ఆసియా కప్ 2023 టోర్నీకి లైన్ క్లియర్... షెడ్యూల్ వచ్చేది ఎప్పుడంటే...
దాదాపు ఏడాదిగా ఆసియా కప్ 2023 టోర్నీపై డైలామా కొనసాగుతోంది. షెడ్యూల్ ప్రకారం ఆసియా కప్ 2023 టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే పాక్‌లో జరిగితే టీమిండియా, అక్కడికి వెళ్లదని, తటస్థ వేదికపై ఆసియా కప్ 2023 టోర్నీ నిర్వహిస్తామని 2022 ఆసియా కప్ ఆరంభానికి కొన్ని రోజుల ముందు కామెంట్ చేశాడు బీసీసీఐ సెక్రటరీ జై షా.

Jay Shah-
అప్పటి నుంచి ఇప్పటిదాకా పాక్ క్రికెట్ బోర్డుకు ముగ్గురు ప్రెసిడెంట్స్ మారారు. రమీజ్ రాజా, పీసీబీ ఛైర్మెన్‌గా ఉన్న సమయంలో ఆసియా కప్ 2023 టోర్నీ కోసం ఇండియా, పాకిస్తాన్‌కి రాకపోతే... పాక్ జట్టు కూడా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆడదని కామెంట్లు చేశాడు. ఓ రకంగా రమీజ్ రాజా, పీసీబీ ఛైర్మెన్ పొజిషన్ కోల్పోవడానికి ఈ కామెంట్లే కారణం.
ఆ తర్వాత అతని ప్లేస్‌లో వచ్చిన నజం సేథీ కూడా ఇదే రకమైన కామెంట్లు చేశాడు. అతని తర్వాత ఆ పొజిషన్‌లోకి వచ్చిన జకా అష్రఫ్ కూడా ఇదే మాట అన్నాడు. కొత్త ప్రెసిడెంట్ వచ్చిన ప్రతీసారీ ఆసియా కప్ 2023 టోర్నీపై రోజుకో కొత్త మాట చెప్పడంతో అసలు ఈ టోర్నీ జరుగుతుందా? లేదా? అనే అనుమానాలు రేగాయి..
ఈలోగా ఏషియా క్రికెట్ కౌన్సిల్, హైబ్రీడ్ మోడల్‌లో ఆసియా కప్ 2023 టోర్నీ నిర్వహిస్తామని అధికారిక ప్రకటన కూడా చేసింది. అయితే నజం సేథీ, పీసీబీ ప్రెసిడెంట్ పదవి నుంచి దిగగానే ఆ పొజిషన్‌లో కూర్చొన్న జకా అష్రఫ్.. ఇందుకు ఒప్పుకోమని అన్నాడు.
ఎట్టకేలకు ఆసియా కప్ 2023 టోర్నీపై స్పష్టమైన క్లారిటీ వచ్చింది. బీసీసీఐ సెక్రటరీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ జై షా, పీసీబీ కొత్త మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్మెన్ జకా అష్రఫ్‌తో సమావేశమై, ఆసియా కప్ 2023 టోర్నీ గురించి చర్చించారు..
ఆగస్టు 31 నుంచి ఆసియా కప్ 2023 టోర్నీ ప్రారంభం కాబోతుంతగా, సెప్టెంబర్ 17న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. 4 మ్యాచులు పాకిస్తాన్‌తో, 9 మ్యాచులు శ్రీలంకలో జరుగుతాయి. ఈ శుక్రవారం, జూలై 14న ఆసియా కప్ 2023 టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ని విడుదల చేయబోతున్నారు..