రోహిత్ శర్మకు బర్త్ డే విషెస్ తెలిపిన యజ్వేంద్ర చాహాల్... చాహాల్ ట్వీట్‌కి షాకైన రితికా, ధనశ్రీ వర్మ...
భారత స్టార్ బ్యాట్స్‌మెన్, ముంబై ఇండియన్స్ సారథి ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ 34వ పుట్టినరోజు నేడు. ముంబై సారథిగా ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన రోహిత్ శర్మ, వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలతో తిరుగులేని రికార్డులెన్నో తన పేరిట లిఖించుకున్నాడు. రోహిత్ శర్మకు విష్ చేస్తూ యజ్వేంద్ర చాహాల్ వేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయ్యింది.
టీమిండియాలో మహా తుంటరిగా పేరు దక్కించుకున్న యజ్వేంద్ర చాహాల్... ‘లవ్ ఆఫ్ మై లైఫ్... హ్యాపీ బర్త్ డే రోహితా... శ..ర... మా...’ అంటూ సాగతీస్తూ విష్ చేశాడు. రోహిత్ శర్మను తినేసేలా చూస్తున్న ఫోటోను కూడా ట్వీట్ చేశాడు యజ్వేంద్ర చాహాల్...
యజ్వేంద్ర చాహాల్ ఫన్నీగా వేసిన ఈ ట్వీట్‌పై అదేస్థాయిలో ట్రోలింగ్ వస్తోంది. ఈ ట్వీట్ చూసిన తర్వాత తన భర్తకు దూరంగా ఉండాలని, రితికా శర్మ, యజ్వేంద్ర చాహాల్‌కి చేతులు ఎత్తి దండం పెడుతుందని అంటున్నారు నెటిజన్లు.
మరోవైపు తన భర్తకు ఏమైందో తెలియక ధనశ్రీ వర్మ కన్నీళ్లు పెట్టుకుంటుందని కూడా కామెంట్లు వస్తున్నాయి.
ధనశ్రీ వర్మ... శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ వంటి క్రికెటర్లతో డ్యాన్సులు చేస్తుంటే, చాహాల్ ఏమో ఇలా రోహిత్ శర్మ వెంట పడుతున్నాడని ట్రోల్స్ కూడా చేస్తున్నారు కొంటె నెటిజన్లు.
ఇంగ్లాండ్ సిరీస్ సమయంలో రోహిత్ శర్మ, యజ్వేంద్ర చాహాల్‌కి పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేస్తున్నట్టు ఫోజు ఇచ్చాడు. ఆ పువ్వు తీసుకుని సిగ్గుతో ముడుచుకుపోయిన యజ్వేంద్ర చాహాల్... ‘సెనోరిటా’ అంటూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు..
విరాట్ కోహ్లీ జట్టులో కీలక స్పిన్నర్‌గా మారిన యజ్వేంద్ర చాహాల్, ముంబై ఇండియన్స్ సారథితో చనువు ఉండడం కూడా ఈ రోహిత్, విరాట్ యాంటీ ఫ్యాన్స్‌కి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.