డైరెక్టర్ శంకర్ ‘రోబో’కాపీరైట్ కేసు, లేటెస్ట్ అప్డేట్ !
Shankar: సినిమాకు సంబంధంలేని ఆస్తులను కూడా ఈడీ ఎలా జప్తు చేస్తుందని ఆయన ప్రశ్నించారు. దీంతో కేసును విచారించిన న్యాయమూర్తులు.. ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయడం సాధ్యమేనా..? అని ఈడీని ప్రశ్నించారు.

Madras HC grants interim relief to director Shankar in telugu
Shankar: ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్( Shankar )కు సంబంధించిన ఆస్తులను రీసెంట్ గా ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే. రోబో సినిమా కథ విషయంలో కాపీరైట్(Copyright Case) ఉల్లంఘనకు పాల్పడ్డారని శంకర్‌పై ఆరోపణలు వచ్చాయి.
ఈ కేసులో ఆయనకు సంబంధించిన సుమారు రూ. 10 కోట్ల ఆస్తులను కొద్దిరోజుల క్రితమే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. అయితే, ఈడీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. మరోసారి హైకోర్టులో పిటిషన్ వేశారు. గతంలో తనకు అనుకూలంగా ఇచ్చిన కోర్టు తీర్పును కూడా లెక్కచేయకుండా ఈడీ చర్యలు తీసుకోవడం ఏంటి అంటూ మరోసారి కోర్టుకు వెళ్లారు.
Madras HC grants interim relief to director Shankar in telugu
తాను ఎలాంటి కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడలేదని మద్రాస్ హైకోర్టులో కొద్దిరోజల క్రితమే శంకర్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ న్యాయమూర్తులు ఎంఎస్ రమేష్, ఎన్. సెంథిల్‌కుమార్‌ల సెషన్‌లో విచారణకు వచ్చింది.
ఆ సమయంలో శంకర్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది పీఎస్ రామన్.. రోబో సినిమా కథ విషయంలో శంకర్ కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించలేదని మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి వారు గతంలోనే శంకర్‌కు అనుకూలంగా తీర్పునిచ్చారని గుర్తుచేశారు.
అయినప్పటికీ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం వారు శంకర్ ఆస్తులను జప్తు చేశారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. సినిమాకు సంబంధంలేని ఆస్తులను కూడా ఈడీ ఎలా జప్తు చేస్తుందని ఆయన ప్రశ్నించారు. దీంతో కేసును విచారించిన న్యాయమూర్తులు.. ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయడం సాధ్యమేనా..? అని ఈడీని ప్రశ్నించారు.
Madras HC grants interim relief to director Shankar in telugu
ఈక్రమంలో శంకర్‌కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు చెందిన రూ.10.11 కోట్ల విలువ చేసే ఆస్తులను జప్తు చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు మంగళవారం తాత్కాలిక స్టే విధించింది.
ఇరు వర్గాల వాదనలు ఆలకించిన ధర్మాసనం... శంకర్ ఆస్తులను జప్తు చేస్తూ ఈడీ జారీ చేసిన ఆదేశాలపై తాత్కాలిక స్టే విధించింది. ఈ వ్యవహారంలో ఈడీ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 21వ తేదీకి వాయిదా వేసింది.
Madras HC grants interim relief to director Shankar in telugu
కాపీ రైట్ కేసు విషయానికి వస్తే..
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ రోబో. శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సైంటిఫిక్ యాక్షన్ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తమిళంలో ఎంథిరన్ పేరుతో ఈ మూవీని శంకర్ తెరకెక్కించారు.
అయితే, ఈ కథను ‘జిగుబా’ను కాపీ కొట్టిసినిమా తెరకెక్కించారంటూ అరూర్ తమిళనాథన్ అనే వ్యక్తి 2011లోనే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాపీరైట్ చట్టాన్ని ఆయన ఉల్లంఘించారని పిటిషన్‌లో తెలిపారు.
ఈ కేసు విషయంలో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టీఐఐ) నివేదిక శంకర్‌కు వ్యతిరేకంగా వచ్చింది. ఈ క్రమంలో జిగుబా కథకు, రోబో సినిమాకు మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదని తేల్చేసింది. దీంతో శంకర్ కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 63ని ఉల్లంఘించినట్లు ఈడీ పేర్కొంది.