- Home
- Entertainment
- Entertainment News
- రష్మిక మందన్నను భయపెట్టిన రన్బీర్ కపూర్.. అలా పిలవడం తనకు నచ్చలేదంట.! నేషనల్ క్రష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
రష్మిక మందన్నను భయపెట్టిన రన్బీర్ కపూర్.. అలా పిలవడం తనకు నచ్చలేదంట.! నేషనల్ క్రష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
యంగ్ బ్యూటీ రష్మిక మందన్న (Rashmika Mandanna) రన్బీర్ కపూర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. రన్బీర్ కపూర్ ను చూసి భయమేసిందని చెప్పుకొచ్చింది. వీరిద్దరూ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ‘యానిమల్’లో నటిస్తున్నారు.

రష్మిక మండన్న టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన అతికొద్ది కాలంలోనే నేషనల్ క్రష్ గా పేరొందింది. యువత కలల రాణిగా మారింది. రష్మిక వరుస చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటీవల బాలీవుడ్ కు కూడా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ పాపులారిటీ తారా స్థాయికి చేరింది.
ప్రస్తుతం బాలీవుడ్ లో తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతోందీ ఈ బ్యూటీ. ఇప్పటికే ఐకాన్ స్టార్ అర్జున్ నటించిన ‘పుష్ఫ : ది రైజ్’ చిత్రంతో నార్త్ ఆడియెన్స్ ను ఊర్రూతలూగించింది. తన అందం, అభినయంతో కట్టిపడేసింది. ఇక ఇప్పుడు నేరుగా హిందీ చిత్రాల్లోనే నటిస్తూ ప్రేక్షకులను అలరించనుంది.
రష్మిక మందన్న, బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ (Ranbir Kapoor)జంటగా నటిస్తున్న పాన్ ఇండియన్ హిందీ ఫిల్మ్ ‘యానిమల్’. ఈ చిత్రానికి ‘అర్జున్ రెడ్డి’ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవల మనాలిలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా రష్మిక ఓ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ రన్బీర్ కపూర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
Animal మూవీ చిత్రీకరణలో భాగంగా మనాలిలో రన్బీర్ తో షూటింగ్‌లో ఉంది. అతనితో ఆమె పని అనుభవం గురించి మాట్లాడుతూ.. ఫస్ట్ టైం రన్బీర్ ను చూడగానే భయం వేసిందని తెలిపింది. ఎందుకో ఆయన తనలో భయం పుట్టించాడంది.
కానీ సెట్స్ లోకి వచ్చిన ఐదు నిమిషాల్లోనే రన్బీర్ చాలా క్లోజ్ అయ్యాడని చెప్పుకొచ్చింది. అయితే తనను రన్బీర్ ‘మేడమ్’ అని పిలిచారని, తొలిసారి ఇలా పిలిచింది ఆయననేని చెప్పింది. అలా పిలవడం తనకు అస్సలు నచ్చలేదని చెప్పింది. కానీ రన్బీర్, సందీప్ తో కలిసి వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉందంది.
అలాగే తన కేరీర్ గురించి మాట్లాడుతూ... తను మరిన్ని పాన్ ఇండియన్ చిత్రాల్లో నటించాలని భావిస్తున్నట్టు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చే సినిమాలో నటించే దిశగా అడుగులు వేస్తున్నట్టు ఈ బ్యూటీ వెల్లడింది. రన్బీర్ తో నటిస్తున్న ‘యానిమల్’ తనకు బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చిపెడుతుందని ధీమా వ్యక్తం చేసింది.
రష్మిక మరియు రణబీర్ నటించిన యానిమల్‌కు టి-సిరీస్ మద్దతు ఇస్తుంది. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ మరియు క్రిషన్ కుమార్ లకు చెందిన టి-సిరీస్, మురాద్ ఖేతానికి చెందిన సినీ1 స్టూడియోస్ మరియు ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్సర్స్ పై నిర్మిస్తున్నారు. మూవీని వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల చేయాలని ప్లాన్ చేశారు.
హిందీలో యానిమల్‌తో పాటు, సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ‘మిషన్ మజ్ను’లో కూడా రష్మిక కనిపించనుంది. అమితాబ్ బచ్చన్ మరియు నీనా గుప్తాలతో కలిసి నటించిన ‘గుడ్ బై’ చిత్రం కూడా తర్వలో ప్రేక్షకుల ముందుకు రానుంది. వచ్చే ఏడాది విడుదల కానున్న దళపతి 66లోనూ రష్మిక హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. అదేవిధంగా అల్లు అర్జున్ సరసన ‘పుష్ఫ : ది రూల్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.