రెమ్యునేషన్ లో టాప్.. రాజమౌళా, శంకరా? ఎవరికి ఎంత!
First Published Oct 7, 2019, 3:57 PM IST
సినిమా వస్తే చాలు ఎంతో కొంత ఇస్తే చేసేద్దాం అనుకునే రోజులు వెళ్లిపోయాయి. కోట్లు డిమాండ్ చేసి రెమ్యునేషన్ గా పుట్టుకుంటున్న దర్శకులు ఉన్నారు.

సినిమా వస్తే చాలు ఎంతో కొంత ఇస్తే చేసేద్దాం అనుకునే రోజులు వెళ్లిపోయాయి. కోట్లు డిమాండ్ చేసి రెమ్యునేషన్ గా పుట్టుకుంటున్న దర్శకులు ఉన్నారు. అయితే ఏ దర్శకుడు ఎక్కువ రెమ్యునేషన్ తీసుకుంటున్నాడనేది ఎప్పుడూ పజిలే. మరీ ముఖ్యంగా గత కొంతకాలంగా భారీ సినిమాలకు కేరాఫ్ గా మారిన రాజమౌళి, శంకర్, మురగదాస్ ల మధ్య పోటీ నడుస్తోంది. వాళ్లిద్దరిలో ఎవరుకి క్రేజ్ ఎక్కువగా ఉంది. ఏ డైరక్టర్ కు రెమ్యునేషన్ ఎక్కవ అనేది చర్చనీయాంశంగా సోషల్ మీడియాలో మారింది.

ఈ నేపధ్యంలో ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు రాజమౌళి ఎక్కువ రెమ్యునేషన్ తీసుకునే దర్శకుడు అని తెలిసింది. బాహుబలితో క్రేజ్ ఉన్న దర్శకుడుగా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న రాజమౌళి..తన రెమ్యునేషన్ తో శంకర్ని దాటేసాడు. రాజమౌళి ఒక్కో సినిమాకు 35 కోట్లు దాకా తీసుకుంటున్నట్లు సమాచారం. అంతేకాదు సినిమా లాభాల్లో కూడా వాటా తీసుకుంటున్నారట. ప్రస్తుతం నిర్మాత దానయ్య తో కలిసి ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు రెమ్యునేషన్ తో పాటు లాభాల్లో వాటా కూడా ఉందట.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?