రాజమౌళి ఛాన్స్ ఇస్తే చేయనని చెప్పా.. బిగ్ బాస్ బ్యూటీ కామెంట్స్!
హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తోన్న సమయంలో తనకు రాజమౌళి సినిమాలో ఆఫర్ వచ్చిందని చెప్పిన అర్చన.. సినిమా మాత్రం చేయలేకపోయానని తెలిపింది.
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సినిమాలో నటించాలని చాలా మంది తారలు అనుకుంటారు. కానీ ఆ అవకాశం కొందరికే వస్తుంది. అలాంటిది ఆయనే స్వయంగా సినిమా నటిస్తావా..? అని ఓ ఆర్టిస్ట్ ని అడిగితే ఆమె కుదరదని చెప్పిందట. ఇంతకీ ఆ నటి ఎవరో తెలుసా.. బిగ్ బాస్ ఫేమ్ అర్చన.
హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తోన్న సమయంలో తనకు రాజమౌళి సినిమాలో ఆఫర్ వచ్చిందని చెప్పిన అర్చన.. సినిమా మాత్రం చేయలేకపోయానని తెలిపింది. హీరోయిన్ గా తను సినిమాలు చేస్తున్నప్పుడు 'మగధీర' సినిమాలో సలోని పాత్ర కోసం రాజమౌళి తనను సంప్రదించారట.
ఆ సమయంలో తన జర్నీ బాగా సాగుతోందని.. నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమా హిట్ కావడంతో తనకు మంచి గుర్తింపు వచ్చిందని.. సక్సెస్ మీట్ లో తన గురించి కూడా మాట్లాడారని చెప్పింది అర్చన. దీంతో హీరోయిన్ గా రాణించాలని అనుకుంటున్నప్పుడు దర్శకుడు రాజమౌళి 'మర్యాదరామన్న' సినిమాలో సలోని పాత్ర కోసం అడిగారని చెప్పింది.
ఆ సమయంలో చాలా ఆలోచించి ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు చెప్పింది అర్చన. తన కెరీర్ మీద ఉన్న భయం వలనో ఏమో కానీ ఆ పాత్రని వదిలేశానని చెప్పింది. కానీ ఇప్పుడు తలచుకుంటే చాలా బాధగా ఉంటుందని.. రాజమౌళి దర్శకత్వంలో సినిమా అంటే ఆలోచించకుండా ఓకే చేయాల్సింది అంటూ తెలిపింది.
ఆ తరువాత తను లీడ్ గా నటించిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయని.. సైడ్ రోల్స్ చేస్తే హిట్ అయ్యాయని చెప్పింది. రాజమౌళి గారు అడిగినప్పుడు చేయకపోవడం తన తప్పేనని.. అయితే అలా రిజెక్ట్ చేయడం వలన ఈ అమ్మాయికి పొగరేమో అనుకుంటారేమోనని కానీ తన ఉద్దేశం అది కాదని చెప్పింది.
రాజమౌళి గారితో 'యమదొంగ' సినిమా కోసం పని చేసినట్లు.. ఒక పాటలో నటించినట్లు చెప్పింది. ఆయన్ని కలిసి చాలాసార్లు క్షమించమని అడగాలనుకున్నట్లు చెప్పింది. 'మగధీర' సినిమాలో సలోని పాత్ర గనుక చేసి ఉంటే.. 'మర్యాదరామన్న' సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చేదేమోనని అంది.
హీరోయిన్ గా తనకు చాలా పెద్ద సినిమాలో ఛాన్స్ వచ్చిందని.. చాలా మంచి డైరెక్టర్ అని. అలాంటి సినిమాలో నటించాలని చాలా మంది అనుకుంటారని.. కానీ అప్పుడు తను ఉన్న పరిస్థితుల్లో రిజెక్ట్ చేసినట్లు చెప్పింది. తన స్థానంలో మరో హీరోయిన్ ని తీసుకున్నారని.. సినిమా పెద్ద హిట్ అయిందని తెలిపింది. ఆ సినిమా ఏంటి..? డైరెక్టర్ ఎవరనే విషయాలను మాత్రం చెప్పలేదు.