- Home
- Entertainment
- Entertainment News
- Poorna Latest Photos : లెహంగా దుప్పట్టాలో ‘ఢీ’బ్యూటీ పూర్ణ అందాలు.. ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తోంది..
Poorna Latest Photos : లెహంగా దుప్పట్టాలో ‘ఢీ’బ్యూటీ పూర్ణ అందాలు.. ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తోంది..
కేరళ కుట్టి, ఢీ (Dhee) బ్యూటీ పూర్ణ (Poorna) ట్రెడిషనల్ లుక్ లో మనస్సును దోచుకుటోంది. చిరునవ్వుతో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతోంది. లేటెస్ట్ ఫొటోషూట్ తో నెటిజన్లను తన మైపు అట్రాక్ట్ చేస్తోంది.

ఢీ పూర్ణ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ మెస్మరైజ్ చేస్తుంది. తన ఫోటో షూట్లతో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ఇటీవల కెరీర్ పరంగా దూకుడు పెంచిన ఈ భామ.. గ్లామర్ పరంగానూ తగ్గేదెలే అని నిరూపిస్తుంది. వరుస ఫొటోషూట్లతో నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తోంది. తాజాగా తను పోస్ట్ చేసిన ఫొటోలు నెటింట వైరల్ అవుతున్నాయి.
ఈ ఫొటోల్లో గ్రీన్ కలర్ లెహంగా, దుప్పట్టా లో హోయలు పోయింది పూర్ణ. బొద్దుగా కనిపించే తన ఒంటిపై సంప్రదాయ దుస్తులు మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి. పూర్ణ ఒక్కో స్టిల్ తో నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. ఇటీవల ట్రెడిషనల్ లుక్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది పూర్ణ. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫొటోలకు అభిమానులు ఫిదా అవుతున్నారు.
ఫొటోలను పోస్ట్ చేస్తూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ‘మీరు నిజంగా సంతోషంగా ఉంటే.. మీరు భిన్నంగా ప్రకాశిస్తారు’ అంటూ తెలిపింది. నచ్చిన జాబ్ చేస్తే అందులో ఉండే సంతోషమే వేరు అని కూడా అభిప్రాయపపడింది. ట్రెడిషనల్ వేర్ లో అచ్చు తెలుగమ్మాయిలా దర్శనమిచ్చిన పూర్ణ.. సోషల్ మీడియాలో తన క్రేజ్ ను పెంచుకుంటోంది.
మరోవైపు సినిమాల పరంగాను జోరు పెంచింది. ఆమెకి ఇప్పుడు ఓ రకంగా కమ్ బ్యాక్ అని చెప్పొచ్చు. గతంలో `అవును` ‘సీమ టపాకాయ్’ వంటి సినిమాల హిట్‌తో క్రేజ్‌ను సొంతం చేసుకుని వరుస సినిమాలు చేసింది పూర్ణ. కానీ సరైన కథలను, పాత్రలను ఎంపిక చేసుకోవడంలో విఫలం కావడంతో కెరీర్ కాస్త గాడి తప్పింది. చిన్న సినిమాలకే పరిమితమయ్యింది.
కానీ ఇటీవల ఆమె పలు భారీ సినిమాల్లో భాగమైంది. ఓ వైపు `తలైవి`, మరోవైపు `దృశ్యం 2`, ఇంకోవైపు బాలయ్య `అఖండ` చిత్రంలో వరుసగా కనిపించింది. బ్యాక్ టూ బ్యాక్ ప్రేక్షకులను అలరించింది. మరోవైపు `సుందరి` అనే సినిమాలోనూ బోల్డ్ రోల్ చేసి ఆశ్చర్యపరిచింది. ఆమె నటించిన `తలైవి`, `దృశ్యం2`, `అఖండ` చిత్రాలు మంచి విజయాలు సాధించాయి.
ముఖ్యంగా `అఖండ` బ్లాక్ బస్టర్ కావడంతో పూర్ణకి మంచి పేరొచ్చింది. ప్రస్తుతం రవిబాబు (Ravi Babu)తో కలిసి మరో హర్రర్ పిక్చర్ ‘అసలు’ మూవీలో నటిస్తోంది. అలాగే తమిళంలో ఏకంగా నాలుగు సినిమాల్లో నటించింది. ఇప్పటికే మూడు చిత్రాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. తెలుగులో ‘బ్యాక్ డోర్, తెలుగులో నాకు నచ్చని పదం ప్రేమ’ అనే రెండు సినిమాల్లో నటించింది. ఈ చిత్రాలు త్వరలోప్రేక్షకుల ముందుకు రానున్నాయి.