' పుష్ప – 2' టీమ్ ని ఈ మూడు ఇబ్బందులే భయ పెడుతున్నాయి?
రిలీజ్ టైమ్ కు టైమ్ దగ్గర పడుతున్న టైమ్ లో ఈ సినిమాకు కొత్త ట్విస్ట్ లు ఎదురౌతున్నాయి. ముఖ్యంగా మూడు సమస్యలు ఈ టీమ్ ని భయపెడుతున్నాయి.
పుష్ప పార్ట్ 1 రిలీజ్ నాటికి ఈ క్రేజ్ లేదు..ఈ స్దాయి ఎక్సపెక్టేషన్స్ లేవు. కానీ ఇప్పుడు సీన్ వేరు. ‘పుష్ప ది రైజ్’ మూవీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన కెరీర్ లోనే భారీ బ్లాక్బాస్టర్గా నిలిచింది. 2021లో రిలీజైన ఈ మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నారు.. అంతే కాదు జాతీయ అవార్డ్స్ లో అల్లు అర్జున్ పుష్ప చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా అవార్డు గెలుచుకొని చరిత్ర సృష్టించారు. జాతీయ అవార్డు రావడంతో పుష్ప మూవీ క్రేజ్ పాన్ ఇండియా రేంజ్లో మారు మ్రోగిపోయింది.. ఈ క్రమంలో ఇప్పుడు అంతా ‘పుష్ప ది రూల్’ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01htwdf9j5sa64gppfnm8hs77m/pushpa2-jpg_300x171xt.jpg)
‘పుష్ప ది రూల్’ భారీగా ఎక్సపెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఈ ఏడాది (2024) ఆగస్టు 15వ తేదీన పుష్ప 2 మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. రిలీజ్ టైమ్ కు టైమ్ దగ్గర పడుతున్న టైమ్ లో ఈ సినిమాకు కొత్త ట్విస్ట్ లు ఎదురౌతున్నాయి. ముఖ్యంగా మూడు సమస్యలు ఈ టీమ్ ని భయపెడుతున్నాయి. సుకుమార్ వాటిని ఎలా అధిగమించి ముందుకు తీసుకెళ్తారో అనే టెన్షన్ లో టీమ్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే సుకుమార్ టాస్క్ మాస్టర్ . ఎలాంటి సమస్యను అయినా చిటికలో పరిష్కరిస్తూంటారు. కాబట్టి ధైర్యం అంటున్నారు. ఇంతకీ ఏమిటా సమస్యలు.
Pushpa2
Pushpa2 సమస్యలో మొదటిది ...అనుకున్న టైమ్ కన్నా ఎక్కువ కాలం షూట్ జరగటంతో ఆర్టిస్ట్ లు డేట్స్ గజిబిజి అయ్యాయి. అయితే పెద్ద ప్రొడక్షన్ కంపెనీ, స్టార్ హీరో , స్టార్ డైరక్టర్ కావటంతో చాలా మంది ఆర్టిస్ట్ లు మిగతా షూట్ లను రిక్వెస్ట్ చేసుకుని ఇక్కడకు వస్తున్నారు. అయితే సినిమాలో కీ రోల్ లో విలన్ గా చేస్తున్న ఫహద్ ఫాజిల్ మాత్రం ఈ సినిమాకు డేట్లు కేటాయించడం లేని పరిస్దితి ఎదురైందని తెలుస్తోంది.
pushpa2
మీడియా వర్గాల నుంచి అందుతన్న సమాచారం మేరకు... ఈ సినిమాలో ఫహద్ కీలక పాత్ర పోషిస్తూండటంతో ఎక్కువ డేట్స్ అవసరం. అందులో భాగంగా ఇప్పటికే ఆయనపై ఇప్పటికే కొంతమేర షూటింగ్ చేశారు. అయితే మరో 15 రోజుల కాల్షీట్లు అవసరం ఉన్నాయట. కానీ అసలే ఆవేశం వంటి సూపర్ హిట్ ఇచ్చి ఉండటంతో ఫహద్ కు ఉన్న బిజీ వల్ల డేట్లు కేటాయించడం లేని పరిస్దితి ఎదురౌతోందిట. దాంతో ఎప్పుడు ఫహద్ వస్తే అప్పుడే ఆయనపై షూట్ అన్న సిట్యువేషన్ ఎదురైందిట.
అలాగే ఈ సినిమాకు ఐటమ్ సాంగ్ చేసే హీరోయిన్ సమస్య కూడా వెంటాడుతోంది. ఈ సినిమా కోసం ఐటెమ్ గర్ల్ గా ఎవరిని తీసుకోవాలన్న విషయంలో క్లారిటీ రాలేదని తెలుస్తోంది. చాలామంది స్టార్ హీరోయిన్స్ పేర్లు పరిశీలించారు. కానీ కుదరడం లేదు. ఎవరూ దొరకని పక్షంలో ఈ పాటని జాన్వీకపూర్‌తో ఈ సాంగ్ ని తీయాలని భావిస్తున్నారు. ఈ విషయంలోనూ ఈ వారం, పది రోజుల్లో ఓ స్పష్టత వస్తుందని వినపడుతోంది.
ఇక ఇవి ఇలా ఉంటే అకాల వర్షాలు కూడా టీమ్ ని భయపెడుతున్నాయి. వర్షం కురిస్తే షూట్ కాన్సిల్ అయ్యిపోతుంది. టైమ్ దగ్గరపడుతోంది. అలాంటి టైమ్ లో లేటు అయితే కష్టం. గ్యాప్ ఇవ్వకుండా డే అండ్ నైట్ టీమ్ పని చేస్తోంది. ఈ సినిమా కోసం మలేషియాలో కీ సీన్స్ తెరకెక్కించాలనుకొన్నారు. అయితే రిలీజ్ టైమ్ దగ్గర పడుతున్న టైమ్ లో అంత టైమ్ లేక హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీనే మలేషియాగా మారుస్తున్నారు. ఫిల్మ్ సిటిలో ఈ సినిమా కోసం ఓ భారీ సెట్ తీర్చిదిద్దారు. అక్కడే మలేషియాలో తెరకెక్కించాల్సిన సీన్స్ షూట్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే రీసెంట్ గా సినిమా కీ టెక్నీషియన్ ప్రాజెక్టు నుంచి బయిటకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. డేట్స్ క్లాష్ సమస్యల కారణంగా పుష్ప 2 ఎడిటర్ ఆంటోనీ రూబెన్ ఈ చిత్రం నుండి వైదొలిగినట్లు తెలుస్తోంది. ఇలాంటి పెద్ద ప్రాజెక్టులకు కీ టీమ్ సహకారం అత్యవసరం. అప్పుడే అద్బుతమైన అవుట్ ఫుట్ వస్తుంది. అయితే అనుకున్న టైమ్ కన్నా పుష్ప 2 లేటు అవుతూ రావటంతో తప్పనిసరిపరిస్దితుల్లో వేరే కమిట్మెంట్స్ తో ఎడిటర్ ..ప్రాజెక్టుకు బై చెప్పినట్లు బాలీవుడ్ మీడియా ద్వారా తెలుస్తోంది.
పుష్ప: ది రైజ్, జవాన్, బిగిల్, మెర్సల్, వివేగం వంటి బ్లాక్బస్టర్లను ఎడిటింగ్ చేయడంలో పేరుగాంచిన ఆంటోనీ రూబెన్, తన హెక్టిక్ షెడ్యూల్లో సమయం కేటాయించలేక సినిమా నుండి ప్రెండ్లీగానే తప్పనిసరి పరిస్దితుల్లో బయిటకు వెళ్లాడని చెప్తున్నారు. రూబెన్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న వరుణ్ ధావన్ నటించిన బేబీ జాన్‌తో భారీగా పాల్గొంటున్నాడు. ఆ సినిమాకు అతను ఎడిటింగ్ మాత్రమే కాకుండా అసోసియేట్ ప్రొడ్యూస్ కూడా చేస్తున్నాడు. అతను మరో చిత్రం కూడా కమిట్ అయ్యాడు.
ఇక ఆంటోని రూబెన్ నిష్క్రమణ తరువాత, సుకుమార్, అల్లు అర్జున్ టీమ్ రకరకాల ఆలోచనలు చేసిందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఎడిటింగ్ బాధ్యతలను స్వీకరించడానికి జాతీయ అవార్డు గెలుచుకున్న నవీన్ నూలితో చర్చలు ప్రారంభించారు. నవీన్ నూలి గతంలో సుకుమార్‌తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ యొక్క నాన్నకు ప్రేమతో (2016) మరియు రామ్ చరణ్ నటించిన రంగస్థలం (2018) చిత్రాలకు పనిచేశాడు.
పుష్ప 2 చిత్రానికి ఎలాగో తెలుగు రాష్ట్రాల్లో భీబత్సమైన క్రేజ్ ఉంటుంది. అయితే హిందీ బెల్ట్ లలో మాత్రం ఇంకా క్రేజ్ మొదలు కాలేదు. ఫస్ట్ సాంగ్ డీసెంట్ గా రెస్పాన్స్ వచ్చిందని కానీ ఇనిస్టెంట్ ఛాట్ బస్టర్ కాలేదు. దాంతో ఇంకా అక్కడ పుష్ప 2 ఫీవర్ ప్రారంభం కాలేదు. అందుకోసం నిర్మాతలు ప్రమోషన్ ప్లాన్స్ చేస్తున్నారు. ఇక్కడ ఎలక్షన్స్ ఫీవర్ తగ్గింది కాబట్టి పుష్ప ఫీవర్ స్టార్ట్ అవ్వాల్సి ఉంది.
పుష్పలో ఐకాన్‌స్టార్ నటనకు, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వ ప్రతిభకు అందరూ ఫిదా అయిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కలయికలో రాబోతున్న పుష్ప-2 ది రూల్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆకాశమే హద్దుగా అంచనాలు వున్నాయి. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేసారు మేకర్స్ . ఈ టీజర్ లో అల్లు అర్జున్ ఎంతో ఫెరోషియస్‌గా, పవర్‌ఫుల్‌గా కనిపించంటతో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
పాన్ ఇండియా రేంజ్ లో పుష్ప పార్ట్ 1 మూవీ సూపర్ సక్సెస్ అయ్యింది. ఫస్ట్ టైమ్ పాన్ ఇండియాకు వెళ్ళినందకు బన్నీకి సూపర్ గిఫ్ట్ లభించింది. అటు రష్మిక బాలీవుడ్ రేంజ్ లో ఇమేజ్ పెంచుకుంది. అంతే కాదు సుకుమార్ కు పాన్ ఇండియా రేంజ్ లో మంచి పేరు కూడా వచ్చింది. ఇప్పుడు దాన్ని నిలబెట్టుకోవాల్సిన భాద్యత కూడా ఈ టీమ్ పై ఉంది.