రెషన్ లోకి వెళ్ళడం.. చాలా ఇబ్బందులు అనుభవించింది దీపికా. అయితే ఆమె డిఫ్రెషన్ నుంచి బయట పడితన తరువాత పలుసందర్భాల్లో ఆ విషయంగురించి చాలా ఇంటర్వ్యూలో..క్లియర్ గా చెప్పింది. తనలా కాకుండా.. ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలని.. డిప్రెషన్ ను దగ్గరకు రానివ్వవద్దంటూ చెప్పుకొచ్చింది.
అయితే ఈ విషయంలో దీపికా పదుకునే భర్త రణ్ వీర్ సింగ్ ఎప్పుడూ స్పందించలేదు.. ఒక్క కామెంట్ కూడా ఇంత వరకూ చేయలేదు. కాని రీసెంట్ గా.. దీపికా పదుకునే డిఫ్రెషన్ పై స్పందించాడు రణ్ వీర్ సింగ్. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె 2014లో తీవ్ర మానసిక వేదనకు గురైన సంగతి తెలిసిందే. సందర్భం వచ్చినప్పుడల్లా గతంలో తాను ఎదుర్కొన్న డిప్రెషన్ గురించి పంచుకుంటూనే వుంటుంది దీపికా.
డిఫ్రెషన్ నుంచి ఎలా బయటపడాలో వివరిస్తుంటుందీ దీపికా.. ఇక తాజాగా దీపికా భర్త రణ్‌వీర్ సింగ్ ఈ అంశం గురించి కాఫీ విత్ కరణ్ షో లో స్పందించాడు.ఆయన మాట్లాడుతూ.. దీపిక పరిస్థితిని అర్థం చేసుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. తన మనసు ఆలోచనలు ఎక్కడో ఉండేవి. చాలాసార్లు ఏడ్చేది. నేను నిస్సహాయంగా ఉండేవాడిని. ఏం చేయాలో అర్ధంకాక ఆమె కుటుంబానికి కబురుపెట్టాను అన్నారు.
అంతే కాదు... డిప్రెషన్ చాలా భయంకరమైనది. దానిపై అవగాహన, కౌన్సెలింగ్ చాలా అవసరం. డిప్రెషన్‌తో పోరాడుతున్న వ్యక్తిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పుకొచ్చారు రణ్‌వీర్ సింగ్. రణ్ వీర్ లాంటి అర్ధం చేసుకునే భర్త దొరకడం.. ఆమె అదృష్టం అంటున్నారు నెటిజన్లు.
అంతే కాదు... డిప్రెషన్ చాలా భయంకరమైనది. దానిపై అవగాహన, కౌన్సెలింగ్ చాలా అవసరం. డిప్రెషన్‌తో పోరాడుతున్న వ్యక్తిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పుకొచ్చారు రణ్‌వీర్ సింగ్. రణ్ వీర్ లాంటి అర్ధం చేసుకునే భర్త దొరకడం.. ఆమె అదృష్టం అంటున్నారు నెటిజన్లు.
ఇక దీపికా విషయానికి వస్తే.. ఆమె డిప్రషన్ నుంచి కోలుకున్న తరువాత అలాంటి సమస్యలతో బాధపడే వారికి అండగా నిలుస్తోంది. ఈ క్రమంలోనే 2015లో ది లివ్ లవ్ లాఫ్ అనే ఫౌండేషన్‌కు శ్రీకారం చుట్టింది. ఆందోళనలు, ఒత్తిళ్లతో సతమతమయ్యే ఎంతోమందికి ఈ వేదికగా ప్రముఖ నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పిస్తోంది.