- Home
- Entertainment
- Entertainment News
- నాగ శౌర్య ‘కృష్ణ వ్రింద విహారి’ రిలీజ్ కు తిప్పలు.. మరోలా ప్లాన్ చేస్తున్న మేకర్స్.!
నాగ శౌర్య ‘కృష్ణ వ్రింద విహారి’ రిలీజ్ కు తిప్పలు.. మరోలా ప్లాన్ చేస్తున్న మేకర్స్.!
యంగ్ హీరో నాగ శౌర్య నటించిన తాజా చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. నాగ శౌర్య అభిమానులు ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నా.. రిలీజ్ కు మాత్రం నోచుకోవడం లేదు. దీంతో మేకర్స్ మరోలా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య (Naga Shaurya) వరుస సినిమాలతో జోరు పెంచారు. అశ్వద్దామ, లక్ష్య మూవీలతో యాక్షన్ సీన్లను చూపించే ప్రయత్నం చేసినా.. కొంత బెడిసికొట్టడంతో ఇక ఫ్యామిలీ అండ్ ఎంటర్ టైన్ మెంట్ మూవీల వైపు ఫోకస్ పెట్టాడు.
ఈ జోనర్ లో ఇటీవల వచ్చిన ‘వరుడు కావలెను’ మూవీతో మళ్లీ మంచి రెస్సాన్స్ ను సొంతం చేసుకున్నాడు నాగశౌర్య. తాజాగా మరో లవ్ స్టోరీ ‘కృష్ణ వ్రింద విహారి’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రానికి అనీష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఐరా క్రియేషన్స్ పతాకంపై నిర్మాతలు ఉషా ముల్పూరి రూపొందించారు.
అయితే ఇప్పటికే ఈ చిత్రం ప్రేక్షకుల ముందకు రావాల్సి ఉంది. రెండేండ్ల కిందనే సినిమాను ప్రకటించి పదిరోజుల వ్యవధిలోనే ప్రకటించినా ఇప్పటికీ రిలీజ్ కు నోచుకోవడం లేదు. ఇప్పటికే చిత్రం రిలీజ్ కు సర్వం సిద్ధమవగా.. మూడు రిలీజ్ డేట్లను అనౌన్స్ చేశారు. కానీ విడుదలకు పెద్ద సినిమాలు అడ్డువస్తున్నాయని మేకర్స్ భావిస్తున్నారంట.
తొలుత ఏప్రిల్ 22న సినిమాను రిలీజ్ చేయాలని షెడ్యూల్ చేశారు. తర్వాత వాయిదా వేస్తూ మే 20కి మార్చారు. ఈ డేట్ కూడా సెట్ కాకపోవడంతో చివరిగా జూన్ 24న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. తాజా సమాచారం ప్రకారం.. చిత్ర రిలీజ్ ను మరోసారి కూడా వాయిదా వేయనున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు ఈ చిత్రానికి సరైన డేట్స్ దొరకకపోవడంతో నాగ శౌర్య అభిమానులు కూడా అప్సెట్ అవుతున్నారు. అభిమానులను ద్రుష్టిలో ఉంచుకొని డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంటూ టాక్ వినిపిస్తోంది. దీంతో అందరూ షాక్ లో ఉన్నారు. ఇందులో నిజమెంత ఉందో మున్ముందు చూడాలి.
ఈ ఏడాది నాగశౌర్య ఏకంగా నాలుగు చిత్రాల్లో నటిస్తున్నాడు. వీటిలో ‘కృష్ణ వ్రింద విహారి’ ఒకటి. ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం పాటు నాగశౌర్య ‘ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి’, ‘నారి నారి నడుమ మురారి’, ‘పోలీస్ వారి హెచ్చరిక’ చిత్రాల్లో నటిస్తున్నారు.