- Home
- Entertainment
- Entertainment News
- Amma Rajasekhar: ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పృహ తప్పి పడిపోయిన అమ్మ రాజశేఖర్, ఏమైంది?
Amma Rajasekhar: ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పృహ తప్పి పడిపోయిన అమ్మ రాజశేఖర్, ఏమైంది?
Amma Rajasekhar: అమ్మ రాజశేఖర్ తవ తాజా చిత్రం ‘తల’ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. అక్కడ స్టేజిపై స్రృహ తప్పి పడిపోయారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Amma Rajasekhar Falls Unconscious at Thala Pre-Release Event in telugu
డాన్స్ కొరియోగ్రాఫర్ నుంచి డైరక్టర్ గా మారి సినిమాలు చేస్తున్నారు అమ్మ రాజశేఖర్. ఆయన తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘తల’(thala Movie). ఈ చిత్రంలో ఆయన తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా నటించాడు.
అంకిత నాన్సర్ హీరోన్. రోహిత్, ఎస్తేర్ నోరోన్హా, సత్యం రాజేష్, ముక్కు అవినాశ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అక్కడే అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో అనుకోనిది జరిగింది.
Amma Rajasekhar Falls Unconscious at Thala Pre-Release Event in telugu
అమ్మ రాజశేఖర్ తవ తాజా చిత్రం ‘తల’ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. అక్కడ స్టేజిపై స్రృహ తప్పి పడిపోయారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లొ ఉన్నట్లుండి ఒక్కసారిగా పడిపోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.
అయితే సడెన్ గా కింద పడిపోవడంతో డెరెక్టర్ అమ్మ రాజశేఖర్ ఏమయ్యిందని స్టేజిపై ఉన్నవారిలో ఆందోళన మొదలయ్యింది. కాసేపటికి ఆయన తిరిగి స్పృహలోకి వచ్చి, కాసేపు క్రింద అలాగే కూర్చుండిపోయారు. మంచి నీళ్లు తాగి కొద్ది సేపు రెస్ట్ తీసుకుని రిలీఫ్ అయ్యారు.
Amma Rajasekhar Falls Unconscious at Thala Pre-Release Event in telugu
అమ్మ రాజశేఖర్ ఇలా పడిపోవటానికి గల కారణం..లో బ్లడ్ ప్రెషర్ అంటున్నారు. అయితే అసలు కారణం ఏమిటనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సంఘటన చాలా మందిని షాక్ కు గురిచేసింది.
ఆయన టీమ్ వెంటనే రెస్పాండ్ అయ్యి, ఆయనకు సాయం చేసారు.ఈ మేరకు వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రీసెంట్ గా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి చేతుల మీదుగా విడుదలైన ఈ మూవీ తమిళ్, తెలుగు ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది.
Amma Rajasekhar Falls Unconscious at Thala Pre-Release Event in telugu
అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ..నా కొడుకుతో సినిమా చేయాలనేది చిన్నప్పటి నుంచి నా కోరిక. ఓ సందర్భంలో స్టేజ్‌పై మా అబ్బాయిని హీరోగా పెట్టి సినిమా చేస్తానని చెప్పాను. అప్పటి నుంచి నిద్ర లేదు. అబ్బాయికి సంబంధించిన కథ కావాలి.
మంచి కథ కావాలి. నాకంత ఓపిక లేదు. రియల్ లైఫ్ లో లవ్ ప్రపోజ్ చేసి నెక్స్ట్ డే పెళ్లి చేసుకున్న కథ కాకుండా ఏం చేయాలని ఆలోచించి మాస్ తీయాలనుకున్నా, అబ్బాయితో ఎలా చేయాలని రెండేళ్లు ఆలోచించి ఒక పాయింట్, దానికి ఒక కొత్త పాయింట్ తీసుకున్నా, కొత్తదనం కావాలనుకునే వాడు సినిమా ఆనందంగా చూడవచ్చు’ అన్నారు.