ముద్దు గుమ్మల ఒక్క డైలాగ్... సినిమాకే కేరాఫ్ అట్రాక్షన్!

First Published 22, Jan 2020, 12:27 PM IST

సినిమాల్లో మన హీరోలు పంచ్ డైలాగ్స్ విసురుతూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంటారు. అయితే ఈ మధ్యకాలంలో హీరోయిన్లకు కూడా గుర్తుండిపోయే డైలాగ్స్ రాస్తున్నారు మన మేకర్స్. 

సినిమాల్లో మన హీరోలు పంచ్ డైలాగ్స్ విసురుతూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంటారు. అయితే ఈ మధ్యకాలంలో హీరోయిన్లకు కూడా గుర్తుండిపోయే డైలాగ్స్ రాస్తున్నారు మన మేకర్స్. ఈ క్రమంలో చాలా మంది హీరోయిన్లు క్రేజీ డైలాగ్స్ చెప్పి ఆడియన్స్ ని మెప్పించారు. సినిమాలో హీరోయిన్ల క్యారెక్టర్ ని ఒక్క డైలాగ్ లో చెప్పేలా మన మేకర్లు రాసిన డైలాగ్స్ థియేటర్లలో బాగా పేలాయి. అలా వన్ లైన్ డైలాగ్స్ తో గుర్తుండిపోయిన హీరోయిన్ల గురించి తెలుసుకుందాం!

సదా : 'జయం' సినిమాలో 'వెళ్లవయ్యా.. వెళ్లు వెళ్లు..' అంటూ సదా చెప్పే డైలాగ్ ని ఇప్పటికీ చాలా మంది వాడుతున్నారు. ఈ డైలాగ్ సదాకి స్టార్ డం తీసుకొచ్చింది.

రెజీనా : 'సుబ్రమణ్యం ఫర్ సేల్' సినిమాలో ఈ బ్యూటీ సీత క్యారెక్టర్ ప్లే చేసింది. ఈ రోల్ కి తగ్గట్లు.. 'సీతతో అంత ఈజీ కాదు' అంటూ చెప్పే డైలాగ్ ఆడియన్స్ ని మెప్పించింది.

సాయి పల్లవి : 'ఫిదా' సినిమాలో భానుమతిగా అందరి హృదయాలకు దగ్గరైన సాయి పల్లవి 'భానుమతి.. ఒక్కటే పీస్.. హైబ్రీడ్ పిల్ల..' అంటూ చేసిన రచ్చ ఇప్పట్లో మర్చిపోలేం.

తమన్నా : ఈ బ్యూటీ నటించిన '100% లవ్' సినిమాలో 'దట్ ఈజ్ మహాలక్ష్మి' అంటూ చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. ఇప్పుడు ఇదే డైలాగ్ ఓ సినిమాకి టైటిల్ గా పెట్టుకొని సినిమా కూడా చేస్తుంది.

ఛార్మి : 'శ్రీ ఆంజనేయం' సినిమాలో తన మేనరిజంకి తగ్గట్లు 'పద్దు.. శివంగి.. ఆడపులి' అంటూ ఛార్మి డైలాగ్ చెప్తుంటే మాస్ ఆడియన్స్ తెగ రచ్చ చేశారు.

శ్వేతాబసు ప్రసాద్ : 'కొత్తబంగారు లోకం' సినిమాలో 'ఏక్క..డా..' అంటూ సాగదీసి మరీ డైలాగ్ చెబుతుంది శ్వేతాబసు. ఈ ఒక్క డైలాగ్ ఈమెకి క్రేజ్ తీసుకొచ్చింది.

కాజల్ : 'సీత' సినిమాలో కాజల్ నటనకి అందరికీ ఫిదా అవ్వాల్సిందే.. 'సీత.. నేను గీసిందే గీత' అంటూ సినిమాలో కాజల్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది.

నభా నటేష్ : 'సిరి.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్' అంటూ 'నన్ను దోచుకుందువటే' సినిమాలో నభా చెప్పే డైలాగ్ తన క్యారెక్టర్ లో అమాయకత్వాన్ని చూపించింది.

పూజా హెగ్డే : 'అరవింద సమేత' సినిమాలో 'నాకు కొంచెం స్పేస్ కావాలి' అంటూ ప్రతీసారి పూజా చెప్పే డైలాగ్ మెప్పించింది. బయట చాలా మంది ఈ డైలాగ్ ని వాడుతున్నారు.

మెహ్రీన్ : 'నేను చెప్పానా.. నీకు చెప్పానా' అంటూ 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' సినిమాలో,  'హనీ ఈజ్ ది బెస్ట్' అంటూ 'ఎఫ్ 2' సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది మెహ్రీన్.

రకుల్ ప్రీత్ సింగ్ : 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' సినిమాలో తన పాత్రకి తగ్గట్లు 'ప్రార్థన.. ప్రతి రూపాయి కౌంట్ ఇక్కడ' అంటూ హీరో మీద కౌంటర్లు వేసింది రకుల్.

రష్మిక : రీసెంట్ గా విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో 'మీకు అర్ధమవుతుందా..?' అంటూ రష్మిక చేసిన రచ్చ ఇప్పట్లో మర్చిపోలేం.

loader