MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Entertainment News
  • పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై షాకింగ్ న్యూస్?

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై షాకింగ్ న్యూస్?

 గబ్బర్‌ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. 

2 Min read
Author : Surya Prakash
Published : Jul 29 2024, 08:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


 పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లైనప్‍లో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్న సంగతి తెలసిందే. వీటిలో హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంపై ఓ రేంజి క్రేజ్ ఉంది. వీరి కాంబోలో గతంలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో వీరి కాంబో మళ్లీ వస్తోందనగానే అంచనాలు మామూలుగా లేవు. ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి ప్రత్యేకమైన టీజర్ రిలీజ్  అయ్యి వైరల్ అయ్యింది. అయితే సినిమా షూట్ మాత్రం పూర్తి కాలేదు. కారణం అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పూర్తి బిజీగా ఉన్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా నే మొదట ప్రయారిటీ అనుకున్నారు ఓ టైమ్ లో  పవన్ కల్యాణ్ .  ఎలక్షన్స్ సమయంలో  రాజకీయాల్లో పవన్ బిజీగా ఉండటంతో ఆ సినిమాల షూటింగ్ నిలిచింది. షూటింగ్ కూడా కొంత భాగమే జరిగింది. ఎన్నికల తర్వాత పవన్ కల్యాణ్ షెడ్యూల్‍ను బట్టి ఈ మూవీ చిత్రీకరణ ముందుకు సాగనుందనే క్లారిటీ వచ్చింది. అనూహ్యంగా జనసేన ఘన విజయం సాధించటం..ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఛార్జ్ తీసుకోవటం ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. 

36


పొలిటికల్ కమిట్మెంట్స్ తో ఆయన సినిమాలు మల్టిపుల్ గా ప్రొడక్షన్ డిలే లు ఎదుర్కొంటున్నారు. అయితే పవన్ తన వల్ల ఎవరూ నష్టపోకూడదని సినిమాలకు వీలు చూసుకుని సమయం కేటాయించి పెండింగ్ వర్క్ లు ఫినిష్ చేస్తామన్నారు. ఆయన షూటింగ్ కు డేట్స్ ఇవ్వటానికి త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. అభిమానులు సైతం త్వరలోనే ఆ సినిమాలు ప్లోర్ కు వెళ్తాయని భావిస్తున్నారు. 

46

అయితే మొదట ఏ సినిమాకు ప్రయారిటీ ఇస్తారు అంటే హరి హర వీరమల్లు, ఓజీ చిత్రాలు అని తెలుస్తోంది. దాంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’లేటు అయ్యేలా ఉంది. ఈ విషయం గమనించిన దర్శకుడు హరీష్ శంకర్ ఈ లోగా రవితేజతో మిస్టర్ బచ్చన్ చిత్రం పూర్తి చేసారు. అలాగే ఇప్పుడు రామ్ పోతినేనితో సినిమా ప్రకటించారు.  దానికి తోడు ఎలక్షన్స్ ముందు రిలీజ్ అవుతుందని రాసుకున్న కొన్ని పొలిటికల్ సెటైర్ డైలాగులు సైతం మారుస్తున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.  ఇవన్నీ చూస్తూంటే  ఖచ్చితంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’లేటు అవుతుందనే అనిపిస్తోంది. ఇది హరీష్, పవన్ అభిమానులకు కాస్తంత నిరాశకలిగించే వార్తే. 

56


ఇక ఇన్నాళ్లుగా రామ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ సినిమా రాబోతోందని ప్రచారం జరిగింది. ఇప్పుడు స్వయంగా హరీష్ శంకర్ ఈ సినిమాని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. తాజాగా జరిగిన మిస్టర్ బచ్చన్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో హరీష్ ఈ సినిమా ప్రస్తావన తీసుకొచ్చారు రామ్ గురించి మాట్లాడుతూ.. రామ్ నాకు చాలా క్లోజ్. తనతో సినిమా చేస్తున్నాను జవాన్ సినిమా నిర్మించిన కృష్ణ కొమ్మలపాటి ఈ సినిమాకు నిర్మాత’ అని ప్రకటించారు హరీష్.  
  

66

ఏదైమైనా గబ్బర్‌ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. విజయ్ తేరీ సినిమాను ఇక్కడి నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసినట్టుగా కనిపిస్తోంది.  గబ్బర్ సింగ్‌ను మించేలానే ఉండబోతోన్నట్టుగా అనిపిస్తోంది. ఈ చిత్రంలో శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఈ చిత్రంలో కీ షెడ్యూల్ కోసం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్‌ సాయి నేతృత్వంలో స్పెషల్ సెట్‌ వేయించారు కూడా. 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved