హన్సికను పడక గదికి రమ్మని వేధించిన ఆ తెలుగు హీరో ఎవరు?
తెలుగు పరిశ్రమలో ఓ హీరో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసేవాడు. డేట్ కి వస్తావా? అని అడిగే వాడు. కానీ అతనికి తగిన రీతిలో బుద్ది చెప్పి పంపించానునాకు ప్రేమ మీద నమ్మకం ఉంది. నేను రొమాంటిక్ పర్సన్‌ని. కానీ,...

బాల నటిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యి కాలక్రమేణా స్టార్ హీరోయిన్‌గా మారిన అందాల భామ హన్సిక మోత్వానీ (Hansika Motwani).రీసెంట్ గా వివాహం చేసుకున్న ఆమె తనకు కాస్టింగ్ కోచ్ అనుభవాలు ఉన్నాయని , రీసెంట్ గా ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చింది. అందులో భాగంగా ఆమె ఓ తెలుగు హీరో పై ఆరోపణలు చేసింది. ఇంతకీ ఎవరా తెలుగు హీరో అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో,మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
తెలుగుతో పాటు తమిళంనూ మంచి పాపులారిటీ ఉన్న నటి హన్సిక మోత్వానీ (Hansika). అల్లు అర్జున్ ‘దేశముదురు’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమై టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. అనంతరం కోలీవుడ్‌లో అడుగుపెట్టి అక్కడ కూడా సక్సెస్ సాధించింది. తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న తరుణంలోనే హన్సిక వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
రీసెంట్ గా ఇంటర్వూలో మాట్లాడుతూ..ఇండస్ట్రీలో తనకు ఎదురైనా వేధింపుల గురించి వెల్లడించింది. తెలుగులో ఓ హీరో తనని బాగా ఇబ్బందికి గురి చేశాడని..డేట్‌కి వెళ్దాం వస్తావా అంటూ విసిగించేవాడని చెప్పుకొచ్చింది. అయితే ఆ హీరోకి తగిన రీతిలో తగిన బుద్ది చెప్పానని తెలిపింది.
ఆ హీరో పేరు మాత్రం వెల్లడించడానికి ఇష్టపడలేదు. దీంతో ఆ హీరో ఎవరా అని తెగా ఆరా తీస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో హన్సిక ...ఏ యే హీరోలతో సినిమాలు చేసింది. అందులో హన్సికను..డైరక్టర్ గా డేటింగ్ కు రమ్మని అడిగే ధైర్యం ఎవరుకి ఉండచ్చు..అలాగే ఏదైనా హీరో తో మళ్లీ చేయటానికి ఆమె ఇష్టపడని సంఘటనలు ఉన్నాయా అనేది ఎంక్వైరీ చేసి క్లూలు లాగే ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే అందుతున్న సమాచారం మేరకు ఇప్పటికి లవ్ స్టోరీలు చేస్తున్న ఆ హీరో ..అప్పుడు ఆమెతో సినిమా చేసాడని , అతనికి మంచి బ్యాక్ గ్రౌండ్ ఉందని అంటున్నారు. ఆమెతో అతను తర్వాత ఏ సినిమాలు చేయలేదని, దర్శక,నిర్మాతలు ప్రపోజల్ పెట్టినా వద్దని చెప్పేవాడని చెప్పుకుంటున్నారు.
అయితే వివాహం తర్వాత హన్సిక ఈ రేంజ్ లో గ్లామర్ షో చేస్తుండడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. గతంలో మాదిరిగానే పొట్టి బట్టల్లో స్వేచ్ఛగా విహరిస్తోంది అని అంటున్నారు. ఇక హన్సిక తన ప్రియుడు సోహైల్ కతూరియా (Sohail Kathuria) ను గతేడాది డిసెంబర్ 4న పెళ్లి చేసుకున్నారు. జైపూర్‌లోని ముంధోతా ఫోర్ట్ ఫ్యాలెస్‌లో ఈ వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. శింబు(Simbu) తో బ్రేకప్ అయిన తర్వాత మరొకరిని రెండోసారి ప్రేమించడానికి చాలా సమయం పట్టిందని ఆమె చెప్పారు.
హన్సిక వెడ్డింగ్ వీడియో ‘డిస్నీ+హాట్‌స్టార్’ లో రిలీజ్ అయింది. ‘లవ్ షాదీ డ్రామా’ (Love Shaadi Drama) టైటిల్‌తో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వీడియోలో తన పెళ్లికి సంబంధించిన అనేక ఆసక్తికర విశేషాలను హన్సిక తెలిపారు. సోహైల్ మొదటి పెళ్లి సంగతులను కూడా చెప్పారు.
ఈ సందర్బంగా తనపై వస్తున్న విమర్శలు, ట్రోల్స్‌కు చాలా గట్టిగా సమాధానమిచ్చారు. సెలబ్రిటీగా ఉన్నందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ‘‘సెలబ్రిటీగా ఉన్నందకు నేను మూల్యం చెల్లించుకున్నాను. అందరు చాలా సులభంగా నా వైపు వేలెత్తి చూపించి విలన్‌గా మార్చారు. అందులో నా తప్పేమీ లేదు. నేను సోహైల్‌ను పెళ్లి చేసుకుంటున్నానే వార్తలు బయటికి రాగానే ఏం చేయాలో అర్థం కాలేదు. ఒత్తిడికి గురయ్యాను. అన్నారు.
అప్పుడు మా అమ్మ సలహాతో సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేశాను. ఆ పిక్స్‌ను చూసి అందరు శుభాకాంక్షలు చెప్పారు. ఫలితంగా కొంచెం ఆందోళన చెందడం మానేశాను. పరిస్థితులు అన్ని కుదుటపడుతున్నప్పుడు సోహైల్‌కు గతంలోనే పెళ్లి అయిందనే వార్తలు బయటికి వచ్చాయి. ఆ వేడుకలో నేను పాల్గొన్న ఫొటోలను పలువురు నెటిజన్స్ షేర్ చేశారు. భార్యతో సోహైల్ విడిపోవడానికి నేనే కారణం అని విమర్శలు గుప్పించారు. నన్ను విలన్‌గా చిత్రీకరించారు.
అయితే, సోహైల్ గతం గురించి నాకు తెలుసు. ఆయన విడాకులు తీసుకోవడానికి నేను ఏ మాత్రం కారణం కాదు’’ అని హన్సిక తెలిపారు. హన్సిక చెప్పిన మాటలను సోహైల్ కతూరియా సమర్థించారు. ‘‘నా గత పెళ్లి గురించి నెగెటివ్‌గా రాశారు. హన్సిక వల్ల బ్రేకప్ అయిందన్నారు. కానీ, అది నిజం కాదు. నాకు 2014లో వివాహం అయింది. కానీ, కొద్ది కాలానికే అభిప్రాయ విభేదాలతో విడిపోవాల్సి వచ్చింది’’ అని సోహైల్ కతూరియా పేర్కొన్నారు.
శింబు(Simbu) తో బ్రేకప్ అయిన తర్వాత మరొకరిని రెండోసారి ప్రేమించడానికి చాలా సమయం పట్టిందని ఆమె చెప్పారు. ‘‘నాకు ప్రేమ మీద నమ్మకం ఉంది. నేను రొమాంటిక్ పర్సన్‌ని. కానీ, భావోద్వేగాలను నేను బయటికి వెల్లడించలేను. నాకు పెళ్లి మీద కూడా నమ్మకముంది. నిజం చెప్పాలంటే నేను మరొకరిని ప్రేమించడానికి దాదాపుగా ఏడు నుంచి ఎనిమిదేళ్లు పట్టింది. సోహైల్ నా జీవితంలోకి వచ్చాక ప్రేమ మీద నాకు మరింత నమ్మకం ఏర్పడింది. నా గత రిలేషన్‌షిప్ ముగిసిపోయినది. ప్రస్తుతం నేను కొత్తగా ప్రయాణాన్ని మొదలుపెట్టాను’’ అని హన్సిక తెలిపారు.
హన్సిక త్వరగా పెరిగేందుకు ఆమె తల్లి హార్మోన్ ఇంజక్షన్స్ ఇచ్చిందనే రూమర్స్ గతంలో హల్‌చల్ చేశాయి. తాజాగా ఆమె ఈ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చారు. ‘‘నేను ఎనిమిదేళ్లున్నప్పుడే బాల్యనటిగా ఎంట్రీ ఇచ్చాను. నేను హీరోయిన్‌గా మారగానే త్వరగా పెరగడానికి హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకున్నానని ప్రతి ఒక్కరు అన్నారు. నేను 21ఏళ్లున్నప్పుడు ఈ విధమైన చెత్త వార్తలను రాశారు.
ఆ రూమర్స్ ఒకవేళ నిజమైతే టాటా, బిర్లా కన్న ధనవంతురాలిగా మారేదానిని. ఇటువంటి వార్తలు రాసేవారికి కామన్ సెన్స్ లేదు. మేం పంజాబీలం. 12 ఏళ్ల నుంచి 16 ఏళ్ల మధ్య త్వరగా పెరుగుతాం. సెలబ్రిటీగా ఉన్నందుకు నేను మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది’’ అని హన్సిక తెలిపారు.