మరదళ్ళనే పెళ్లి చేసుకున్న క్రేజీ హీరోలు.. ఎన్టీఆర్ నుంచి యంగ్ హీరోల వరకు..

First Published 8, Apr 2020, 10:26 AM

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ప్రేమ వివాహాలు, డేటింగ్ ల ట్రెండ్ బాగా ఉంది. కనై ఒకప్పుడు మాత్రం పెళ్లంటే తెలిసిన బంధువులతోనే సంబంధాలు కుదుర్చుకునేవారు. చిత్ర పరిశ్రమలో తమ సొంత మరదళ్ళని వివాహం చేసుకున్న హీరోలు కూడా ఉన్నారు. ఎన్టీఆర్ నుంచి ఇప్పటి యంగ్ హీరోల వరకు ఈ ట్రెండ్ ఉంది.

ఎన్టీఆర్: వెండితెరపై, రాజకీయాల్లో జయకేతనం ఎగురవేసిన ఎన్టీఆర్ పెళ్లి చేసుకుంది తన సొంత మరదలినే. ఎన్టీఆర్ ఇంకా సినిమాల్లోకి రాకముందు తన మరదలు బసవతారకంని 1942లో వివాహం చేసుకున్నారు.

కృష్ణ: ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో అంతటి ఖ్యాతిని పొందిన హీరో సూపర్ స్టార్ కృష్ణ. కృష్ణ తన సొంత మరదలు ఇందిరా దేవిని 1961లో వివాహం చేసుకున్నారు.

మోహన్ బాబు: మోహన్ బాబు టాలీవుడ్ లో విలక్షణ నటుడిగా ఎదిగారు. మోహన్ బాబు తన మరదలు విద్యాదేవిని వివాహం చేసుకున్నారు. ఆమె హఠాన్మరణం చెందడంతో విద్యాదేవి చెల్లెలు నిర్మల దేవిని వివాహమాడారు.

ఏఎన్నార్ : అక్కినేని నాగేశ్వర రావు తన మరదలు అన్నపూరమ్మని 1949లో వివాహం చేసుకున్నారు.

ఆది సాయికుమార్ : మరదళ్ళని పెళ్లి చేసుకునే ట్రెండ్ ఈ తరం యంగ్ హీరోల్లో కూడా ఉంది. యంగ్ హీరో ఆది సాయి కుమార్ వివాహం తన సొంత మరదలు అరుణతో జరిగింది. ఆది మేనమామ కుమార్తే అరుణ. వీరిద్దరి వివాహం చిన్నప్పుడే నిశ్చయమైందట.

కార్తీ : తెలుగులో కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న హీరో కార్తీ తన మరదలు రజినీని 2011 లో వివాహం చేసుకున్నాడు.

శివ కార్తికేయన్: తమిళంలో క్రేజీ హీరోగా మారిపోయిన శివ కార్తికేయన్ కూడా తన మరదలు ఆర్తిని పెళ్లి చేసుకున్నాడు. 2010 వీరిద్దరి వివాహం జరిగింది.

loader