‘దసరా’ కు 36 సెన్సార్ కట్స్, మార్చమన్న పదాలు,సీన్స్ ఇవే
సబ్‌టైటిల్స్‌సహా అసభ్యకరమైన సంభాషణలకు ‘మ్యూట్’ పెట్టాలని, డిస్‌క్లైమర్ (ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం) ఫాంట్ పెంచమని, వైలెన్స్ అధికంగా ఉన్న సన్నివేశాలను సీజీ (CG)తో కవర్ చేయాలని చిత్ర టీమ్ కి సూచించింది.

నాని (Nani) అభిమానులు, సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘దసరా’ (Dasara) మార్చి 30న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో నిన్న శుక్రవారం (మార్చి 24) న ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సింగరేణి బొగ్గు కార్మికుల జీవితం ఆధారంగా.. ఆసక్తికర మలుపులతో, భారీ బడ్జెట్‌తో, యాక్షన్ రస్టిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘దసరా’ లో నేచురాలిటీకి పెద్ద పీట వేసారు కానీ ...ఆ క్రమంలో చాలా సీన్స్ అభ్యంతరకంగా ఉన్నాయని, కొన్ని అసభ్యకరమైన పదాలు డైలాగులలో చోటు చేసుకున్నట్లు సమాచారం. దాంతో సెన్సార్ వారు మొత్తం 36 కట్స్ చెప్పినట్లు సమాచారం. మరో ప్రక్క అవి 36 ..కట్స్..16 కాదు అని ప్రచారం జరుగుతోంది. రెండు పార్ట్ లుగా ఇచ్చిన సెన్సార్ సర్టిఫికేట్ లో మొదట భాగంలో ఇరవై , రెండో భాగంలో 16 మొత్తం 36 కట్స్ అని సమాచారం. అయితే ఆ సెన్సార్ చెప్పిన పదాలు,సీన్స్ ఏమిటి..ఎలాంటివి...వాటికి టీమ్ ఏం సమాధానం ఇవ్వబోతున్నారనేది ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది.
మెయిన్ స్ట్రీమ్ హీరోకు సెన్సార్ వారు 16 కట్స్ చెప్పటం అంటే మాటలు కాదు. యూఏ (UA) సర్టిఫికెట్ జారీ చేసిన సెన్సార్ బోర్డు (Central Board of Film Certification) సబ్‌టైటిల్స్‌సహా అసభ్యకరమైన సంభాషణలకు ‘మ్యూట్’ పెట్టాలని, డిస్‌క్లైమర్ (ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం) ఫాంట్ పెంచమని, వైలెన్స్ అధికంగా ఉన్న సన్నివేశాలను సీజీ (CG)తో కవర్ చేయాలని చిత్ర టీమ్ కి సూచించింది.
అలాగే ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ పాటలోని లిరిక్స్.. వాడుక భాషలోని బూతు పదాలతో ఉన్నాయి.. వీటికి సెన్సార్ టీమ్ అభ్యంతరం తెలిపారు.. కొన్ని సన్నివేశాల్లో డైలాగ్స్ మ్యూట్ చేయడమే కాక సబ్ టైటిల్స్‌లో టెక్స్ట్ (కొన్ని చోట్ల) తీసెయ్యాలని మరికొన్ని కట్స్.. .. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే హెచ్చరిక ఫాంట్ సైజ్ పెంచమని చెప్పడం గమనార్హం..
అలాగే ఈ సినిమా డైలాగుల్లో వచ్చే...
1) బెంచూత్ (బెం మ్యూట్)..
2) బద్దల్ బాసింగలైతయ్ (బద్దల్ మ్యూట్)..
3) బాడకవ్ (మ్యూట్)..
చేయమని సెన్సార్ వారు సూచించారు.
Nani UC College
అలాగే ఈ పదాలతో పాటు పాటు వాడుక భాషలో రెగ్యులర్‌గా (సందర్భాన్ని బట్టి) ఉపయోగించే పదాలను మ్యూట్ చేయాలని.. అలాగే సబ్ టైటిల్స్ టెక్స్ట్‌లోనూ మ్యూట్ చేసిన పదాలను తొలగించాలని సూచించారు.. మరి ‘దసరా’ టీమ్ సెన్సార్ వారి సలహాలను ఏమేరకు పాటిస్తారో లేక వాటికి సమాధానం చెప్తారో చూడాలి..
Nani Starrer 'Dasara' Teaser Released
ఈ సినిమా పూర్తి గ్రామీణ ప్రాంత తెలంగాణ యాసతో రావడం.. కొన్ని పచ్చి బూతులు మాట్లాడాల్సి రావడం వల్లే ఈ కట్స్ పెట్టాల్సి వచ్చినట్లు చెప్తున్నారు. ఈ యాసలో అనేక రకాల పదాలకు ఊతపదాల వాడకం ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణం కావచ్చని భావిస్తున్నారు. ఆ డైలాగులు ఆ ఎమోషన్ కు ఫెరఫెక్ట్ అని టీమ్ భావిస్తున్నట్లు సమాచారం. ఇది సింగరేణి మైన్ ఫీల్డ్స్ బ్యాక్డ్రాప్లో సాగే బలమైన తెలంగాణ ఆధారిత యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది.
నాని ఈ సినిమాను దేశవ్యాప్తంగా ప్రమోట్ చేసేందుకు చాలా కష్టపడుతున్నారు. గతేడాది ‘అంటే సుందరానికీ’ సినిమాతో డిజాస్టర్ మూటగట్టుకున్ననాని.. ఈ సారి పక్కా ప్లానింగ్ తో రంగంలోకి దిగుతున్నారు. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) తో దసరా అంటూ ఓ మాస్ యాక్షన్ సినిమాను చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ ఓ రేంజ్ హైప్ తీసుకొచ్చాయి.ఈ సినిమా నిడివి 2 గంటల 39 నిమిషాలు.
dasara,nani
నాని ఊరమాస్ పాత్రలో నటించడం, తనకు తొలి పాన్ ఇండియా చిత్రంకావడంతో ‘దసరా’పై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ అంచనాలు పెంచాయి. సింగరేణి సమీపాన ఉండే వీర్లపల్లి గ్రామం నేపథ్యంలో నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాని తెరకెక్కించారు. కీర్తి సురేశ్ హీరోయిన్ . రిలీజ్‌కానున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయినట్టు చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
ఇప్పటికే మూవీకి సంబంధించిన పోస్టర్లు, గ్లింమ్స్, ఫస్ట్ సింగిల్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఇక త్వరలో బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ కూడా అందనున్నాయి. ‘దసరా’తో నాని మాస్ జాతర మొదలవ్వనుంది. ఈ చిత్రంలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
సినిమాను ఈ ఏడాది మార్చి 30న విడుదల చేసేందుకు షెడ్యూల్ చేశారు. తెలుగులో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. నాని అభిమానులు సైతం ‘దసరా’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం ‘దసరా’తో ఫ్యాన్స్ కు మాస్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. తన కేరీర్ లోనే నాని తొలిసారిగా ఊరమాస్ లుక్ లో నటిస్తున్న చిత్రమిది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ (Keerthy Suresh) నాని సరసన ఆడిపాడుతోంది. వీరిద్దిరూ గతంలో ‘నేను లోకల్’తో అలరించిన విషయం తెలిసిందే.