- Home
- Entertainment
- Entertainment News
- ఖుషి మూవీ సక్సెస్ పై స్పందించిన సమంత, కలనిజమయ్యిందంటూ.. ఎమోనల్ పోస్ట్...
ఖుషి మూవీ సక్సెస్ పై స్పందించిన సమంత, కలనిజమయ్యిందంటూ.. ఎమోనల్ పోస్ట్...
ఫారెన్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరోయిన్ సమంత, ఈరోజు(సెప్టెంబర్1 )ఖుషి సినిమా రిలీజ్ సందర్భంగా స్పెషల్ పోస్ట్ ను పెట్టింది సమంత, అందులో ఏం చేప్పిందంటే..?

ఖుషి సినిమాతో సక్సెస్ సాధించింది సమంత.. ఈసినిమా రిజల్ట్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదరు చూసింది బ్యూటీ. ఈసినిమా సక్సెస్ సమంతకు చాలా ముఖ్యం. ఎందుకంటే.. వరుసగా ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తోంది శ్యామ్. రీసెంట్ గా శాకుంతలం, అంతుకు మందు యశోద, ఇలా ఫెయిల్యూర్స్ వస్తున్న క్రమంలో ఖుషి సినిమా సక్సెస్ కోసం ఆమె చాలా టెన్షన్ పడింది.
తాజాగా ఖుషి సినిమా రిజల్ట్ తో.. ఆమె దిల్ కుష్ అయ్యింది. ఈ విషయంలో సంతోషం వ్యక్తం చేస్తూ.. స్పెషల్ పోస్ట్ పెట్టింది బ్యూటీ.. ఖుషి సినిమాకు ముందు తాను ఎంత టెన్షన్ పడ్డింది.. రిజల్ట్ తరువాత తాను ఎంత హ్యాపీ మూడ్ లో ఉన్నది తెలియజేస్తూ.. కొన్ని ఫోటోలను షేర్ చేసింది సంమంత. ప్రస్తుతం తాను అమెరికా టూర్ లో ఉంది. వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది.
ఖుషి సినిమా సక్సెస్ తో... వెకేషన్ తనకు స్వర్గంలా అనిపిస్తుంది. ఈసినిమా కోసం చాలా కష్టపడ్డామని.. దానికి తగ్గ ప్రతిఫలం అందించారంటూ.. ఫ్యాన్స్ కు సమంత థ్యాంక్స్ చెప్పింది. అంతే కాదు. ఆరోగ్యం సరిగ్గ లేకపోయినా.. ఈసినిమా కోసం తాను ప్రాణం పెట్టి పనిచేసింది సమంత. ఇక ఖుషీ రిజల్ట్ ను ఫారెన్ లో సెలబ్రేట్ చేసుకుంటుంది బ్యూటీ.
సమంతకు ఒక్కదానికే కాదు.. అటు విజయ్ దేవరకొండకు, ఇటు దర్శకుడు శివ నిర్వాణకు కూడా ఈసినిమా సక్సెస్ చాలా ఇంపార్టెంట్.. గీత గోవిందం తరువాత సాలిడ్ హిట్ లేదు విజయ్ కు. దాదాపు ఐదేళ్ళుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఖుషి సినిమా ఫలితం తరువాత కన్నీళ్ళు వస్తున్నాయి. సంతోషంగా ఉందిఅంటూ పోస్టో కూడా చేశాడు. అటు శివ నిర్వాణ కూడా టక్ జగదీష్ తో ఫెయిల్యూర్ చూసిన అతను.. తాజాగా ఈసినిమాతో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నాడు.
ఖుషి సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఖుషి సినిమా...పాజిటీవ్ రెస్పాన్స్ సాధించింది. పెద్దలను ఎదిరించి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న జంట.. సంసారజీవితంలో పడే ఇబ్బందులు, గొడవల గురించి చెప్పే ప్రయత్నం చేశాడు. ఫ్యామిలీ సినిమాలతొ కిక్కెక్కించే శివ నిర్వాణ.. ఈసారి కూడా అదే మార్క్ సినిమాను అందించాడు.