బాలయ్యను ఆ సినిమా చేయద్దంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్ లు
గ్యాంగ్‌స్టర్ రంగా పాత్రకే బాలయ్యను తీసుకుంటున్నారు. ఆ పాత్ర ఎంట్రీతోనే కథలో అసలు జోష్ మొదలవుతుంది.
బాలకృష్ణకు ఉండే ఫ్యాన్స్ ఫాలోయింగ్ వేరు. ఆయన అభిమానులు ఆయనంటే ప్రాణం పెడతారు. అందుకే బాలకృష్ణకు సంబంధించిన ఏ తాజా వార్త వెలుగుచూసినా.. అది సోషల్‌మీడియాలో క్షణాల్లో వైరల్ అయిపోతూ ఉంటుంది. మాస్‌లో ఆయనకున్న క్రేజ్ అలాంటిది. ఆ వార్తపై సోషల్ మీడియాలో ఆయన అభిమానులు డిస్కషన్స్ మొదలెట్టేస్తూంటారు. తాజాగా ఓ వార్త అభిమానుల్లో భారీ డిస్కషన్స్ కు దారి తీసింది. అదేంటంటే...
ఆ వార్త ఏమిటంటే... మలయాళంలో ఈ ఏడాది భారీ విజయాన్ని అందుకున్న ఫహద్ ఫాజిల్ ‘ఆవేశం’ సినిమాను, తెలుగులో బాలయ్యతో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. మైత్రీ మూవీమేకర్స్ అధినేతలు ఈ చిత్రం రీమేక్ హక్కులు సొంతం చేసుకోవడంతోపాటు, బాలకృష్ణను ఒప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారట. మరి ఈ వార్తలో నిజమెంత అనేది క్లారిటీ లేదు. అయితేనేం మీడియాలో భారీగా ప్రచారం జరుగుతోంది.
Nandamuri Balakrishna
మలయాళంలో ఫహద్ ఫాజిల్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన ‘ఆవేశం’ సినిమా పెద్ద హిట్ . దాదాపు 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చిందీ ఈ సినిమా. ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ రంగ అనే ఓ రౌడీ పాత్రలో పవర్ ఫుల్ క్యారక్టర్ లో కనిపించాడు. కొంతమంది కాలేజీ స్టూడెంట్స్ కి హెల్ప్ చేసే కథతో యాక్షన్ కామెడీగా ఆవేశం సినిమా తెరకెక్కింది. ఈ సినిమా మళయాళంలోనే రిలీజ్ అయినా ఓటీటీలో తెలుగులో తప్పించి మళయాళ, తమిళ, కన్నడ,హిందీ అన్ని భాషల్లో రిలీజైంది. తెలుగు రీమేక్ రైట్స్ మైత్రీ మూవీస్ వారు తీసుకుని రీమేక్ చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు హరీష్ శంకర్ ని డైరక్టర్ గా ఎంచుకున్నారని వార్త.
Balakrishna
ఆవేశం సినిమాలో కథ కన్నా కథనం గొప్పగా ఉంటుంది. ‘ఆవేశం’లో రంగా పాత్రకు నెగెటివ్ షేడ్స్‌తో పాటు, కామెడీ, అతిగా రెస్పాండ్ అయ్యే తీరు తీర్చిదిద్దిన విధానం అందరికీ నచ్చింది. రెండున్నర గంటల పాటు ప్రేక్షకుడిని రోలర్‌కోస్టర్ ఎక్కించి నవ్వించాడు దర్శకుడు జితూ మాధవన్.
గ్యాంగ్‌స్టర్ రంగా పాత్రకే బాలయ్యను తీసుకుంటున్నారు. ఆ పాత్ర ఎంట్రీతోనే కథలో అసలు జోష్ మొదలవుతుంది. ఆ పాత్ర గెటప్, లుక్, విభిన్నంగా ఉంటుంది. డైలాగులు చెప్తూంటే థియేటర్స్ దద్దరిల్లాయి. కాబట్టే హరీష్ శంకర్ డైలాగులు రాస్తే బాలయ్య ఆ పాత్రలోకి వస్తే మామూలుగా ఉండదని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
వాస్తవానికి బాలయ్య కు సినిమాల పరంగానూ, వ్యక్తిగతంగానూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఆయన చేసే పాత్రలు లార్జర్ దేన్ లైఫ్ ఉంటాయి. ఎక్కువ శాతం సీరియస్ గా సాగుతూంటాయి. పూర్తి యాక్షన్ ఇమేజ్ తో సాగే ఆ పాత్రలు ఆయన కోసమే డిజైన్ చేస్తారు. వేరే వాళ్లు కనుక ఆ పాత్ర చేస్తే నవ్వులు పాలు అవుతారు. ఆయన వందశాతం ఆ ఎమోషన్స్ కు సెట్ అయ్యిపోతూంటారు. అందుకే కామెడీ సినిమాలు ఆయన కెరీర్ లో చేసినవి అతి తక్కువ. అయితే ఇప్పుడు ఫన్ , యాక్షన్,ఎమోషన్ తో వచ్చిన ‘ఆవేశం’రీమేక్ లో ఆయన చేయబోతున్నాడనే వార్తలు అభిమానుల్లో కొందరిని కంగారు పెడుతున్నాయి.
ఆవేశం కథ బాలకృష్ణ ఇమేజ్‌కు ఈ కథ సూటవ్వదని, బాలయ్య ఇమేజ్, ఫహద్ ఫాజల్ ఇమేజ్ రెండూ వేర్వేరని, ఇద్దరికీ మ్యాచ్ అయ్యే ప్రసక్తే లేదని చెప్తున్నారు. ఇవన్నీ గుర్తు చేస్తూ సోషల్ మీడియా సాక్షిగా రిక్వెస్టులు చేస్తున్నారు. అయినా ఓటిటిలు వచ్చాక ఆల్రెడీ ఆ సినిమాలను జనం చూసేసి ఉంటున్నారు కాబట్టి, పెద్దగా ఉపయోగపడదని వాదిస్తున్నారు.
Balakrishna
మరో ప్రక్క ఇన్ సైడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నిజానికి బాలయ్య రీమేక్ చేయడానికి ఏమాత్రం సముఖంగా లేడని తెలుస్తోంది. ఈ సినిమా అనే కాదు, అసలు రీమేకే చేయకూడదని బాలయ్య నిర్ణయం తీసుకొన్నాడని చెప్తున్నారు. అయితే ఆవేశం సినిమా మాత్రం బాలయ్యకు నచ్చిందిట. హరీష్ శంకర్ డైరక్టర్ గా ఓ వెర్షన్ వినిస్తాడంటున్నారు. హరీష్ శంకర్ పూర్తి మార్పులతో బాలయ్య ఇమేజ్ కు తగ్గట్లు చేస్తే చేయచ్చేమో....అప్పుడు బాలయ్య ఫ్యాన్స్ కూడా ఈ బెంగలేం పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు.