ఇవి వాళ్ళ డ్రీమ్ ప్రాజెక్ట్స్.. కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్!

First Published 20, Oct 2019, 3:57 PM

తమ హీరో ఇలాంటి చిత్రాల్లో నటిస్తే బావుంటుందని అభిమానులకు ఓ లెక్క ఉంటుంది. అలాగే దర్శకులు, హీరోలకు కూడా కొన్ని డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఆ ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం. 

కోబలి : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం సిద్ధం చేసుకున్న కథ కోబలి. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ కథ ఉంటుంది. అప్పట్లో ఈ చిత్రంపై అనేక వార్తలు వచ్చాయి. కానీ అనుకోని కారణాలవల్ల ఈ ప్రాజెక్ట్ సాధ్యం కాలేదు. ఇటీవల అరవింద సమేత చిత్ర విడుదల సమయంలో కోబలి గురించి మాట్లాడుతూ ఆ కథని ఎప్పటికైనా పవన్ తోనే చేస్తానని త్రివిక్రమ్ అన్నారు.

జేమ్స్ బాండ్ : సూపర్ స్టార్ మహేష్ బాబుని ఇండియన్ జేమ్స్ బాండ్ గా చూడాలని ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఆశపడుతున్నారు. అభిమానులు మాత్రమే కాదు మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి కోరిక కూడా అదే. జేమ్స్ బాండ్ తరహా హై డోస్ యాక్షన్ చిత్రంలో మహేష్ కనిపిస్తే టాలీవుడ్ రికార్డులు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు.

భక్త కన్నప్ప : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని భక్త కన్నప్పగా చూడాలనేది కృష్ణం రాజు కల. ఈ చిత్రంపై పలు సందర్భాల్లో కృష్ణం రాజు స్పందించారు. కానీ చిత్రం విషయంలో తొలి అడుగు ఎప్పుడు పడుతుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

జనగణమన : డాషింగ్ డైరెక్ట్ పూరి జగన్నాధ్ ఎంతో ముచ్చట పడి సిద్ధం చేసుకున్న కథ జనగణమన. మొదట ఈ చిత్రాన్ని మహేష్ బాబుతో అనుకున్నారు. కానీ మహేష్ ఈ చిత్రానికి నో చెప్పాడు. ఎప్పటికైనా ఈ చిత్రాన్ని వెండితెరపై ఆవిష్కరించాలనేది పూరి కోరిక.

మహాభారతం : దర్శకధీరుడు రాజమౌళి కలల ప్రాజెక్ట్ ఇది. మహాభారతం చిత్రాన్ని ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిస్తే వెండితెర అద్భుతం అవుతుందని రాజమౌళి తెలిపారు. కానీ ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడానికి తనకు సమయం పడుతుందని జక్కన్న అంటున్నారు.

హిరణ్యకశ్యప : ప్రతిభగల దర్శకుడు గుణశేఖర్ ఏళ్లతరబడి ఈ పౌరాణిక చిత్రంపై వర్క్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో దగ్గుబాటి రానాని హిరణ్యకశ్యపుడిగా వెండితెరపై చూపించాలనేది గుణశేఖర్ కోరిక.

పొన్నియన్ సెల్వన్ : చోళుల చరిత్ర ఆధారంగా దర్శకదిగ్గజం మణిరత్నం ఈ కథని సిద్ధం చేశారు. చోళరాజుల వైభవాన్ని భారతీయులకు చూపించాలనేది ఆయన కోరిక. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. విక్రమ్, ఐశ్వర్య రాయ్ లాంటి అగ్ర తారలు ఈ చిత్రాల్లో నటించబోతున్నారు.

మెగా 'మనం' : అక్కినేని 'మనం ' తరహాలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాంచరణ్ హీరోలుగా మెగా మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించాలనేది తన కోరిక అని హరీష్ శంకర్ ఓ సందర్భంలో తెలిపారు. ఈ చిత్రం పట్టాలెక్కితే మెగా అభిమానులకు పండగే.

నందమూరి మల్టీస్టారర్ : అదే విధంగా ఎన్టీఆర్, బాలయ్య, కళ్యాణ్ రామ్ లు కలసి ఓ చిత్రంలో నటిస్తే బావుంటుందనేది ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చ.

మరుధనయాగం: విశ్వనటుడు కమల్ హాసన్ కి ఒక మంచి పాత్ర దొరికితే ఎలా నటిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కమల్ హాసన్ డ్రీమ్ ప్రాజెక్ట్ మరుధనయాగం. ఎన్నో ఎల్లా క్రితం ప్రారంభమైన ఈ చిత్రం అర్థాంతరంగా ఆగిపోయింది. బడ్జెట్ కారణాల దృష్ట్యా ఈ చిత్రాన్ని ఆపేశారు. ఎప్పటికైనా ఈ చిత్రాన్ని పూర్తి చేయాలనేది కమల్ కోరిక.

దాన వీర శూరకర్ణ: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఓ భారీ పౌరాణిక చిత్రంలో చూడాలని అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ దానవీర శూర కర్ణ లాంటి చిత్రంలో ఎన్టీఆర్ నటిస్తే అద్భుతం జరుగుతుందని చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. అలాంటి పాత్రలో తాను ఎలా నటిస్తానో అని ఎన్టీఆర్ యమదొంగ చిత్రంలో శాంపిల్ చూపించాడు. ఆ తరహా కథ సిద్ధం చేయడం దర్శకులదే ఆలస్యం.