MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Entertainment News
  • వివాదంలో యాంకర్ సుమ, ఆమె చూసే డబ్బు కట్టి లక్షల్లో మోసపోయాం

వివాదంలో యాంకర్ సుమ, ఆమె చూసే డబ్బు కట్టి లక్షల్లో మోసపోయాం

సుమ ప్రచారం చేయడం వల్లే మేము కొనుగోలు చేశాం. ఆమె మాకు ఏదైనా న్యాయం చేస్తారని కోరుకొంటున్నాం. 

2 Min read
Author : Surya Prakash
| Updated : Aug 07 2024, 10:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తెలుగు టాప్ యాంకర్ లలో ఒకరు సుమ.  లెక్కలేనన్ని  టీవీ షోలు, టాక్ షోలు, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తోంది సుమ.. సినిమా ఈవెంట్ అంటే ఇప్పటికి మొదట గుర్తు వచ్చే పేరు సుమ.  తన యాంకరింగ్ తో స్టేజి మీద తడుముకోకుండా మాట్లాడే సత్తా ఆమె సొంతం.ఎలాంటి షో అయినా.. ఎలాంటి ఈవెంట్ అయినా.. సుమ తన మాటలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. ఎంత పెద్ద ఈవెంట్ అయినా సుమ అవలీలగా హ్యాండిల్ చేయగలదు. వివాదాలకు దూరంగా ఉండే ఆమె ఇప్పుడు ఓ రియల్ ఎస్టేట్ వివాదంలో అనుకోకుండా ఇరుక్కున్నట్లు అయ్యింది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

వివాద వివరాల్లోకి వళితే...రాజమండ్రిలో రాకీ అవెన్యూస్‌ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మోసాలు బయటపడ్డాయి.మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇంటి కల నెరవేస్తామని 88 కోట్లు కట్టించుకొని బాధితులకు ఆ సంస్థ కుచ్చుటోపీ పెట్టింది.అపార్టుమెంట్లు నిర్మాణం చేసి ఫ్లాట్ లు ఇస్తామని నమ్మించి మోసం చేసింది. 
 

36
Anchor Suma Kanakala

Anchor Suma Kanakala

రాకీ అవెన్యూస్‌ బోర్డు తిప్పేయడంతో వందలాది మధ్యతరగతి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దీంతో తమకు న్యాయం చేయాలనీ బాధితులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తాజాగా .. ఈ విషయం బయటపడటంతో ఆ సంస్థ చైర్మన్ రామయ్య వేణు పరారీలో ఉన్నారు.

46
Anchor Suma Kanakala

Anchor Suma Kanakala

ఈ క్రమంలో బాధితులు కొందరు  ఓ మీడియాతో మాట్లాడూతూ... 'రాకీ అవెన్యూస్ కట్టిన ఫేజ్ వన్ బిల్డింగ్స్ చూశానని, ఫేజ్ 2 కూడా త్వరలో కడుతామని సుమతో ప్రచారం చేయించడం వల్లే ఈ సంస్థలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చానని తెలిపారు. తాను త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లు నాలుగు తీసుకొని ఒక్కొక్క ఫ్లాట్ కు 25 లక్షల ధర చెల్లించి మొత్తంగా కోటి రూపాయల వరకు వెచ్చించి రిజిస్ట్రేషన్ చేయించానని' తెలిపారు.

56

 కాగా.. ఫేజ్ వన్ ఫ్లాట్లన్నీ అమ్ముడుపోయాయి. కేవలం 18 లక్షలకే సెకండ్ ఫేజ్ లో ఫ్లాట్. త్వరపడండి ఉగాది సందర్భంగా కంపెనీయే రిజిస్ట్రేషన్ ఫీజు భరిస్తుంది. పైగా జీఎస్టీ కూడా కట్టనవసరం లేదని ప్రముఖ టీవీ యాంకర్ సుమ రాకీ అవెన్యూస్ కు ప్రచారం చేస్తూ చెప్పిన మాటలివి.దీంతో సుమపై చాలా మంది విమర్శలు చేస్తున్నారు.  ఈ యాడ్స్ లో సుమతో పాటు ఆమె భర్త రాజీవ్ కనకాల కూడా నటించారు.   యాంకర్ సుమ స్పందించాలని బాధితులు కోరుకొన్నారు. 

 

66
suma

suma

 బాధితులు మీడియాతో మాట్లాడుతూ.. యాంకర్ సుమ ప్రచారం చేయడం వల్ల ఆకర్షితులమయ్యాం. పెద్ద కంపెనీ కావడంతో తక్కువ ధరకు ఇస్తానని అనడంతో మేము ఫ్లాట్స్‌ను కొనుగోలు చేశాం. అయితే సుమను తప్పు పట్టడం లేదు. కానీ ఆమె ప్రచారం చేయడం వల్లే మేము కొనుగోలు చేశాం. ఆమె మాకు ఏదైనా న్యాయం చేస్తారని కోరుకొంటున్నాం. మేము 26 లక్షలు క్యాష్ ఇచ్చి రిజిస్టర్ చేసుకొన్నాం. పిల్లల భవిష్యత్ కోసం పెట్టుబడి పెట్టాం అని బాధపడ్డారు.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved