ఆయన బయోపిక్ ... ప్రియదర్శి చేయబోతున్నారా?
Priyadarshi: ప్రియదర్శి త్వరలో బయోపిక్ లో నటించే అవకాశం ఉంది, అలాగే 'కోర్ట్' మూవీలో హీరోగా నటిస్తున్నాడు, తను నటించిన 'డార్లింగ్' సినిమా ఫెయిల్ అవ్వడం గురించి మాట్లాడారు.

Priyadarshi: ప్రియదర్శి కెరీర్ ప్రారంభం నుంచి కాస్తంత డిఫరెంట్ గానే వెళ్తున్నారు. కేవలం కమిడియన్ గా మిగిలిపోవాలనుకోవటం లేదు. తనే హీరోగా వైవిధ్యమైన కాన్సెప్టు లతో ‘బలగం’, ‘మల్లేశం’ లాంటి ఇంట్రస్టింగ్ సినిమాలు చేస్తున్నారు.
అందుకోసం బలమైన కథలు ఎంచుకొంటున్నాడు. ఆ క్రమంలోనే ఇప్పుడు నాని నిర్మాతగా తీసిన ‘కోర్ట్`లోనూ తనే హీరోగా చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రియదర్శి ఓ బయోపిక్ లో చేయబోతున్నారు అనే వార్త అంతటా హాట్ టాపిక్ గా మారింది.
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ప్రియదర్శి దృష్టి ఇప్పుడు ఓ బయోపిక్ పై పడింది. శాంతా బయోటెక్ ఫౌండర్ వర ప్రసాద్ బయోపిక్ చేయాలని ఉందన్న ఆలోచనని మీడియా దగ్గర వ్యక్తం చేయటమే అందుకు కారణం.
అయితే ఏ ప్రపోజల్స్ లేకుండా ప్రియదర్శి లాంటి స్టార్ కమిడియన్ కమ్ హీరో మీడియా దగ్గర మాట్లాడరు. అయితే ఆ ప్రపోజల్స్ ఇంకా క్షేత్ర స్దాయిలోనే ఉన్నాయని, ముందుకు వెళ్లలేదని, అందుకే కన్ఫర్మ్ గా చెప్పలేదని చెప్తున్నారు.
అయితే శాంతా బయోటిక్ వర ప్రసాద్ ది చాలా స్ఫూర్తివంతమైన గాథ అని, అందులో సినిమాకు కావల్సిన ముడిసరుకులు ఉన్నాయని, ప్రియదర్శి వంటి నటుడు చేస్తే నెక్ట్స్ లెవిల్ లో ఉంటుందని చెప్తున్నారు.
Priyadarshis Darling song lyrical video out
ప్రియదర్శి మాట్లాడుతూ.. ‘‘నాకు శాంత బయోటిక్ వ్యవస్థాపకుడు కె.ఐ.వరప్రసాద్ రెడ్డి బయోపిక్ చేయాలని ఉంది. చాలా ఎక్కువ ఖర్చయ్యే ఎన్నో మెడిసెన్స్‌ని చౌక ధరల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన రియల్ హీరో ఆయన.
అందుకే ఆయన జీవితకథ తెరపైకి తీసుకురావాలని ఉంది (Priyadarshi About Biopic). ఆ మధ్య బ్రహ్మానందం తనయుడి పెళ్లిలో ఆయన్ని కలిసినప్పుడు తన దగ్గర బయోపిక్ విషయాన్ని ప్రస్తావించా. ఆ మాట విని తను నవ్వుతూ వెళ్లిపోయారు. ఈసారి మళ్లీ కలిసినప్పుడు ఆయన్ని ఎలాగైనా ఒప్పిస్తా’’.
‘కోర్ట్’ ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అంతకుముందే స్పెషల్ ప్రీమియర్స్ ప్లాన్ చేశారు.