దుల్కర్ సల్మాన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీలీల, ఆ హీరోకు పెళ్ళైన సంగతి మర్చిపోయిందా..?
సౌత్ యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో దుల్కర్ సల్మాన్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది హీరోయిన్ శ్రీలీల. స్టేజ్ పైనే ఆమె మాట్లాడినమాటలకు అంతా షాక్ అయ్యారు.
ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ మేకర్స్ ఒకే ఒక్క హీరోయిన్ జపం చేస్తున్నారు. ఆమె శ్రీలీల. ఒక సినిమా అది కూడా ప్లాప్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది శ్రీలీల. పెళ్లి సందడి అనే ప్లాప్ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల.. రవితేజ జోడీగా వచ్చిన ధమాకాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక వరుసగా ఆఫర్లు కొట్టేస్తున్న ఈ బ్యూటీ చేతిలో ప్రస్తుతం అరడజను సినిమాలకు పైనే ఉన్నాయి.
ఇక తాజాగా రామ్ పోతినేని జోడీగా స్కంద సినిమాలో నటించింది శ్రీలీల. పక్కా మాస్ యాక్షన్ మూవీలో అద్భుతంగా నటించిన ఈ బ్యూటీ.. అరడజను సినిమాలతో బిజీగా ఉంది..మరో అరడజను సినిమాలు సైన్ కూడా చేసిందంట. మొత్తంగా 10 నుంచి 12 సినిమాలు ఇప్పుడు ఆమె చేయాల్సి ఉంది. ఈలెక్కన శ్రీలీల ఎంత బిజీగా ఉందో చెప్పనక్కర్లేదు. అంతే కాదు.. ఈసినిమాలు అయిపోయే వరకూ.. ఆమె స్టారోయిన్ గా టాలీవుడ్ లో నెంబర్ వన్ స్థాయిలో ఉండటం ఖాయం అంటున్నారు సినిమా పండితులు.
ఇక తాజాగా ఆమె ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించిన మ్యాడ్ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకకు శ్రీ లీల ప్రత్యేక అతిథిగా వెళ్ళారు. ఇదే వేధికను శ్రీలీలతో కలిసి శేర్ చేసుకున్నారు సౌత్ యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో దుల్కర్ సల్మాన్. అయితే ఈ సందర్బంగా శ్రీలీల దుల్కర్ సల్మాన్ గురించి చేసిన వ్యాఖ్యలు అక్కడ ఉన్నవారందరిని ఆశ్చర్చానికి గురి చేశాయి.
Photo Courtesy: Instagram
ఈ వేదికపై శ్రీలీల మాట్లాడుతూ.. దాదాపు దుల్కర్ కు ప్రపోజ్ చేసినంత పని చేసింది. ఆమె కామెంట్స్ వైరల్ అయ్యాయి. మ్యాడ్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు శ్రీ లీల..దుల్కర్ సల్మాన్ గురించి మాట్లాడుతూ.. సర్ మీరు ఈవెంట్ కి వస్తున్నారని తెలియగానే నాకంటే మా అమ్మగారు చాలా సంతోషపడ్డారు.
ఆమె మీకు పెద్ద అభిమాని మిమ్మల్ని అడిగానని చెప్పమన్నారు అంటూ తెలియచేశారు.
ఇక ఆతరువాత దుల్కర్ పై ప్రేమ రాగం అందుకున్నశ్రీలీల.. మాట్లాడుతూ..నాకు చిన్నప్పటినుంచి ఒక కల వచ్చేది .. మా అమ్మమ్మ చెప్పిన కథలు విన్నప్పుడు గుర్రం మీద వచ్చే యువరాజుని ఊహించుకున్నాను. ఎప్పుడైతే మీరు చేసిన హిరయి పాట చూశానో అప్పటినుంచి నా కలలో వచ్చే రాకుమారుడు మీరే అని ఫిక్స్ అయ్యాను అంటూ.. షాకింగ్ కామెంట్స్ చేశారు శ్రీలీల.
ఇప్పటికీ మీరు నాకు కలలో వస్తుంటారు అంటూ ఈ సందర్భంగా ఈమె దుల్కర్ సల్మాన్ గురించి కామెంట్స్ చేయడంతో వేదికపై ఉన్న వారంతా షాక్ అయ్యారు. ఆశ్చర్యపోయారు... ఇక దుల్కర్ సల్మాన్ మాత్రం ముసి ముసి నవ్వులు నవ్వుతూ శ్రీలీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక శ్రీ లీల చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతే కాదు రకరకాల కామెంట్లు కూడా చేస్తున్నారు.
Photo Courtesy: Instagram
దుల్కర్ సల్మాన్ కు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది శ్రీ లీల ఈ విషయం మీకు గుర్తుందా... అంటూ ప్రశ్రిస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమె కామెంట్స్ ఎంతో క్యూట్ గా ఉన్నాయని అంటున్నారు. దుల్కర్ ఇమేజ్ మాత్రం శ్రీలీల కామెంట్స్ తో ఓ మెట్టు ఎక్కాడనేచెప్పాలి. మలయాళంతో పాటు..తెలుగులో కూడా హీరోగా మంచి ఇమేజ్ సాధించాడు దుల్కార్.
Photo Courtesy: Instagram
ఓకే బంగారంతో అమ్మాయిల మనసుదోచిన దుల్కార్.. మహానటితో .. తెలుగు కుటుంబ ప్రేక్షకుల్లో అలా నిలిచిపోయాడు... ఇక సీతారామంతో.. మన హీరో అనిపించుకున్నాడు.. తెలుగులో డైరెక్ట్ సినిమాలు చేసుకుంటూ.. బిజీ అవుతున్నాడు. టాలీవుడ్ నుంచి పాన్ ఇండియాకు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాడు దుల్కార్.