మహేష్, చరణ్ ఇంకా ఎవరెవరంటే.. స్టార్స్ ఫస్ట్ మూవీ చేయలేం అని చెప్పిన దర్శకులు!

First Published 10, Nov 2019, 11:46 AM

టాలీవుడ్ సెలెబ్రిటీల వారసుల చిత్రాలకు మంచి డిమాండ్ ఉంటుంది. టాలీవుడ్ హీరోలని లాంచ్ చేసే అవకాశం కొందరు దర్శకుల నుంచి చేజారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.. 

నాగ చైతన్య - పూరి జగన్నాధ్ : నాగ చైతన్య ఫస్ట్ మూవీని పూరి జగన్నాధ్ దర్శత్వంలో తెరక్కించాలని నాగార్జున మొదట ప్లాన్ చేశారు. కానీ కథ కుదరకపోవడం వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి పూరి తప్పుకున్నారు. చైతు తొలి చిత్రం జోష్ వాసు వర్మ దర్శకత్వంలో తెరకెక్కింది.

అల్లు అర్జున్ - తేజ : డైరెక్టర్ తేజ మొదట అల్లు అర్జున్ ని లాంచ్ చేయాలనుకున్నారు. జయం కథ మొదట బన్నీ వద్దకే వెళ్ళింది. కానీ అనుకోని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నితిన్ చేతుల్లోకి వెళ్ళింది.

మహేష్ బాబు - ఎస్వీ కృష్ణారెడ్డి : సూపర్ స్టార్ మహేష్ ని టాలీవుడ్ కు హీరోగా పరిచయం చేయాలని ఎస్వీ కృష్ణారెడ్డి ప్రయత్నించారు. యమలీల కథని కూడా కృష్ణకు వినిపించారు. మహేష్ ప్రస్తుతం చదువుకుంటున్నాడని కృష్ణ ఆ ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేసారు.

మహేష్ - కృష్ణవంశీ: ఇక మహేష్ టాలీవుడ్ ఎంట్రీకి సిద్దమయ్యాక కృష్ణ మొదటగా దర్శకుడు కృష్ణవంశీ కోసం ప్రయత్నించారు. కానీ తొలి సినిమాపై అంచనాలు భారీగా ఉంటాయి. కాబట్టి నేను కరెక్ట్ కాదు. మహేష్ తో తర్వాత చేస్తా అని కృష్ణవంశి కృష్ణతో అన్నారట. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో మహేష్ రాజకుమారుడు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

రామ్ చరణ్ - రాజమౌళి : చరణ్ కి తొలి సినిమాతోనే మాస్ లో ఇమేజ్ పెంచాలి. దీని కోసం రాజమౌళి అయితే కరెక్ట్ అని చిరంజీవి భావించారు. చరణ్ ని లాంచ్ చేయమని రాజమౌళిని అడగగా.. నేను మొదట చరణ్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందో గమనించాలి. కాబట్టి రెండవ సినిమా చేస్తానని రాజమౌళి అన్నారట. దీనితో చిరు చరణ్ ఫస్ట్ మూవీ కోసం పూరి జగన్నాధ్ ని ఎంచుకున్నారు.

అఖిల్ - విక్రమ్ కుమార్ : అఖిల్ ని హీరోగా పరిచయం చేయాలని నాగ్ అనుకున్నప్పుడు ఆయన ఫస్ట్ ఛాయిస్ మనం ఫేమ్ విక్రమ్ కుమార్. కానీ అనుకోని కారణాల వల్ల వివి వినాయక్ అఖిల్ ని లాంచ్ చేశారు.

రామ్ పోతినేని: ఎనర్జిటిక్ స్టార్ రామ్ తొలి చిత్రం దేవదాసు వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కింది. కానీ రామ్ బాబాయ్ స్రవంతి రవికిశోర్ మాత్రం యువసేన రీమేక్ చిత్రంతో అతడిని హీరోగా లాంచ్ చేయాలని అనుకున్నారు. అనుకోకుండా వైవిఎస్ చౌదరి రామ్ ని ఓ షార్ట్ ఫిలిం లో చూడడంతో దేవదాసు చిత్రం ఓకే అయింది.

వరుణ్ తేజ్ - క్రిష్ : డైరెక్టర్ క్రిష్ మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ ని లాంచ్ చేయాలని అనుకున్నాడట. ఆ మేరకు కంచె కథని చిరంజీవికి వినిపించగా.. వరుణ్ తొలి చిత్రానికి ఈ కథ కరెక్ట్ కాదని చిరంజీవి అన్నారు. దీనితో శ్రీకాంత్ అడ్డాల దర్శత్వంలో వరుణ్ ఫస్ట్ మూవీ తెరకెక్కింది.

రానా - రాఘవేంద్ర రావు : సురేష్ బాబు తనయుడు రానాని ఓ సందర్భంలో రాఘవేంద్ర రావు చూశారట. బాబుకి ట్రైనింగ్ ఇప్పించండి మంచి మాస్ సినిమా చేద్దాం అని అన్నారట. కానీ ఇంతలోనే శేఖర్ కమ్ముల లీడర్ కథతో వచ్చారు. ఫస్ట్ మూవీనే పొలిటికల్ సబ్జెక్టు కావడంతో సురేష్ బాబు కొంత అయిష్టంగానే ఈ చిత్రానికి అంగీకరించారు.

వెంకటేష్ - రాఘవేంద్ర రావు : విక్టరీ వెంకటేష్ డెబ్యూ మూవీ కలియుగ పాండవులు ఘనవిజయం సాధించింది. ఈ చిత్రానికి రాఘవేంద్ర రావు దర్శకుడు. వెంకీ తండ్రి రామానాయుడు నిర్మాత. వాస్తవానికి ఆ సమయంలో వెంకటేష్ ని లాంచ్ చేసే ఆలోచన రామానాయుడికి లేదు. కృష్ణ, చిరంజీవి లాంటి హీరోలతో సినిమా చేయాలని డేట్స్ కోసం ప్రయత్నించారు. దర్శకుడిగా రాఘవేంద్ర రావు సిద్ధంగా ఉన్నారు. కానీ వారి డేట్స్ కుదర్లేదు. ఆ సమయంలో వెంకటేష్ కోసం పరుచూరి బ్రదర్స్ కథ సిద్ధం చేశారు. అలా వెంకీ రాఘవేంద్ర రావు దర్శత్వంలో హీరో అయ్యాడు.

loader