Mamta Kulkarni: మమతా కులకర్ణి ఇంకో సంచలన నిర్ణయం
Mamta Kulkarni: మాజీ బాలీవుడ్ నటి, సన్యాసిని మమతా కులకర్ణి కిన్నర్ అఖాడా మహామండలేశ్వర్ పదవిలో నియామకం తర్వాత అఖాడాలో వివాదాలు చెలరేగాయి, ఆమె అత్యున్నత స్థానాన్ని పొందడాన్ని పలువురు వ్యతిరేకించారు.

Mamta Kulkarni Resigns From Kinnar Akhada Mahamandaleshwar Post in telugu
వివాదాలు, విభేధాలు ప్రముఖ బాలీవుడ్ నటి మమతా కులకర్ణి (Mamta Kulkarni) కు కొత్తేమీ కాదు. అయితే సాధ్విగా మారిన తర్వాత అవి రెట్టింపు అయ్యాయి. పాత విషయాలన్ని ఆమె ముందుకు వచ్చాయి. అంతేకాదు ఆమె మహామండలేశ్వర్ అవ్వటం కూడా వివాదాస్పదమైంది. అంతా రచ్చ రచ్చ అవుతోంది.
ప్రాపంచిక జీవనాన్ని పరిత్యజించి, సన్యాసినిగా మారినా కొన్నేళ్ల క్రితం చర్చనీయాంశమైన తన అర్ధనగ్న ఫొటోషూట్ గురించి ఆమె ఇంర్వూలలో మాట్లాడుతూనే ఉన్నారు. సోషల్ మీడియాలో తరుచూ పోస్ట్ లు పెడుతూ ఉన్నారు. ఈ నేపధ్యంలో తాజాగా ఆమె మరో నిర్ణయం తీసుకుంది. అది మరో వార్త అయ్యింది.
Mamta Kulkarni Resigns From Kinnar Akhada Mahamandaleshwar Post in telugu
90వ దశకంలో బాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటి మమతా కుల్‌కర్ణి (Mamta Kulkarni) 2003 తర్వాత సినిమాల నుంచి తప్పుకొని, విదేశాలకు వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ రాకెట్‌లో ఆమె పేరు వినిపించింది. పోలీసులు నోటీసులు సైతం పంపారు. ఇన్నేళ్ల తర్వాత కుంభమేళా సందర్భంగా భారత్‌కు వచ్చిన ఆమె అందరినీ ఆశ్చర్యపరుస్తూ కిన్నర్ అఖాడాలో చేరి.. తన పేరును ‘మాయీ మమతానంద్ గిరి’గా మార్చుకున్న విషయం తెలిసిందే.
అంతేకాకుండా ఆమెను అఖాడాలో చేర్పించిన కిన్నర్ అఖాడా ఆచార్య మహామండలేశ్వర్ డాక్టర్ లక్ష్మీనారాయణ్ త్రిపాఠిని సైతం అఖాడా నుంచి తొలగించారు. అయితే అక్కడే విభేధాలు మొదలయ్యాయి.ఆమెకు ఆ అత్యున్నత స్థానం ఇవ్వడంపై పలువురు గురువులు, అఖాడాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కిన్నర్ అఖాడాలో మహామండలేశ్వర్ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు మమతా కులకర్ణి (Mamta Kulkarni ) వెల్లడించారు. ఇకపై సాధ్విగా కొనసాగుతానని తెలిపారు.
Mamta Kulkarni Resigns From Kinnar Akhada Mahamandaleshwar Post in telugu
అఖాడాలో కులకర్ణి (Mamta Kulkarni) చేరిక తర్వాత అందులోని సభ్యుల మధ్య వివాదాలు చెలరేగాయి. అఖాడాలో చేరిన మొదట్లోనే ఆమె అత్యున్నత స్థానమైన మహామండలేశ్వర్ హోదాను పొందడాన్ని పలువురు వ్యతిరేకించారు.
మహా కుంభమేళా పవిత్రమైన ఆధ్యాత్మిక కార్యక్రమమని, కానీ కొందరు వ్యక్తులు ఇందులో అసభ్యతను ప్రోత్సహిస్తున్నారంటూ ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ మండిపడ్డారు. ఇప్పటి వరకు ప్రాపంచిక సుఖాల్లో మునిగిపోయిన వ్యక్తులు ఒక్కసారిగా సన్యాసులుగా మారిపోయి.. మహామండలేశ్వర్ వంటి బిరుదులను కూడా పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Mamta Kulkarni Resigns From Kinnar Akhada Mahamandaleshwar Post in telugu
ఈ క్రమంలోనే అఖాడా వ్యవస్థాపకులు అజయ్ దాస్, కులకర్ణి గురువు లక్ష్మీ నారాయణ్ త్రిపాఠి మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. అజయ్‌దాస్ అఖాడా నుంచి బయటకు వెళ్లి, తన కుటుంబంతో నివసిస్తున్నారని.. కిన్నర్ అఖాడా నియమాల ప్రకారం కుటుంబంతో ఉన్నవారికి ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం లేదని త్రిపాఠి పేర్కొన్నట్లు సమాచారం. ఈ విభేదాల మధ్యే ఆమెపై బహిష్కరణ వేటు పడింది. ఈ నేపథ్యంలో ఆ ఆ స్థానం నుంచి వైదొలుగుతున్నట్లు ఆమె తెలిపారు.