అందం,అర్దనగ్నం..మహేష్ హీరోయిన్ మాయాజాలం
భరత్ అనే నేను బ్యూటీ గుర్తుందా... కీయరా అద్వానీ. ఈ బాలీవుడ్ భామ చివరగా వినయ విధేయ రామ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో మరో తెలుగు సినిమాను చేయలేదు. అమ్మడికి ఆఫర్స్ అయితే బాగానే వచ్చాయి. కానీ యాక్సెప్ట్ చేయలేదు. ఆమె తెలుగులో సినిమాలు చేయకపోయినా ఇక్కడ క్రేజ్ మాత్రం అలాగే ఉంది. పెద్ద హీరోలంతా ఆమెతో సినిమాలు చేయటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆమె పనిలో పనిగా సోషల్ మీడియాలోనూ హాట్ హాట్ ఫొటోలతో హల్ చల్ చేస్తోంది. స్పెషల్ ఫొటోలతో తనేంటో చూపిస్తోంది. ఆ ఫొటోలు వైరల్ అవుతూండటంతో మరింతగా తన అందాల ప్రదర్శన పోగ్రామ్ ను విజయవంతంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోలను ఇక్కడ చూద్దాం.
Kaira advani
ప్రస్తుతం బాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వడంతోనో లేదా వయస్సు పైబడడంతో లిమిటెడ్‌గా సినిమాలు చేస్తుండడంతోనో ఇప్పుడుఅందరూ హీరోలు కైరా వైపే చూస్తున్నారు.
బాలీవుడ్‌లో సీనియర్ హీరోల నుంచి జూనియర్లు, కుర్ర హీరోలు అందరూ ఇప్పుడు కైరానే తమ సినిమాల్లో పెట్టుకుని ఆమెతోనే రొమాన్స్ చేసేందుకుతహతహలాడుతున్నారు.
ఇక తెలుగులో కూడా కైరా మహేష్‌బాబు సరసన భరత్ అనేనేను సినిమాతో పాటు చెర్రీ సరసన వినయ విధేయ రామ సినిమాలో నటించింది. ఇప్పుడు ఆమె తెలుగులోనటించేందుకు డేట్లే లేవు. అంత బిజీ అయిపోయింది.
ఇక ఈ ముద్దుగుమ్మ అసలు పేరు అలియా అద్వానీ. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సూచనతో ఈమె పేరు మార్చుకుంది. బాలీవుడ్ లో అప్పటికే అలియా భట్ ఉండటంతో పేరు మార్చుకోమని సల్మాన్ చెప్పాడు.
దీంతో, ఆమె కైరా అద్వానీగా పేరు మార్చుకుంది. ఇప్పుడు ఆమె కుటుంబసభ్యులు కూడా ఆమెను కైరా అనే పిలుస్తున్నారట.
ఇక ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ముద్దుల కూతురు ఇషా అంబానీ, కైరా చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. సల్మాన్, షారుఖ్ ఖాన్ అంటే కైరాకు చాలా అభిమానం.
ఇక ఇప్పుడు కైరా స్టార్ హీరోయిన్ అయిపోవడంతో ఆమె దృష్టంగా బాలీవుడ్ మీదే ఉంది. ఇప్పుడు తెలుగుతో పాటు సౌత్‌లో పలువురు హీరోలు ఆమెను తమ నినిమాల్లో నటింపజేసేలా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కైరా మాత్రం డేట్లు ఇచ్చే పరిస్థితి లేదట.
ఇక కబీర్‌సింగ్ సినిమాతో కైరా రేటు కూడా చుక్కలనంటుతోందట. ప్రస్తుతం.. లారెన్స్ దర్శకత్వంలో వస్తున్న 'లక్ష్మీబాంబ్' అనే ఓ హారర్ కామేడీలో నటిస్తోంది కియారా.
‘లస్ట్ స్టోరీస్’, ‘కలంక్’, ‘కబీర్‌సింగ్’... సినిమాలతో బాలీవుడ్‌ను ఆకట్టుకుంది కియారా అద్వానీ. ‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామ’... సినిమాలతో తెలుగు ప్రేక్షకులకూ చేరువయ్యింది.
ప్రేక్షకుల్లో కొందరు నా టర్నింగ్ పాయింట్ ‘లస్ట్ స్టోరీస్’ అంటారు. మరికొందరు ‘కబీర్‌సింగ్’ అంటారు. ‘లస్ట్ స్టోరీస్’ తరువాత ‘ఈ అమ్మాయి నటించగలదు’ అనుకున్నారు ఫిల్మ్‌మేకర్స్. ‘లస్ట్ స్టోరీస్’ ప్రశంసలను తెచ్చిపెడితే, ‘కబీర్‌సింగ్’ ప్రేక్షకుల ప్రేమను పంచింది.
‘ఈ హీరోతో ఎలాగైనా సరే తప్పనిసరిగా నటించాలి’ అనుకునే హీరో రణ్‌వీర్‌సింగ్. దమ్మున్న హీరో. ఇక హీరోయిన్‌లలో ఆలియా భట్, దీపికా పదుకొనేలతో కలిసి నటించాలని ఉంది.
సల్మాన్‌ఖాన్ ఒక మంచి మాట అన్నారు. ‘మాటలు కాదు, మనం చేసే పని మాట్లాడాలి’. దీంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. నాకు నచ్చిన మాట ఇది.
నాకు తెలిసి ప్రతి ఒక్క యాక్టర్‌కి ఇన్‌సెక్యురిటీ ఫీలింగ్ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇదీ మంచిదే! ‘భయం’ ‘బాధ్యత’ను నేర్పుతుంది. ‘స్ట్రాంగర్’గా, ‘బెటర్’గా తయారవ్వడానికి ఉపకరిస్తుంది.
‘షేర్‌షా, లక్ష్మీబాంబ్, ఇందూ కీ జవానీ, భూల్ భులయ్యా 2’ సినిమాల విడుదల కోసం వెయిట్ చేస్తున్నారు హీరోయిన్ కియారా అద్వానీ. ప్రస్తుతానికి తెలుగులో సినిమాలు చేయడంలేదు కానీ హిందీలో బిజీగా ఉన్నారు కియారా.
పర్సనల్ లైఫ్ పట్టించుకునే తీరిక దొరుకుతోందా? అని కియారాని అడిగితే.. ‘ నా పర్సనల్ లైఫ్‌కి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాను. ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకుంటున్నాను’’ అన్నారు.
కాబోయే భర్త గురించి కొన్ని అభిప్రాయాలున్నాయి. అతను ఎంతో నమ్మకంగా ఉండాలి. నన్ను నవ్విస్తుండాలి. నా జోక్స్‌కు తను నవ్వాలి. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగల తెగువ ఉండాలి.
ప్రస్తుతం నేను బాలీవుడ్ సినిమాలతో చాలా బిజీగా ఉన్నాను. తెలుగులో ఆఫర్స్ వస్తున్న మాట నిజమే గాని మంచి సినిమాలతో అక్కడి ఆడియెన్స్ ని మెప్పించాలని సరైన సబ్జెక్టు కోసం వెతుకున్నా అని కీయరా వివరణ ఇచ్చింది. రెమ్యునరేషన్ తక్కువ ఇస్తే చేయనని నేను అనలేదని కూడా ఆమె తెలిపింది.
సముద్రం అంటే ఇష్టం. అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది. పెయింటింగ్ చేయడం ఇష్టం. ఇక ప్రయాణాలు చేయడం చెప్పలేనంత ఇష్టం. స్కూలు రోజుల్లో మాత్రం ఒంటరిగా ఎక్కడికీ పంపించేవారు కాదు.
నా గురించి ఎవరైనా మంచి విషయాలు చెప్పినప్పుడు, ప్రోత్సాహకరమైన మెసేజ్‌లు పెట్టినప్పుడు థ్రిల్లై పోతాను. అవి నా ఎనర్జీని రెట్టింపు చేస్తాయి. సంతోషంతో రెక్కలు వస్తాయి.