- Home
- Entertainment
- Entertainment News
- 'కల్కి' సీన్ రివర్స్: ఆంధ్రాలో అడ్డమే లేదు, తెలంగాణాలో కష్టమేనా ?
'కల్కి' సీన్ రివర్స్: ఆంధ్రాలో అడ్డమే లేదు, తెలంగాణాలో కష్టమేనా ?
ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా వాడు కావటం, చంద్రబాబు మొదటి నుంచి సినిమా వాళ్లకు అనుకూలంగా ఉండటంతో ...

రాజకీయాలకు, సినిమాలకు లింక్ ఉంటుందనేది నిజం. రాజకీయ పరిణామాలు బట్టే సినిమాల కలెక్షన్స్ మారిపోతున్నాయి. సినిమాలకు వచ్చే బెనిఫిట్స్ లోనూ తేడాలు వచ్చేస్తున్నాయి. నిన్న మొన్నటి దాకా ఆంధ్రాలో ముఖ్యమంత్రి వేరు. దాంతో చంద్రబాబుకు సపోర్ట్ గా ఉన్న అశ్వనీదత్ సినిమాకు ఏ రకమైన దెబ్బ తగులుతుందో అని భయపడ్డారు. అంతేకాదు తక్కువ సినిమా టిక్కెట్ రేట్లతో పెద్ద సినిమాల రికవరీలు ఆంధ్రాలో కష్టమైపోయిన పరిస్దితి. తెలంగాణాలో ఏ సమస్యాలేదనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది.
అంతెందుకు ప్రభాస్ గత చిత్రం సలార్ సినిమాకు నైజాంలో మంచి లాభాలు రాగా, ఆంధ్రాలో నష్టాలు వచ్చాయి. రికవరీలు అవ్వలేదు. దాంతో నిర్మాత స్వయంగా నష్టపోయిన వాళ్లకు సెటిల్మెంట్ చేసారు. దాంతో ఆంధ్రా మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ లు అమ్మకాలు చేయాల్సిన సిట్యువేషన్. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా వాడు కావటం, చంద్రబాబు మొదటి నుంచి సినిమా వాళ్లకు అనుకూలంగా ఉండటంతో ఖచ్చితంగా ఇప్పుడు అన్నీ మారతాయని భావిస్తున్నారు.
ఈ క్రమంలో ఇప్పుడున్న పరిస్దితిల్లో కల్కి సినిమాకు ఆంధ్రావరకూ ఇంక బెంగలేని సిట్యువేషన్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్- బాలీవుడ్ బ్యూటి దీపికా పదుకొణె నటించిన 'కల్కి 2898 AD' సినిమా భారీ బడ్జెట్ తో తీయటంతో అందుకు తగ్గట్లుగా టిక్కెట్ రేట్లు పెంచుతారని తెలుస్తోంది. ఈ మేరకు సినిమా రిలీజ్ కు ముందు జీవో ఇస్తారని చెప్పుకుంటున్నారు.
అలాగే ఇప్పుడు కల్కి సినిమాకు మినిమం రెండు వారాలైనా రోజుకు ఆరు షోలు చొప్పున పడాలని అర్జీ పెడదామనే ప్లానింగ్ లో ఉందిట కల్కి టీమ్. ఇది కల్కి ఆంద్రా డిస్ట్రిబ్యూటర్స్ ని ఆనందంలో ముంచే వార్త. అప్పుడు కలెక్షన్స్ ఓ రేంజిలో వస్తాయి. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే. అటు టిక్కెట్ రేటు పెరిగి, ఆరు షోలు చొప్పున సినిమాలు ప్రదర్శనలు జరిగితే మళ్లీ పాత రోజుల్లోలాగ కలెక్షన్స్ కుమ్మేయచ్చు అనేది నిర్మాణ సంస్ద ప్లానింగ్ గా చెప్తున్నారు.
ఇక బెనిఫిట్ షోలకు ఫర్మిషన్స్ కు ఆంధ్రాలో అసలు సమస్యే రాదు. బెనిఫిట్ షో టిక్కెట్ రేట్లు కూడా థియోటర్ ని బట్టి 1000 నుంచి 2500- 3000 దాకా పలికే అవకాసం ఉందంటంటున్నారు. అయితే చిక్కంతా తెలంగాణాలో వచ్చేలా కనపడతుతోంది. ఇప్పటికే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఓనర్స్ అశోశియేషన్ బెనిఫిట్ షోలకు, స్పెషల్ షోలకు తమ థియేటర్స్ ఇవ్వమని ప్రకటించింది. దాంతో కల్కి సినిమాకు తెలంగాణాలో ఆరు షోలు ఉంటాయి కానీ బెనిపిట్ షోలు పడవు. అప్పటికప్పుడు ఏమన్నా థియేటర్స్ యజమానులుతో మాట్లాడి ఇష్యూ పరిష్కరించుకుంటే తప్ప ఈ ఇష్యూ తేలదు.
ఇక టిక్కెట్ రేటు ఎంత రేటు ఎలా ఉన్నా ఫ్యామిలీలతో కలిసి మరీ ఈ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్‌ను బిగ్ స్క్రీన్‌పై చూడటానికి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమాకు పైరసీ పరంగా కూడా పెద్ద దెబ్బ కొట్టే అవకాసం తక్కువ. ఎందుకంటే ఈ స్దాయి విజువల్స్ ని తెరపైనే చూడటానికి ఉత్సాహం చూపిస్తారు.
ఈ సినిమా మహాభారతంలోని పాత్రల ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమా కథ ఆరు వేల సంవత్సరాల కిందట మొదలై 2898 సంవత్సరంలో ముగుస్తుందని అందుకే సినిమా టైటిల్లో ఈ సంవత్సరాన్ని జత చేశారనీ అంటున్నారు. టైమ్ ట్రావెల్ సినిమాలు మనకు కొత్త కానప్పటకీ భారతదేశ భవిష్యత్ నేపథ్యంలో ఎలాంటి చిత్రాలు రాలేదనీ, దీంతో ఈ సినిమా కచ్చితంగా ప్రత్యేకంగా నిలుస్తుందని దర్శకుడు నాగ్ అశ్విన్ ఇటీవల ముంబయిలో పాల్గొన్న ఓ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా 'కల్కి 2898 AD' సినిమా ఎలా ఉంటుంది? సైన్స్ ఫిక్షన్ జానర్ అంటే ఏంటి? ఈ అంశాలపై ఓ అవగాహన కల్పించేలా సినిమా థియేటర్లలోకి రాకముందు ఓటీటీలో ప్రీల్యూడ్ వీడియో రిలీజ్ చేసారు. ఇది యానిమేటెడ్ వీడియో. ఇందులో ప్రభాస్ క్యారెక్టర్‌కు సొంతంగా ఆయనే డబ్బింగ్ చెప్పుకున్నారు. బుజ్జి భైరవ టైటిల్ తో వచ్చిన ఈ వీడియో అమేజాన్ లో రిలీజ్ అయ్యి వైరల్ అవుతోంది.
ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయానికి వస్తే ...ఒకవేళ ప్రభుత్వం మారిపోతే ప్రీరిలీజ్ ఈవెంట్ ఏపీలో చేద్దామని, మారకపోతే హైదరాబాద్ లో చేద్దామని అశ్వనీదత్ నిర్ణయించారు. ఏపీలో ప్రభుత్వం మారి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో ఈ సినిమా ఈవెంట్ ఏపీలోనే జరుగుతుందని చెబుతున్నారు. అమరావతిలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టే అవకాసం ఉందని తెలుస్తోంది.