- Home
- Entertainment
- Entertainment News
- #pawankalyan: పవన్ కళ్యాణ్ కే మూడేళ్లు వేస్ట్, ప్రత్యక్ష సాక్షి నేను..!
#pawankalyan: పవన్ కళ్యాణ్ కే మూడేళ్లు వేస్ట్, ప్రత్యక్ష సాక్షి నేను..!
#pawankalyan: నిర్మాత శింగనమల రమేష్ చేసిన ఆరోపణలకు బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ 'కొమురం పులి', మహేష్ బాబు 'ఖలేజా' సినిమాల వల్ల తనకు రూ.100 కోట్ల నష్టం వచ్చిందని రమేష్ చెప్పగా, బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ 'కొమురం పులి' సినిమా కోసం మూడేళ్లు కష్టపడ్డారని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Bandla Ganesh Counter to Singanamala Ramesh
తమిళంలో 'విలన్' 'పోకిరి' సినిమాలు నిర్మించిన శింగనమల రమేష్ బాబు.. కనకరత్న మూవీస్ బ్యానర్ లో తెలుగులో 'కొమురం పులి', 'ఖలేజా' సినిమాలు నిర్మించారు. ఆరోజుల్లోనే ఇవి రెండూ భారీ బడ్జెట్ చిత్రాలు. అయితే రెండు సినిమాలు ఫెయిల్ అవ్వడంతో నిర్మాతకు తీవ్రమైన నష్టాలు వచ్చాయి.
''పవన్ కల్యాణ్, మహేష్ బాబు నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు. కనీసం అయ్యో పాపం అని పలకరించిన పాపాన కూడా పోలేదు'' అని రమేష్ కీలక వ్యాఖ్యలు చేసారు. 'కొమురం పులి' చేస్తున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీ పెట్టుకున్నారని, దాని వల్ల సినిమా ఎంతో కొంత డిలే అయిందని చెప్పారు. అలానే 'ఖలేజా' మూవీ కూడా అనేక కారణాలతో ఆలస్యమైందని నిర్మాత తెలిపారు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'కొమురం పులి'.. సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన 'ఖలేజా' సినిమాలు కారణంగా తనకు రూ.100 కోట్ల నష్టం వచ్చినట్లుగా నిర్మాత తాజాగా వెల్లడించారు. 'విధి వంచనకు తలవంచని ధైర్యం' పేరుతో శింగనమల రమేష్ బాబు ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ''ఈరోజుల్లో శంకర్, రాజమౌళి సినిమాలప్రొడక్షన్ కోసం మూడు నాలుగేళ్ల సమయం పడుతుంటుంది. రీసెంట్ గా 'పుష్ప 2' మూవీని మూడేళ్లు చేసారు. కానీ నేను నిర్మాణంలో ఉన్న రోజుల్లో మూడేళ్ళ సినిమా అనేదే లేదు. ఆరు నెలల నుంచి ఒక ఏడాది లోపు పూర్తయ్యేవి.
నా ఫేట్, బ్యాడ్ లక్ ఏంటంటే.. 'కొమురం పులి', 'ఖలేజా' సినిమాలకు మూడు సంవత్సరాల టైం పట్టింది. మూడేళ్లకు మెయింటనెన్స్ ఎంత ఉంటుందనేది ఒక ప్రొడ్యూసర్ కే తెలుస్తుంది. నాకు రెండు సినిమాల్లో 100 కోట్ల నష్టం వచ్చింది'' అని అన్నారు.
శింగనమల కామెంట్స్‌కి బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు.“సింగనమల రమేష్ గారు మీరు సరిగ్గా సినిమాను ప్లాన్ చేసుకోలేకపోవడం మీ తప్పు.! మీ కోసం పవన్ కళ్యాణ్ గారు 3 సంవత్సరాల పాటు ఏ చిత్రం చేయకుండా కొన్ని వందల కాల్షీట్స్ వేస్ట్ చేసుకున్నారు. ప్రత్యక్ష సాక్షి నేను..! దయచేసి ఈ విషయాన్ని రాద్ధాంతం చేసుకోకండి..! ఇది కరెక్ట్ కాదు.!” అంటూ బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.