MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • అఫీషియల్ : ‘హరి హరవీరమల్లు’ కొత్త రిలీజ్ డేట్

అఫీషియల్ : ‘హరి హరవీరమల్లు’ కొత్త రిలీజ్ డేట్

Harihara Veeramallu : పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా విడుదల తేదీని నిర్మాణ సంస్థ ప్రకటించింది. పవన్, నిధి అగర్వాల్ గుర్రపు స్వారీ చేస్తున్న పోస్టర్‌ను విడుదల చేశారు.

2 Min read
Author : Surya Prakash
Published : Mar 14 2025, 07:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
pawan Kalyan Harihara Veeramallu Release Date in telugu

pawan Kalyan Harihara Veeramallu Release Date in telugu


Harihara Veeramallu :  పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) హీరో గా రూపొందుతున్న పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీ ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా   రూపొందిస్తున్నారు.  ఫస్ట్ పార్ట్ కి సంబంధించి షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.

ఏడాదిగా పవన్‌ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఈ సినిమా మిగిలిన చిత్రీకరణ వాయిదా పడుతూ వస్తోంది. పవన్‌ పాత్రకు సంబంధించి 20 రోజుల షూట్‌ మాత్రమే మిగిలిఉంది. దీంతో తన సన్నివేశాలను పూర్తి చేసేందుకు పవన్‌కల్యాణ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం రిలీజ్ డేట్ ప్రకటన వచ్చి అభిమానులను ఆనందపరుస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
pawan Kalyan Harihara Veeramallu Release Date in telugu

pawan Kalyan Harihara Veeramallu Release Date in telugu


‘హరి హరవీరమల్లు’ కొత్త విడుదల తేదీ వచ్చేసింది. పవన్‌ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్న ఈ చిత్రం మే 9న రానున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.  ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ.. ఓ కొత్త పోస్టర్‌ పంచుకుంది.

ఇందులో పవన్‌, నిధి అగర్వాల్‌ ఇద్దరూ గుర్రపుస్వారీ చేస్తూ కనిపిస్తున్నారు. ఈ పోస్టర్‌తో టీమ్‌ ప్రేక్షకులకు హోలీ శుభాకాంక్షలు చెప్పింది. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ కథలో, పవన్‌కల్యాణ్‌ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్నారు.
 

33
pawan Kalyan Harihara Veeramallu Release Date in telugu

pawan Kalyan Harihara Veeramallu Release Date in telugu

రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ తొలిభాగం ‘హరి హర వీరమల్లు పార్ట్‌ 1: స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ పేరుతో విడుదల కానుంది.  ఈ సినిమా షూటింగ్ మొదలైన కొన్ని నెలలకే ప్రచారం అంటూ పవన్ వెళ్లిపోయారు. ప్రచారం వలన కొన్ని నెలలు పోయాయి.

ఆ తరువాత ఇంకొన్ని నెలలు డైరెక్టర్ క్రిష్ ప్రాజెక్ట్ నుంచి తప్పిపోవడంతో ఈ షూటింగ్ ఆగింది. ఇక క్రిష్ స్థానంలోకి ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణ ఎంటర్ అయ్యాడు.

అప్పటికే సగంకు పైగా షూటింగ్ ఫినిష్ అవ్వడంతో క్లైమాక్స్ మాత్రం జ్యోతికృష్ణ డైరెక్ట్ చేసి ఎలాగోలా సినిమాను ఫినిష్ చేశాడు. అనుపమ్‌ఖేర్‌, బాబీ దేవోల్‌, నిధి అగర్వాల్‌, నోరాహి ఫతేహి, విక్రమ్‌ జీత్‌, జిషుసేన్‌ గుప్త తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, నిర్మాత: ఎ.దయాకర్‌ రావు, సమర్పణ: ఏ.ఎం.రత్నం.
 
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
తెలుగు సినిమా
పవన్ కళ్యాణ్
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved