#Prabhas: ప్రభాస్ సోషల్ మీడియా సీక్రెట్, లీక్ అయ్యిపోయిందే
#Prabhas: ప్రభాస్ సోషల్ మీడియా ఖాతా గురించిన కొన్ని షాకింగ్ విషయాలను నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ వెల్లడించారు. ప్రభాస్ సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి ఇష్టపడతారని, సింపుల్ లైఫ్ ను ఇష్టపడతారని పృథ్వీరాజ్ తెలిపారు.

ఫ్యాన్స్ ఇండియా మార్కెట్ ఉన్న ప్రభాస్ కు అభిమానులు ఎంత మంది ఉన్నారో లెక్కేలేదు. ముఖ్యంగా బాహుబలి తర్వాత ఆయనకు నార్త్ ఇండియా మార్కెట్ యాడ్ అవ్వటం ప్లస్ అయ్యింది. ఈ క్రమంలో ఆయన సోషల్ మీడియా ఎక్కౌంట్ ని కోట్లలో ఫాలో అవుతూండటంతో వింతేలేదు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభాస్‌కి 13 మిలియన్‌ల ఫాలోవర్స్ ఉంటారు. అయితే ప్రభాస్ నుంచి చాలా రేర్‌గా మాత్రమే పోస్ట్‌లు వస్తూ ఉంటాయి. ప్రభాస్ ఫుల్ బిజీగా ఉండటం వలన ఇలా జరుగుతోందనుకుంటారు. అయితే అసలు సీక్రెట్ వేరు.
ప్రభాస్‌కి ఉన్న పాన్ ఇండియా క్రేజ్ నేపథ్యంలో నెటిజన్స్ ఆయన ఖాతాను భారీ ఎత్తున ఫాలో అవుతూంటారు. అయితే రేర్‌గా మాత్రమే ప్రభాస్ నుంచి పోస్ట్‌లు వస్తూ ఉంటాయి. ఆ పోస్ట్‌లు కూడా ప్రభాస్ కాకుండా ఆయన టీం మెంబర్స్ వేస్తారని నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పుకొచ్చారు.
సోషల్ మీడియా అంటే పెద్దగా నచ్చని వ్యక్తి ప్రభాస్ అని, ఆయనకు ఎప్పుడూ మొబైల్‌కి దూరంగా ఉండాలి అనుకుంటారు. ఆయనకు సంతోషాన్ని ఇచ్చేవి చాలా చిన్న చిన్న విషయాలు. వాటిని వెతుక్కుంటూ ఉంటాడని పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పుకొచ్చారు.
Prabhas
పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ.... ప్రభాస్ ఎంత పెద్ద గొప్ప స్టార్ అయినా చాలా సింపుల్‌గా ఉంటాడు. స్టార్‌డం గురించి ఎప్పుడూ ఆలోచించరు. ప్రభాస్ పేరుతో ఉన్న ఇన్‌స్టా గ్రామ్ నుంచి వచ్చే పోస్ట్‌లు సైతం ఆయన చేయరు. ఈ మాటలతో ఫ్యాన్స్‌కి నిరాశ కలిగించి ఉంటే క్షమించాలి.
ఫామ్ హౌస్‌లో సంతోషంగా గడుపుతూ ఉంటారు. మొబైల్ పని చేయని చోటుకు వెళ్దామని అంటూ ఉంటారు. చాలా మంది మొబైల్ లేకుంటే ఉండలేరు. కానీ ప్రభాస్ మాత్రం మొబైల్ లేకుంటే బాగుండు అనుకుంటారు. ఈ కాలంలో అలాంటి వారు ఉండటం చాలా అరుదుగా చూస్తూ ఉంటామని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు.