- Home
- Entertainment
- Entertainment News
- RC16 : రామ్ చరణ్ - గౌతమ్ తిన్ననూరి కాంబోపై మళ్లీ అదే రూమర్.. ఇంతకీ ఉన్నట్టా? లేనట్టా?
RC16 : రామ్ చరణ్ - గౌతమ్ తిన్ననూరి కాంబోపై మళ్లీ అదే రూమర్.. ఇంతకీ ఉన్నట్టా? లేనట్టా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) చివరిగా ‘ఆర్ఆర్ఆర్’తో భారీ హిట్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాబోయే చిత్రాలపై ఇంట్రెస్టింగ్ రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి.

‘ఆర్ఆర్ఆర్’తో రామ్ చరణ్ క్రేజ్ అంతా ఇంతా కాదు తారా స్థాయికి చేరుకుంది. దీంతో అభిమానులు చెర్రీ అప్ కమింగ్ ఫిల్మ్స్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇటు సౌత్ తోపాటు, అటు నార్త్ లోనూ చరణ్ కు గట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో RC15, RC16 చిత్రాలను పాన్ ఇండియా లెవల్లోనే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ఈ క్రమంలో రామ్ చరణ్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వంలో ఆర్సీ15 (RC15)లో నటిస్తున్నారు. దీని తర్వాత గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో నటించనున్నారు. ప్రస్తతం ‘ఆర్సీ15’ కూడా తాత్కాలికంగా షూటింగ్ ఆగడం, ‘ఆర్సీ16’పై ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో నెట్టింట చెర్రీ ప్రాజెక్ట్స్ పై రూమర్లు స్ప్రెడ్ అవుతున్నాయి.
గతంలోనే రామ్ చరణ్ - గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) కాంబో సెట్ అయిన విషయం తెలిసిందే. అయితే ‘ఆర్సీ15’ ఆలస్యమవుతుండటం.. మరోవైపు చెర్రీకి భారీ ఆఫర్లు వస్తుండటంతో ‘ఆర్సీ16’(RC16) ఆగిపోయిందంటూ ప్రచారం జరుగుతోంది. గతంలోనే చరణ్ ఈ చిత్రాన్ని హోల్డ్ లో పెట్టారని రూమర్లు స్ప్రెడ్ కావడంతో మెగా హీరో అప్పుడే క్లారిటీ ఇచ్చారు. దీంతో మళ్లీ అదే రూమర్ స్ప్రెడ్ అవుతుండటం గమనార్హం. మరోవైపు వేణు శ్రీరామ్, నర్తన్ దర్శకుల పేర్లు ‘ఆర్సీ16’ సినిమా కోసం వినిపిస్తున్నాయి.
దీంతో చరణ్ అభిమానులు విసుగెత్తిపోతున్నారు. గౌతమ్ దర్శకత్వంలోనే తమ అభిమాన హీరో నటించాలని కోరుకుంటున్న వారు సినిమా ఉందంటూ చెబుతున్నారు. మరోవైపు సినీ వర్గాల నుంచి కూడా ‘ఆర్సీ16’ త్వరలోనే పట్టాలెక్కబోతుందని సమాచారం. ఇక గౌతమ్ కూడా ఎలాంటి చిత్రాలను అనౌన్స్ చేయకపోవడంతోనూ త్వరలోనే ‘ఆర్సీ16’ ప్రారంభం కానుందని తెలుస్తోంది.
‘జెర్సీ’ చిత్రంతో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. లవ్, ఎమోషన్స్ ను తనదైన శైలిలో తెరకెక్కించి ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యారు. దీంతో రామ్ చరణ్ - గౌతమ్ కాంబోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో ‘ఆరెంజ్’తో చెర్రీ లవర్ బాయ్ గా అలరించిన విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్ లోనూ అవుట్ అండ్ అవుట్ లవ్ అండ్ రొమాంటిక్ ఫిల్మ్ నే అభిమానులు కావాలని కోరుతున్నారు. గౌతమ్ కూడా చరణ్ తో వర్క్ చేయాలన్నదని తన డ్రీమ్ గా భావించడంతో చరణ్ ను సరికొత్తగా తెరపై చూపించబోతున్నారు.
ఇదిలా ఉంటే.. రామ్ చరణ్ - శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ఆర్సీ15’పైనా భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం శంకర్ ‘ఇండియన్ 2’పై ఫోకస్ పెట్టడంతో తాత్కాలికంగా చరణ్ సినిమాను ఆపినట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల తర్వాత ఈ రెండు చిత్రాలను పార్లల్ గా చిత్రీకరించనున్నారని సమాచారం. ‘ఆర్సీ 15’ పూర్తి కాగానే చరణ్ గౌతమ్ డైరెక్షన్ లో నటించనున్నారని తెలుస్తోంది.