షాకింగ్ రేటుకు ప్రభాస్ 'రాజా సాబ్' ఆడియో రైట్స్
నవ్వించమే పనిగా ఉండే ఈ హారర్ కామెడీలో ఓ రీమిక్స్ సాంగ్ ఉంటే బాగుంటుందని మారుతి భావిస్తున్నారట.
Prabhas, The Raja Saab, maruthi
ప్రభాస్ కల్కి సూపర్ హిట్ తో ఆయన నెక్ట్స్ పిక్చర్ రాజా సాబ్ బిజినెస్ వర్గాల్లో క్రేజ్ మామూలుగా లేదు. మారుతి దర్శకుడు కాబట్టి పెద్దగా క్రేజ్ లేదనుకున్న వాళ్లకు ఈ ప్రాజెక్టుకు వస్తున్న బిజినెస్ ఆఫర్స్ చూస్తూంటే మతిపోతోంది. అఫ్ కోర్స్ అది ప్రభాస్ కు పెరిగిన ప్యాన్ ఇండియా మార్కెట్, సక్సెస్ , ఫామ్ లో ఉండటం వంటి కారణాలు కావచ్చు.
కానీ ప్రభాస్ తో సినిమా చేస్తున్న వాళ్లకి అవన్నీ కలిసొచ్చే అంశాలే. ప్రభాస్ సినిమా అంటే వందల కోట్లకు చేరుకుంది. అలాంటప్పుడు రిటర్న్స్ ఏ స్దాయిలో ఉంటాయా అని లెక్కలేసుకునే నిర్మాత చేస్తారు. కానీ సినిమాకు వస్తున్న బిజినెస్ ఆఫర్స్ ..ఆ లెక్కలను దగ్గర రానిచ్చే పరిస్దితి లేదంటున్నారు. తాజాగా ఈ చిత్రం ఆడియో రైట్స్ కు పలికిన రేట్లే అందుకు నిదర్శనం అంటున్నారు.
Prabhas, The Raja Saab, maruthi
ఈ స్దాయి క్రేజ్ కు ప్రభాస్ కొత్త తరహా కథలో నటిస్తుండడం ఓ విశషమైతే... ఇందులో ఆయన కొత్త స్టైల్‌తో కనిపించటం మరో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని ‘రాజాసాబ్’టీమ్ చెబుతోంది. ‘రాజాసాబ్’ఆడియో హక్కుల్ని టీ సిరీస్ రూ.25 కోట్లకు సొంతం చేసుకొంది.
తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్, తమన్ కాంబినేషన్ అంటే ఖచ్చితంగా మాస్, కమర్షియల్ బీట్స్ ఉంటాయిని అంచనా వేస్తున్నారు. ‘రాజాసాబ్’ టైటిల్ ట్రాక్ కూడా ఓ రేంజిలో ఉంటుందని చెప్పుకుంటున్నారు. దానికి తగినట్లు ఓ బాలీవుడ్ క్లాసిక్ పాటను ఈ సినిమా కోసం రీమిక్స్ చేయబోతున్నారని మీడియా వర్గాల సమాచారం అందుతోంది.
Prabhas, The Raja Saab, maruthi
నవ్వించమే పనిగా ఉండే ఈ హారర్ కామెడీలో ఓ రీమిక్స్ సాంగ్ ఉంటే బాగుంటుందని మారుతి భావిస్తున్నారట. ప్రభాస్ సినిమాలోదే ఓ పాట తీసుకుందామనుకున్నారు కానీ ఆ తర్వాత రకరకాల కారణాలతో వద్దనుకున్నారుట. ఇప్పుడు 1980 లలో వచ్చిన ఓ పాత హిందీ పాటను రీమిక్స్ చేస్తే బాగుంటుందని మారుతి భావిస్తున్నారట. ఆ మేరకు సంగీత దర్శకుడు తమన్ తో చర్చలు జరుపుతున్నారు.
Prabhas, The Raja Saab, maruthi
రీమిక్స్ కోసం హిందీ వింటేజ్ సాంగ్ రెండు మూడు అనుకున్నారట. వాటిలో ఒకటి ఫైనలైజ్ చేసి మందుకు వెళ్తారట.సెకండాఫ్ లో ముగ్గురు హీరోయిన్స్ తో ఓ స్పెషల్ సాంగ్ లా ఈ రీమిక్స్ సాంగ్ రాబోతోందిట. ఇక ఆ సూపర్ హిట్ సాంగ్ రైట్స్ తీసుకున్నాక అప్పుడు అఫీషియల్ గా చెప్పే అవకాసం ఉంది. ఏదైమైనా రీమిక్స్ సాంగ్ సరైంది పడితే థియేటర్స్ లో మంచి ఊపు వస్తుంది. ఆ టెక్నికే మారుతి చెయ్యబోతున్నారు.
ప్రస్తుతం హిందీ పాట రైట్స్ విషయంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ బాలీవుడ్ టీమ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. రైట్స్ అందిన తరవాత.. ఈ పాట విషయం బయిటకు వస్తుంది. హారర్, కామెడీ జోనర్లో సాగే ఈ సినిమాలో సంజయ్‌దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ కి పెద్ద పీట వేశారని తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ కథానాయికలు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
Prabhas, Hanu Raghavapudi, KALKI
ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఓ కీలక అప్‌డేట్‌ని ప్రకటించనున్నట్టు సినీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. 23న ఓ గ్లింప్స్ కానీ, మోషన్ పోస్టర్ కానీ విడుదల చేస్తారు. ప్రభాస్ తన కెరీర్‌లో చేస్తున్న తొలి రొమాంటిక్ హారర్ చిత్రమిదే.
ఆయన లుక్ ఇందులో చాలా కొత్తగా ఉంటుందని, అంచనాలకి తగ్గట్టుగానే ఓ మైలురాయిగా నిలిచిపోయే చిత్రమిదని నిర్మాణ వర్గాలు తెలిపాయి. భారీ హంగులతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, ఛాయాగ్రహణం: కార్తీక్ పళని, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ప్రొడక్షన్ డిజైన్: రాజీవన్.