పూరి ‘ఫైటర్’లో కొత్త హీరోయిన్, ఆమె అందాల ఫొటోలు ఇవిగో

First Published 19, Jan 2020, 3:20 PM

హీరోయిన్స్ ని పరిచయం చేయటంలో పూరి జగన్నాథ్ ది అందెవేసిన చెయ్యి. ఆయన ఇంట్రడ్యూస్ చేసిన చాలా మంది హీరోయిన్స్ తెలుగులో నిలదొక్కుకున్నారు. ఓ టైమ్ లో ఆయన సినిమాలే చేస్తే చాలని చాలా మంది ఆయన చుట్టూ ప్రదిక్షణాలు చేసేవారంటే అతి శయోక్తి కాదు. రీసెంట్ గా ఇస్మార్ట్ శంకర్ తో ఫామ్ లోకి వచ్చిన ఆయన తాజా చిత్రంలోనూ ఓ హీరోయిన్ ని తెలుగుకు పరిచయం చేస్తున్నారు. విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో ‘ఫైటర్’ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా కోసం గత కొద్ది రోజులుగా హీరోయిన్ల సెర్చింగ్ జరుపుతోంది చిత్ర యూనిట్. రేపటి(జనవరి 20) నుంచి షూటింగ్ ముంబైలో కానున్న ఈ చిత్రం కోసం ఓ హీరోయిన్ ని ఎట్టకేలకు ఫైనల్ చేసినట్లు సమాచారం. ఆమె పేరు అనన్యా  పాండే.

అనన్య మరెవరో కాదు...బాలీవుడ్ సీనియర్ కామిక్ యాక్టర్ చుంకీ పాండే ముద్దుల కూమార్తె. 2019లో రిలీజైన పునిత్ మల్హోత్రా సినిమా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 ద్వారా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిందీ ఈ బ్యూటీ.ఆ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది.

ఈమెకు ఉన్న మరో ప్లస్ ఏమిటి అంటే..సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తొలి సినిమా చెప్పుకోదగ్గ బ్రేక్ ఇవ్వకపోయినా... తరచూ బాలీవుడ్ సెలబ్రిటీలతో టచ్‌లో ఉంటూ... ఫొటోలకు పోజులివ్వటం ఆమె స్పెషాలిటీ.

అంతేకాదు బాలీవుడ్ బాద్షా... షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్... అనన్యా ఫ్రెండే. వీరిద్దరు కలిసి తెగ తిరుగుతూంటారు. పార్టీలు, పబ్ లు అంటూ వీరు చెయ్యని రచ్చ లేదు. కుర్రకారుకు అనన్యా హాట్ డ్రీమ్ గర్ల్.

ముంబైలో పుట్టి పెరిగిన అనన్యా... కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది. అక్కడ మోడలింగ్ పద్దతులు వంటపట్టించుకున్న ఆమె బాలీవుడ్ లో తనేంటో ప్రూవ్ చేసుకోవాలని తహ తహలాడుతోంది.

మరో ప్రక్క అనన్యా పాండేకి బాలీవుడ్ సినిమాలంటే తనకు విపరీతమైన ఇష్టం  చెప్తోంది. రెగ్యులర్ గా రోజూ సినిమాలు చూసే తాను , తన సినిమాలు తెరపై చూసుకోవాలనే ఉత్సాహంలో ఉన్నట్లు చెప్తోంది. సౌత్ సినిమాలు కూడా అఫ్పుడప్పుడూ చూస్తుందిట.

ఇక ను పెంచుకునే కుక్కకు ఫడ్జ్ అనే పేరు పెట్టిన ఈ బ్యూటీకి జంతు సంరక్షణ అన్నా మహా ఇష్టంట. తన ఇంటి నిండా కుక్కలు, పిల్లలతో నింపేయాలనేది తన కోరిక అని చెప్తోంది. రకరకాల జాతుల కుక్కలను తను ఎంపిక చేసుకుని పెంచుకుంటానని గర్వంగా చెప్తోంది.

అలాగే అనన్యాకు ట్రావెలింగ్ అంటే కూడా మహా ఇష్టమే. దేశ,విదేశాలు టూర్లు వేయటం తనకు చిన్నప్పటి నుంచి వచ్చిన హాబీ అని, తిరుగుతూంటే తనకు అసలు బోర్ కొట్టదని, కొత్త కొత్త ప్రదేశాల్లో విహరించటంలో ఉన్న ఆనందం దేనికి రాదంటోంది.

తన తండ్రి నటుడు అవ్వటం,సినిమా బ్యాక్‌గ్రౌండ్ నుంచీ వచ్చినందువల్ల... సినిమాల్లోనే తన కెరీర్ డెవలప్ చేసుకుంటానని చెబుతోంది. ఆ దిశగా గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తోంది. వచ్చిన ప్రతీ ఆఫర్ ని ఒప్పుకుని బిజీ అయ్యిపోవాలని లేదని, తనకు పేరు తెచ్చే పాత్రలకే ప్రిఫరెన్స్ అని చెప్తోంది.

ఇక ఈ చిత్రంలో పూరి జగన్నాథ్ మొదట శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ ని , కైరా అదానీని తీసుకోవాలనుకున్నారు. అయితే ఇధ్దరూ కాల్షీట్స్ ప్లాబ్లం తో ఓకే చెప్పలేదు. ఈ క్రమంలో ఈ సినిమా కో ప్రొడ్యూసర్ అయిన కరణ్ జోహార్ ... అనన్యా పేరుని సజెస్ట్ చేసారు.

ఇక ఈ ఫైటర్ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ 15 రోజులు పాటు సాగనుంది. సెకండ్ షెడ్యూల్ నుంచి అనన్య షూటింగ్ లో పాల్గొంటుంది. ఈ సినిమాలో రమ్యకృష్ణ...విజయ్ దేవరకొండ తల్లిగా కనిపించనుంది. ఇదో భాక్సింగ్ డ్రామా. కరణ్ జోహార్, పూరి జగన్నాథ్, ఛార్మీ కలిసి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు.