MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • 'బ్యాడ్ గర్ల్' వివాదంలో స్టార్ డైరక్టర్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ షాకింగ్ రిక్వెస్ట్ లు

'బ్యాడ్ గర్ల్' వివాదంలో స్టార్ డైరక్టర్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ షాకింగ్ రిక్వెస్ట్ లు

వెట్రిమారన్ పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దర్శకునితో మాకు సినిమా వద్దని తారక్ కూడా సినిమా చెయ్యడానికి లేదు అని పోస్ట్ లు పెడుతున్నారు. ఏదైమైనా ఇది ఈ చిన్న సినిమాకు పెద్ద పబ్లిసిటీ జరుగుతోందననేది నిజం. 

2 Min read
Author : Surya Prakash
Published : Jan 30 2025, 07:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Vetri Maaran, Bad Girl, Jr NTR Fans

Vetri Maaran, Bad Girl, Jr NTR Fans


చిన్న సినిమాలకు వివాదమే బలం అని చాలా మంది మేకర్స్ నమ్ముతూంటారు. అయితే కంటెంట్ ని నమ్ముకుని ముందుకెళ్లే వెట్రిమారన్ వంటి దర్శకులు కూడా ఇలా చేయాలా అంటున్నారు. ఆయన నిర్మిస్తున్న చిత్రం  'బ్యాడ్ గర్ల్' టీజర్ రిలీజై వివాదంలో ఇరుక్కుంది. ఈ టీజర్ చూసిన వాళ్లు షాక్ అవుతున్నారు.  ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఈ డైరక్టర్ తో తమ హీరో సినిమా చేయద్దని రిక్వెస్ట్ లు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.  

ఈ టీజర్ లో పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి. ఈ సినిమాకు వెట్రి మారన్ నిర్మాత అయితే, హిందీ దర్శకుడు అనురాగ్ కశ్యప్ సమర్పకులు.  ఈ చిత్రానికి వర్ష భారత్ దర్శకత్వం వహించారు. అంజలి శివరామన్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాతో సీనియర్ నటి శాంతి ప్రియ రీ ఎంట్రీ ఇస్తున్నారు.

23
bad girl

bad girl


 'బ్యాడ్ గర్ల్'   టీజర్ లో ఏముది

 'బ్యాడ్ గర్ల్'  టీజర్ లో సంప్రదాయాలు పాటించే బ్రాహ్మణ మధ్యతరగతి తమిళ అమ్మాయి, తనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండాలని భావిస్తుంది. క్లాసులో తనకు నచ్చిన  అబ్బాయి తో ఒక రోజు ఎవరూ లేని క్లాస్ రూమ్ లో రొమాన్స్ చేస్తుండగా టీచర్ కంట పడుతుంది. మార్కులు తక్కువ వచ్చినప్పుడు ఏమీ అనని తండ్రి ఆ విషయం తెలిసి కొడతాడు.

ఆ తర్వాత తనకు స్వేచ్ఛ కావాలని ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. సిగరెట్ కలుస్తుంది. మందు తాగుతుంది. పార్టీలకు, పబ్బులకు వెళుతుంది. నచ్చిన యువకుడితో రొమాన్స్ చేస్తుంది. తనకు నచ్చినట్టు ఉంటుంది. ఇలాంటి విషయాలతో టీజర్ సాగుతుంది. 

33
bad girl

bad girl


ఈ సినిమాలో ఒక  హిందువల అమ్మాయిని చాలా బోల్డ్ గా చూపించడం హిందువులు, బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బ తీశాయి. దీనితో సోషల్ మీడియాలో వెట్రిమారన్ ని ఆడిపోసుకుంటున్నారు.  కేవలం  వెట్రి మారన్ నే కాకుండా ఈ టీజర్ షేర్ చేసిన  హీరో విజయ్ సేతుపతి, పా రంజిత్ లని కూడా ఘోరంగా తిడుతున్నారు. విజయ్ సేతుపతి కామెంట్స్ సెక్షన్ క్లోజ్ చేసేసారు.

 దీనితో పాటుగా వెట్రిమారన్ పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దర్శకునితో మాకు సినిమా వద్దని తారక్ కూడా సినిమా చెయ్యడానికి లేదు అని పోస్ట్ లు పెడుతున్నారు. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఎన్టీఆర్, వెట్రిమారన్ కాంబినేషన్ లో సినిమా ప్రకటన అయితే రాలేదు. వెట్రిమారన్ అంటే ఇష్టమని, ఆయన తో సినిమా చెయ్యాలని ఉందని ఎన్టీఆర్ గతంలో అన్నారు.  ఏదైమైనా ఇది ఈ చిన్న సినిమాకు పెద్ద పబ్లిసిటీ జరుగుతోందననేది నిజం. 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved