పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్‌గా యువరాజ్ సింగ్! క్రేజీ ఆఫర్‌ని తిరస్కరించిన వరల్డ్ కప్ విన్నర్...
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, రిటైర్మెంట్ తర్వాత శుబ్‌మన్ గిల్ వంటి కుర్రాళ్లకు మెంటర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ టీమ్‌కి నాలుగు సీజన్లు ఆడిన యువీ, ఆ టీమ్‌కి హెడ్ కోచ్‌గా వ్యవహరించబోతున్నాడా?
Yuvraj Singh
టీమిండియా తరుపున 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టీ20 మ్యాచులు ఆడిన యువరాజ్ సింగ్, 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 2011 వన్డే వరల్డ్ కప్‌లో ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్‌తో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు గెలిచాడు..
2003 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఆడిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న యువరాజ్ సింగ్, 2014 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కూడా ఆడాడు. అయితే 2017 తర్వాత యువీకి టీమ్‌లో చోటు కరువైంది. జట్టులో చోటు కోసం రెండేళ్లు ఎదురుచూసిన యువీ, 2019లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు..
Yuvraj Singh
రిటైర్మెంట్ తర్వాత గ్లోబల్ టీ20 కెనడా, అబుదాబీ టీ20 వంటి ఫారిన్ లీగుల్లో ఆడిన యువరాజ్ సింగ్, ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌తో పాటు పూణే వారియర్స్ ఇండియా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్‌డెవిల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లకి ఆడాడు...
యువరాజ్ సింగ్‌ని హెడ్ కోచ్‌గా నియమించేందుకు పంజాబ్ కింగ్స్ యాజమాన్యం ప్రయత్నాలు జరుపుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్‌కి ట్రేవర్ బేలిస్ హెడ్ కోచ్‌గా ఉన్నాడు..
Image Credit: Getty Images
2021 సీజన్‌లో కెఎల్ రాహుల్, 2022 సీజన్‌లో మయాంక్ అగర్వాల్, 2023 సీజన్‌లో శిఖర్ ధావన్... పంజాబ్ కింగ్స్‌కి కెప్టెన్లుగా వ్యవహరించారు. కెప్టెన్లు మారినా పంజాబ్ కింగ్స్ రాత మారడం లేదు...
Image Credit: Getty Images
అయితే పంజాబ్ కింగ్స్ ఆఫర్‌ని యువరాజ్ సింగ్ తిరస్కరించాడట. ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితంలో ఉన్న కమిట్‌మెంట్స్ కారణంగా హెడ్ కోచ్ బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధంగా లేనని యువీ చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.
Image Credit: Getty Images
కొన్ని రోజుల క్రితమే ‘నేను మంచి కోచ్‌ని కాగలను. అయితే అందుకు మనం సిస్టమ్‌లో ఉండాలి. నాకు ఆ పొజిషన్ దక్కుతుందన్న నమ్మకం లేదు...’ అంటూ టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు ప్రకటించాడు యువరాజ్ సింగ్..