MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • #DevilReview:కళ్యాణ్ రామ్ ‘డెవిల్’రివ్యూ

#DevilReview:కళ్యాణ్ రామ్ ‘డెవిల్’రివ్యూ

‘డెవిల్’ చిత్రంలో ఎవ‌రికీ అంతు చిక్కని ఒక ర‌హ‌స్యాన్ని ఛేదించే బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్‌గా నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ కనిపించారు. 

5 Min read
Author : Surya Prakash
Published : Dec 29 2023, 01:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
#Devil Movie Review

#Devil Movie Review


ఈ సంవత్సరం ఆఖరులో వచ్చిన   ఈ చిత్రంకు పబ్లిసిటీ ఎక్కువగా వివాదంతోనే జరిగింది. పాజిటివ్ గానో,నెగిటివ్ గానో జనాల నోట్లో బాగానే నలిగింది. మీడియా కూడా హాట్  టాపిక్ గా ఈ సినిమాకు ప్రయారిటీ ఇస్తూ వచ్చింది. అలాగే ట్రైలర్ బాగుంది. దాంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. బ్రిటీష్ కాలం నాటి కథ ,పీరియాడిక్ లుక్ కావటం, క్రైమ్ థ్రిల్లర్ కావటంతో ఓ వర్గం వాళ్లు ఖచ్చితంగా ఓ సారి చూద్దామనుకుంటారు. అయితే థియేటర్ లో చూస్తారా,ఓటిటిలో చూస్తారా అనేది రిజల్ట్ పై ఆధారపడి ఉంటుంది. మరి ఈ సినిమా వెంటనే థియేటర్స్ కు పరుగెత్తించి చూసేయాలి అనిపించే రీతిలో ఉందా లేక మెల్లిగా ఓటిటిలో వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్లు ఉందా... అసలు కథేంటి వంటి విషయాలు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
Devil Movie Review

Devil Movie Review


స్టోరీ లైన్ 
కథా నేఫధ్య కాలం 1945. అప్పటి  మద్రాసు ప్రెసిడెన్సీలోని రాసపాడు గ్రామం. అక్కడ  జమీందారు కూతురు విజయ (అభిరామి) హత్య జరుగుతుంది. పాలేరు మాయం అవుతారు. అయితే  కూతుర్ని హత్య చేశారన్న ఆరోపణల మీద జమీందారుని అరెస్ట్ చేస్తారు. అసలు ఎవరు ఈ హత్య చేసారు. అందుకు కారణం ఏమిటి అనే ఈ కేసును చేధించేందుకు బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ డెవిల్ (కళ్యాణ్ రామ్) ని ప్రభుత్వం పంపుతుంది. అక్కడికి వెళ్లిన డెవిల్ కు ఈ కేసులో జమీందారు మేనకోడలు నైషధ (సంయుక్త మీనన్)పై అనుమానం. ఆమెను ఇన్విస్టిగేట్ చేసే క్రమంలో ఆమెతో ప్రేమలో పడతాడు. ఇదిలా జరుగుతూండగానే  “Operation Tiger Hunt.”అనే కొత్త మిషన్ ని డెవిల్ కు అప్పచెప్తుంది ప్రభుత్వం..అదేమిటీ అంటే...

312
Devil Movie Review

Devil Movie Review


ఆ స్వతంత్ర ఉద్యమరోజుల్లో  నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటే బ్రిటీష్ ప్రభుత్వానికి భయం.  తమకు పెద్ద అడ్డంకిగా తయారైన ఆయన్ను పట్టుకోవాలని బ్రిటీష్ ప్రభుత్వం నానా రకాలుగా ట్రై చేస్తుంది. ఈలోగా   ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్ఏ) చీఫ్ నేతాజి సుభాష్ చంద్రబోస్ ఇండియాకు వస్తున్నట్టు, ఆ మిషన్‌ను బాధ్యతను త్రివర్ణకు అప్పగించినట్టు బ్రిటిష్ ప్రభుత్వానికి (కోడ్) సమాచారం అందుతుంది. ఆ కోడ్‌ను డీకోడ్ చేసే బాధ్యతను డెవిల్‌కు అప్పగిస్తారు. అప్పుడే డెవిల్ కు సంభందించిన ఓ షాకింగ్  ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ ట్విస్ట్ ఏమిటి... ఓ ప్రక్క మర్డర్ కేసు...మరో ప్రక్క సుభాష్ చంద్రబోస్ పట్టుకునేందుకు ప్రయత్నాలు ఈ రెండు డెవిల్ సమర్దవంతంగా చేయగలిగాడా..అసలు మర్డర్  కేసుకు, బోస్‌‌ను పట్టుకునే మిషన్‌కు ఉన్న లింక్ ఏంటి?  ఇంతకీ  త్రివర్ణ ఎవరు? మణిమేఖల (మాళవిక నాయర్) పాత్ర ఏంటి?  వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
 

412
Devil Movie Review

Devil Movie Review


విశ్లేషణ

ఇలాంటి historical fiction కథలకు  స్టోరీ వరల్డ్ బిల్డింగ్ చాలా ముఖ్యం.   గత కాలంలో  రియల్ టైమ్ పీరియడ్  లో జరిగే ఫిక్షన్  కథలను ఈ ఫార్మాట్ లో చెప్తారు. వీటికి ప్రత్యేకమైన జాగ్రఫీ అవసరం. కథ ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ నుంచి ఎక్కడికి ట్రాన్స్ ఫార్మ్ అవుతుందనేది సహజంగా అనిపిస్తేనే పండుతాయి. ఈ క్రమంలో ఈ సినిమాకు మంచి మార్కులే పడతాయి. ఆ కష్టం ప్రతీ డిపార్టమెంట్ పడింది. చరిత్రలో ఓ మూవ్ మెంట్ ని ఎంచుకుని దాని చుట్టూ అల్లిన కథ అయ్యినప్పుడు అప్పటి కాస్ట్యూమ్స్ మాత్రమే కాదు...అప్పటి జనాల ఆలోచనలు సైతం ప్రతిబించాలి. ఇది బ్రిటీష్ టైమ్ లో స్వతంత్ర్య ఉద్యమం నేపధ్యం కూడా కలిగి ఉంది. అలాగని దేశభక్తి మీద వెళ్లకుండా అప్పటి క్రైమ్ ని చూపించే ప్రయత్నం చేయటం కొత్తగా అనిపించింది. అయితే ఏ కథ అయితే చెప్తున్నారో అది కాకుండా వేరే వాటికి ప్రయారిటి ఇచ్చారు. 

512
Devil Movie Review

Devil Movie Review


అలాగే హిస్టారికల్ ఫిక్షన్ రాసుకునేటప్పుడు... కొత్త ఫిక్షన్ క్యారక్టర్స్ ని అయినా బలంగా నిజంగా అప్పట్లో ఉన్నయా అన్నట్లు రాసుకోవాలి లేదా..ఆల్రెడీ లో ఉన్న హిస్టరీ ఫిగర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ క్రమంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ని ఎంచుకోవటం మంచి ఆలోచన. ఆయన జీవితంలో చాలా మిస్టరీ ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకునే కల్పిత కథ రాసుకున్నారు. ఈ క్రమంలో ఫస్టాఫ్ లో ఎక్కువ భాగం సెటప్ కే కేటాయించటంతో చాలా స్లోగా , ఇంట్రస్ట్ లేకుండా సాగుతుంది. ఇంట్రవెల్ ముందు దాకా కథ వేడెక్కదు. దానికి తోడు అడ్డొచ్చే పాటలు. సెకండాఫ్ లో అసలైన కథలోకు వెళ్తాము. 
 

612
Devil Movie Review

Devil Movie Review


అక్కర్లేని డిటేల్స్ ఇవ్వట,అవకాసం లేని చోట కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ ఇరికించటం,సాదా సీదాగా అనిపించే కొన్ని విషయాలను గ్లామరైజ్ చేయటం జరిగింది. ఆర్టిస్టిక్ లైసెన్స్ తీసుకోవచ్చు  కానీ ఆ క్రమంలో  మరీ టేకిట్ గ్రాంటెడ్ గా కథ చెప్పినా ఇబ్బందే. అదే జరిగింది కొంతవరకూ. అలాగే ఇలాంటి ఇన్వెస్టగేషన్ థ్రిల్లర్ లో  ఒకొక్క ముడి వీడినప్పుడు ఆ ట్విస్ట్ లకు టర్న్ లకు మనం  థ్రిల్ అవ్వాలి. అయితే ఇక్కడ అంత అనిపించదు..క్యాజువల్ గా అనిపిస్తుంది.  అయితే ఈ కథ లో మెచ్చుకునే ఎలిమెంట్స్ కూడా చాలా వున్నాయి. రొటీన్ క్రైమ్ థ్రిల్లర్ కాకుండా కొత్తగా చెప్పాలనే ప్రయత్నం..పీరియడ్ బ్యాక్ డ్రాప్.   హింసకు శృతిమించని రక్తపాతం, అశ్లీలతకు తావు లేకుండా సీన్స్ మలిచారు. 'డిటెక్టివ్ బ్యూమకేష్ భక్షి' స్ఫూర్తి ని  కళ్యాణ్ రామ్ డ్రసింగ్ డిజైన్ దాకానే తీసుకున్నట్లున్నారు.  ఏవి ఎలా ఉన్నా అచ్చ తెలుగు సినిమా సంప్రదాయం అన్నట్లు క్లైమాక్స్ లో   బ్రిటీష్ సైన్యాన్ని కళ్యాణ్ రామ్ ఊచకోత కోత కోసే సీన్స్ మాత్రం కాస్త ఇబ్బందే. అలాంటివి కాస్త ప్రక్కన పెట్టాల్సింది. 

712
Devil Movie Review

Devil Movie Review


టెక్నికల్ యాస్పెక్ట్ లో చూస్తే...

ఈ సినిమాలో ఫస్ట్ హైలెట్ గా చెప్పుకోవాల్సింది సౌందర్య రాజన్ అందించిన సినిమాటోగ్రఫీ . బ్రిటిష్ కాలం నాటి రోజులను రీ క్రియేట్ చేయడంలో విజువల్ గా ఆయన పడిన కష్టం  కనిపిస్తుంది. రీసెంట్ గా యానిమల్ తో దుమ్ము రేపిన హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన మ్యూజిక్ ఆ స్దాయిలో లేదు కానీ ఉన్నంతలో  బాగా ప్లస్ అయ్యింది. మిస్టీరియస్ గా అనిపించే కొన్ని ట్విస్ట్ లు బాగున్నాయి కానీ వాటి ఎగ్జిక్యూషన్ ఆ స్జాయిలో లేదు.  ఎడిటర్ తమ్మి రాజు ఇంకాస్త షార్ప్ చేస్తే కొంత లాగ్ తగ్గేది. ఫస్టాఫ్ లెంగ్త్ తగ్గించవచ్చు అనిపించింది. యాక్షన్ సీన్స్ లో విఎఫ్ ఎక్స్ వర్క్ కూడా రిచ్ గా లేదు. కొన్ని చోట్ల తేలిపోయినట్లు అనిపించింది.  లైటింగ్ కలర్ గ్రేడింగ్ బాగుంది.  ఆ కాలానికి తీసుకెళ్లటంలో ఆర్ట్ డిపార్టమెంట్ వర్క్ బాగా కనిపిస్తుంది. 
 

812
Devil Movie Review

Devil Movie Review


నటీనటుల్లో... కళ్యాణ్ రామ్  షెర్లాక్ హోమ్  మార్క్ హీరోయిజంతో స్పై పాత్రలో ఒదిగిపోయాడు .యాక్షన్ పంచడంతో పాటు ఎమోషన్ సన్నివేశాల్లో తన నటన ఆకట్టుకుంటుంది.   సంయుక్తా మీనన్ సినిమాకు ప్రాధాన్యత ఉన్న పాత్రే. అందంగా ఉంది.   మాళవిక నాయర్ పాత్ర చిన్నదైనా ఫెరఫెక్ట్ ఆప్షన్.  రమణ పాత్రలో చక్రపాణి ఆనంద, శంకరన్నగా ఉత్తేజ్, పట్వారీగా అజయ్ తమ పాత్రల పరిధి మేరకు బాగా చేసారు. ఇంకా హరితేజ, ఎస్తేరా తదితరులు తమకు ఇచ్చిన చిన్న చిన్న పాత్రల్లో ఆకట్టుకొన్నారు.
 

912
Devil Movie Review

Devil Movie Review


Positives:
👉కళ్యాణ్ రామ్ ఫెరఫార్మెన్స్
👉 BGM
👉ప్రొడక్షన్ వాల్యూస్
👉ఆర్ట్ డిపార్టమెంట్,కాస్ట్యూమ్స్
👉సౌందర్య రాజన్ విజువల్స్

1012
Devil Movie Review

Devil Movie Review


Negatives:
👉స్క్రీన్ ప్లే ప్లాట్ గా సాగటం
👉 చాలా చోట్ల కథకు సంభంధం లేని కమర్షియల్ మెరుపులు,
👉 ల్యాగ్ సీన్స్
👉 క్లైమాక్స్
 

1112
Devil

Devil

ఫైనల్ థాట్

#Devil సర్పైజ్ లు పెద్దగా ఇవ్వని ఇన్విస్టిగేటివ్ థ్రిల్లర్, ప్లాట్ నేరేషన్ కథలో బ్యూటీని మసకబారేలా చేసింది. పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా చూస్తే బాగుందనిపిస్తుంది. అద్బుతం కాదు తీసిపారేసేది కాదు. ఓ సారి చూడచ్చు.
 
---సూర్య ప్రకాష్ జోశ్యుల

Rating:2.25

1212
Devil

Devil


నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్తా మీనన్, మాళవికా నాయర్, సీత, 'స్వామి రారా' సత్య, అజయ్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు 
కథ, స్క్రీన్ ప్లే, మాటలు: శ్రీకాంత్ విస్సా
ఛాయాగ్రహణం: సౌందర్ రాజన్!
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్! 
నిర్మాణం, దర్శకత్వం: అభిషేక్ నామా!
విడుదల తేదీ: డిసెంబర్ 29, 2023

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
 
1st TEST • NZ vs IND 2026
Live
NZNZ
(72.2 ov) 368 & 158/4
INDIND
(166.0 ov)720/9
Day 5 - Session 2
Schedule ›
32nd T20 • WBBLT20
abandoned
MS-WMS-W
159/7
MR-WMR-W
28/0
Match abandoned
Schedule ›
31st T20 • WBBLT20
Result
BH-WBH-W
142/9
AS-WAS-W
179/4
Adelaide Strikers Women beat Brisbane Heat Women by 37 runs
Schedule ›
30th T20 • WBBLT20
Result
SS-WSS-W
123/6
PS-WPS-W
142/7
Sydney Sixers Women beat Perth Scorchers Women by 4 wickets (D/L) method
Schedule ›
29th T20 • WBBLT20
Result
HH-WHH-W
151/2
ST-WST-W
150/5
Hobart Hurricanes Women beat Sydney Thunder Women by 8 wickets
Schedule ›
28th T20 • WBBLT20
Result
AS-WAS-W
168/5
MR-WMR-W
165/4
Adelaide Strikers Women beat Melbourne Renegades Women by 5 wickets
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
231
ENGENG
328
ENG beat AUS by 97 runs
Schedule ›
2nd TEST • PAK vs SL 2026
Result
PAKPAK
325 & 90/2
SLSL
98 & 316
PAK won by 8 wickets
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
33rd T20 • WBBLT20
MR-WMR-W
Wed, 25 Nov, 2026
BH-WBH-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
34th T20 • WBBLT20
ST-WST-W
Thu, 26 Nov, 2026
AS-WAS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved