Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • Entertainment News
  • నా ఆరోగ్య పరిస్థితి బాలేదు.. క్రిటికల్ గా ఉందంటూ.. గాయత్రి గుప్త వాఖ్యలు వైరల్..

నా ఆరోగ్య పరిస్థితి బాలేదు.. క్రిటికల్ గా ఉందంటూ.. గాయత్రి గుప్త వాఖ్యలు వైరల్..

బుల్లితెర, వెండితెర ప్రేక్షకులుకు పరిచయం అవసరం లేని పేరు గాయత్రి గుప్తం. డిఫరెంట్ క్యారెక్టర్లు.. చేస్తూ.. డిఫరెంట్ గా కనిపించే ఈ బ్యూటీ.. తన ఆరోగయంపై గతంలో కొన్ని వ్యాఖ్యలు చేసింది.. తాజాగా తన పరిస్థితి బాలేందంటోంది.

Mahesh Jujjuri | Published : Sep 10 2023, 04:55 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Asianet Image

గాయత్రి గుప్త. పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెర తో పాటు .. వెండితెరపై ఫేమస్ అయ్యింది బ్యూటీ.  షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసి.. యాంకర్ గా మారి.. నటిగా మారి టాలీవుడ్ లో రాణించింది గాయత్రి గుప్త. ఇక సిల్వర్ స్క్రీన్ పై గ్లామర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి అలరించింది బ్యూటీ. 

28
Asianet Image

గాయత్రి గుప్తం టాలీవుడ్ నుంచి వరుసగా ఫిదా, కొబ్బరి మట్ట, ఐస్ క్రీం లాంటి  సినిమాల్లో నటించి మెప్పించింది. అంతేకాదు రవితేజ  హీరోగా నటించిన  అమర్ అక్బర్ ఆంటోనీ, బుర్రకథ, ఐస్‌క్రీమ్-2, దుబాయ్ రిటర్న్, జంధ్యాల రాసిన ప్రేమకథ, సీతా అన్‌ ది రోడ్, కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ లాంటి సినిమాల్లో సందడి చేసింది గాయత్రి గుప్తా. 
 

38
Gayathri Gupta

Gayathri Gupta

 హీరోయిన్‌గా చేయకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రం ఆమె అందరికి సుపరిచితమే. ఇక ఆమె అప్పుడప్పుడు తన కామెంట్స్ తో.. వైరల్ న్యూస్ అవుతూ ఉంటుంది. తాజాగా మరోసారి గాయత్రి గుప్త హైలెంట్ అయ్యింది. గతంలో తన ఆరోగ్యం బాగోట్లేదు అని ప్రకటించిన ఆమె.. తాజాగా తన పరిస్థితి క్రిటికల్ గా తాయారయ్యిందని తెలుపుతోంది. ఇంతకీ ఆమె ఏమంటుందంటేు..? 

48
Gayathri Gupta

Gayathri Gupta

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గాయత్రి గుప్త, పలు షాకింగ్ విషయాలను వెల్లడించింది. తన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పింది. “గత కొంత కాలంగా నేను ఆటో ఇమ్యూనిటీ సమస్యతో బాధపడుతున్నాను. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. రేపు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. గత ఏడాదిన్నర కాలంగా చికిత్స తీసుకుంటున్నాను. నెలకు ఒకటి రెండు ఇంజెక్షన్స్ తీసుకుంటాను. అని వెల్లడించింది గాయత్రి. 
 

58
Asianet Image

అంతే కాదు ఆ ఇంజక్షన్ తీసుకుంటేనే తాను యాక్టివ్ గా ఉంటానన్ని లేదంటే ఏ పని చేయలేను అంటున్నారు. అంతే కాదు ఇంజక్షన్  చేయక పోతే.. తాను మంచానికే పరిమితం అవుతాను అంటుంది. ఇక తాజాగా  నెలన్నర నుంచి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. మెడికేషన్ డోస్ కూడా పెరిగిపోయింది. ఆయుర్వేద ఆశ్రమంలో పంచరకర్మ ఆయుర్వేద చికిత్స తీసుకున్నాను. అని అన్నారు. 

68
Asianet Image

ఇక ఆ ఆయుర్వేదం వల్ల కాస్త కోలుకున్నాను అంటున్నారు గాయత్రి. 15 ఏళ్ళుగా లేని రిలీజ్.. ఇప్పుడు ఆయుర్వేదం వల్లవచ్చిందన్నారు. ఇర తన ట్రీట్మెంట్ కు ప్రస్తుతం తన దగ్గర డబ్బలేదని.. చికిత్స కోసం విరాళాలు సేకరించాలని భావిస్తున్నట్లు గాయత్రి గుప్త తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. నా ఆరోగ్యం కోసం విరాళాలు సేకరించాలనుకుంటున్నా. 6 నెలల చికిత్స కోసం 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలుస్తోంది. అంత డబ్బు నా దగ్గర లేదు. అందుకే, చికిత్స కోసం ఫండింగ్ చేపట్టాలి అనుకుంటున్నాను అని అన్నారు. 
 

78
Asianet Image

అంతే కాదు ఈసందర్భంగా తన తండ్రి గురించి కూడా షాకింగ్ కామెంట్స్ చేసింది గాయత్రి. ఆయన్ను తాను ఎప్పుడూ తండ్రిలా చూడలేదని.. తమను ఎప్పుడూ పట్టించుకోకుండా.. తన స్వార్ధం చూసుకునేవాడు తండ్రి ఎలా అవుతాడు అంటూ వ్యాఖ్యానించింది గాయత్రి గుప్త. తన దృష్టిలో తండ్రి అనేవాడు లేదు అంటు ఘాటు వ్యాఖ్యలు చేసింది. 
 

88
Asianet Image

తాజాగా జేడీ చక్రవర్తి నటించిన దయా వెబ్ సిరీస్ లో కనిపించింది బ్యూటీ. ఈషా రెబ్బా, రమ్య, విష్ణుప్రియ ప్రధాన పాత్రల్లో ఈ సిరీస్ రూపొందింది. ఈ సిరీస్ ఓటీటీ ఫ్లాట్‌పామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఆగస్టు 4 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఇప్పుడు హైదరాబాద్ నైట్స్ సినిమాలో కూడా తాను నటిస్తున్నట్ట వెల్లడించిన గాయత్రీ.. ఈ సినిమాలో తాను చాలా అందంగా కనిపిస్తాను అంటుంది. గాయత్రి గుప్తం చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
 
Recommended Stories
Top Stories