క్రేజ్ కా బాప్: ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో పవన్ కల్యాణ్‌పై ప్రశ్న
‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో పవన్ కల్యాణ్‌కు సంబంధించిన ప్రశ్న అడిగారు.
pawan Kalyan, chiranjeevi, gabbar singh, nagabau
పవన్ (Pawan Kalyan) రాజకీయాల్లోనూ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. తన పార్టీ నుంచి పోటీ చేసిన ప్రతి ఒక్కరూ అత్యధిక మెజారిటీతో విజయం సాధించడంతో. పవన్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది.
Pawan Kalyan
ఈ క్రమంలో ప్రఖ్యాత ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షోలో (kaun banega crorepati) పవన్ కల్యాణ్‌కు సంబంధించిన ప్రశ్న అడగడం విశేషం.
వివరాల్లోకి వెళితే...ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్‌పతి’ 16వ సీజన్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ దీనికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.
pawan Kalyan, chiranjeevi, gabbar singh, nagabau
తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో బిగ్‌బీ ఓ కంటెస్టెంట్‌ను పవన్‌కు సంబంధించిన ప్రశ్న అడిగారు. ‘2024 జూన్‌లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నటుడు ఎవరు?’ అని అడిగారు.
కంటెస్టెంట్ ఈ ప్రశ్నకు ‘ఆడియన్స్ పోల్’ ఆప్షన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆడియన్స్‌లో 50 శాతం మందికి పైగా పవన్ కల్యాణ్ అని చెప్పారు.
దీంతో వారు పవన్ పేరు చెప్పి లాక్ చేశారు. అది సరైన సమాధానం కావడంతో కంటెస్టెంట్ రూ.1.60లక్షలు గెలుచుకొని తర్వాత ప్రశ్నకు వెళ్లారు.
పవన్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉండడంతో ఆయన సినిమాల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూటింగ్‌ను ఆయన పూర్తి చేయాల్సి ఉంది.
పవన్ కల్యాణ్ నుంచి రావాల్సి ఉన్న సినిమాల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒకటి. హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే ఓ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. పవన్ రాజకీయాలతో బిజీ కావడం వల్ల తాత్కాలికంగా ఆగిన సంగతి తెలిసిందే.
మరికొన్ని వారాల్లో దీని చిత్రీకరణను పునఃప్రారంభించనున్నట్లు మైత్రీ మూవీస్ స్పష్టత ఇచ్చింది. ఈ విషయమై ఇటీవలే పవన్‌తో కలిసి మాట్లాడినట్లు వెల్లడించింది. డిసెంబరు, జనవరి నాటికి చిత్రీకరణ పూర్తి చేసేలా ప్రణాళిక రచిస్తున్నట్లు తెలిపింది.
సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఆయా చిత్రాల షూటింగ్ వాయిదా పడింది. ఈ మూడు సినిమాల ప్రచార చిత్రాలు, గ్లింప్స్ ఇప్పటికే మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకున్నాయి. సినిమాల్లో నటిస్తానని ఇటీవల పవన్ స్వయంగా ప్రకటించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.