- Home
- Entertainment
- Entertainment News
- ఓరకంటి చూపుతో హార్ట్ బీట్ పెంచుతున్న అనుపమా పరమేశ్వరన్.. ట్రెడిషనల్ వేర్ లో మైమరిపిస్తున్న కేరళ కుట్టి..
ఓరకంటి చూపుతో హార్ట్ బీట్ పెంచుతున్న అనుపమా పరమేశ్వరన్.. ట్రెడిషనల్ వేర్ లో మైమరిపిస్తున్న కేరళ కుట్టి..
కేరళ కుట్టి అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) అందాల ధాటికి యువత చిత్తైపోతోంది. మత్తెక్కించే చూపులతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోందీ అమ్మడు. తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

టాలీవుడ్ హీరోయిన్ గా తన సత్తా చూపిస్తోంది యంగ్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్. సినిమాల్లో విభిన్న పాత్రలతో ఎంతలా ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలోనూ లేటెస్ట్ ఫొటోషూట్లతో మతిపోగొడుతోందీ బ్యూటీ.
అనుపమా పరమేశ్వరన్ కు గ్లామర్ పరంగా, నటన పరంగా ఆడియెన్స్ నుంచి మంచి మార్కులే పడ్డాయి. వరుస సినిమాల్లో నటిస్తున్న ఈ బ్యూటీకి తొలిమూడు చిత్రాలు మంచి విజయాన్ని సాధించి పెట్టిన విషయం తెలిసిందే. దాంతో హ్యాట్రిక్ హిట్ ఖాతాలో వేసుకుంది.
ఈ క్రేజ్ తోనే ఇప్పటికీ సినిమా ఆఫర్లను దక్కించుకుంటోంది. చివరిగా ‘రౌడీ బాయ్స్’ చిత్రంలో నటించి ఆడియెన్స్ ను అలరించింది. ఈ చిత్రంలో తొలిసారిగా లిప్ లాక్ చేసి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంకా ఈ సుందరి ఇచ్చిన షాక్ నుంచి తేరుకోలేకపోతున్నారు.
ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తున్న అనుపమా ఇటు సోషల్ మీడియాలోనూ తన పాపులారిటీని పెంచేస్తోంది. లేటెస్ట్ ఫొటోషూట్లతో క్యూట్ గా కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతోంది. ఈ మేరకు తాజాగా మరిన్ని గ్లామర్ పిక్స్ ను తన అభిమానులతో పంచుకకుందీ బ్యూటీ.
ఈ పిక్స్ లో ట్రెడిషనల్ వేర్ లో చాలా అందంగా కనిపిస్తోంది. హెవీ డిజైన్డ్ చుడీదార్ లో మతిపోగొడుతోంది. మొహాన్ని దాచేస్తున్న నల్లని కురులు, గుచ్చే చూపులతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. క్యూట్ లుక్స్ తో ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట దుమారం రేపుతోంది.
ఇదిలా ఉంటే.. గతకొంత కాలంగా అనుపమా పరమేశ్వరన్ కు మంచి హిట్ పడలేదు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో వచ్చిన సక్సెస్ తోనే ఇప్పటికీ పలు చిత్రాల్లో నటిస్తోంది. మున్ముందు మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకునేందుకు ఎదురుచూస్తోంది. ప్రస్తుతం 18 పేజెస్, కార్తీకేయ 2, బటర్ ఫ్లై చిత్రాల్లో నటిస్తోంది.