బ్రోతల్ కేసులో ఇరికించారు.. లారెన్స్ తమ్ముడిపై యువతి ఆరోపణలు!

First Published 7, Mar 2020, 11:37 AM IST

సినీ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ లారెన్స్ తమ్ముడు ఎల్విన్ అలియాస్ వినోద్, ఏసీపీ రవీందర్ రెడ్డి తన జీవితాన్ని నాశనం చేశారని ఓ యువతి (29) ఆరోపణలు చేస్తోంది. 

సినీ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ లారెన్స్ తమ్ముడు ఎల్విన్ అలియాస్ వినోద్, ఏసీపీ రవీందర్ రెడ్డి తన జీవితాన్ని నాశనం చేశారని ఓ యువతి (29) ఆరోపణలు చేస్తోంది. ప్రేమ పేరుతో ఎల్విన్ వేధింపులకు గురి చేస్తే.. తన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాల్సింది పోయి అప్పటి మారేడుపల్లి ఇన్‌స్పెక్టర్‌, ప్రస్తుత ఏసీపీ రవీందర్‌ రెడ్డి.. ఎల్విన్ తో కలిసి ఆరేళ్లుగా తనను వేధిస్తున్నాడని వాపోయింది.

తనను బ్రోతల్ కేసులో ఇరికింది 21 రోజులు జైల్లో ఉండేలా చేశారని కన్నీరు పెట్టుకుంది. ఎల్విన్, రవీందర్ రెడ్డి నుండి రక్షణ కల్పించాలని వేడుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా కాజీపేట మండలం రాంపూర్ కి చెందిన ఓ యువతి.. చిన్నప్పుడే తల్లితండ్రులను పోగొట్టుకోవడంతో హైదరాబాద్ లో ఉన్న తన పెద్దమ్మ వద్ద పెరిగింది.

చిన్నతనంలో నేర్చుకున్న డాన్స్, కరాటే తనకు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చేలా చేసింది. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసే సమయంలో తనకు ఎల్విన్ షూటింగ్ లో పరిచయమయ్యాడని.. ప్రేమిస్తున్నానంటూ ప్రపోజల్ పెట్టాడని.. తన ప్రేమ నిరాకరించడంతో కక్ష కట్టి బెదిరింపులకు పాల్పడ్డాడని సదరు యువతి వెల్లడించింది.

దీంతో అప్పటి ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డికి ఫిర్యాదు చేస్తే.. అతడు కూడా వేధించడం మొదలుపెట్టాడని వెల్లడించింది. విచారణ పేరుతో తనను కాటేజీలకు, లాడ్జిలకు పిలిచేవాడని చెప్పింది. కూతురు వయసున్న తనను ఇబ్బంది పెడుతూ నీచంగా మాట్లాడేవాడని చెప్పింది.

తనతో ఒకరోజు బలవంతంగా తెల్లకాగితం మీద సంతకం పెట్టించి.. కోర్టులో హాజరు పరిచారని.. బ్రోతల్ కేసులో బుక్ చేసి 21 రోజులు జైల్లో ఉండేలా చేశారని చెప్పుకొని వాపోయింది. 'డబ్బున్న వాళ్లతో.. నాలాంటి పోలీస్ తో పెట్టుకునే ఇదే గతి పడుతుందని' రవీందర్ రెడ్డి తనను కులం(దళిత) పేరుతో దూషిస్తూ దారుణంగా అవమానించి మాట్లాడారని.. కోర్టు వాయిదా వివరాలు తెలియకుండా కుట్ర చేసి మరోసారి జైలుకి వెళ్లేలా చేశారని చెప్పింది.

ఇవన్నీ భరించి బతుకుతున్నా.. ఇప్పటికీ ఎల్విన్, రవీందర్ రెడ్డి గ్యాంగ్ లో తనను వెంటాడుతున్నాయని వెల్లడించింది. తనకు ఎక్కడా ఆశ్రయం దొరక్కుండా చేస్తున్నారని తెలిపింది. జేఎన్టీయూ హాస్టల్ లో ఉన్న సమయంలో తన రూమ్ పై పోలీసులు దాడి చేసి ల్యాప్ టాప్, సెల్ ఫోన్ లు తీసుకుపోయారని.. దీనంతటికీ కారణం.. ఎల్విన్ చేసే చీకటి వ్యాపారం తనకు తెలియడమేనని చెప్పుకొచ్చింది.

ఏసీపీ రవీందర్ రెడ్డి డాన్స్ మాస్టర్ లారెన్స్ ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని తనను ఇబ్బందులు పెడుతున్నాడని తెలిపింది. తనొక బ్రోతల్ అని, అమ్మాయిలతో వ్యాపారం చేస్తుందని నిరూపించే పనిలో పడ్డారని తెలిపింది. ఫిర్యాదు చేసే సమయానికి తన వయసు 23 సంవత్సరాలేనని చెప్పింది. తిండికి కూడా ఇబ్బంది పడుతూ స్నేహితుల సహాయంతో కాలం వెళ్లదీస్తున్నానని చెప్పింది.

పూర్తిస్థాయిలో విచారణ జరిపి లారెన్స్ తమ్ముడు ఎల్విన్, పోలీస్ అధికారి రవీందర్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు తనకు రక్షణ కల్పించాలని కోరుతోంది. అయితే ఈ విషయంపై స్పందించిన రవీందర్ రెడ్డి.. యువతి చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు.

2014,15 లో మారేడుపల్లి పోలీస్ స్టేషన్ సీఐగా పని చేస్తోన్న సమయంలో ఈ యువతీ స్టేషన్ కి వచ్చిందని.. లారెన్స్ తో యువతికి వివాదం ఉందని.. ఇందులో భాగంగా మారేడుపల్లిలో ఓ కేసు విషయంలో స్టేషన్ కి వచ్చిందని.. కేసుపై విచారణ జరిపామని చెప్పింది.

loader