MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • వరల్డ్ కప్ గెలవాలంటే అన్నింటికంటే అది చాలా అవసరం! గంగూలీ అయినా, కోహ్లీ అయినా... - సునీల్ గవాస్కర్

వరల్డ్ కప్ గెలవాలంటే అన్నింటికంటే అది చాలా అవసరం! గంగూలీ అయినా, కోహ్లీ అయినా... - సునీల్ గవాస్కర్

2011 వన్డే వరల్డ్ కప్ విజయం తర్వాత 12 ఏళ్లకు స్వదేశంలో తిరిగి వన్డే ప్రపంచ కప్ ఆడనుంది టీమిండియా. ధోనీ తర్వాత 2019 వన్డే వరల్డ్ కప్‌కి విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈసారి రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు.. 

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Aug 29 2023, 01:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

2023 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా టైటిల్ ఫెవరెట్. ఆగస్టు 30 నుంచి ఆసియా కప్ ఆడే భారత జట్టు, నెల రోజుల తర్వాత వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలోనూ సేమ్ టీమ్‌ని ఆడించొచ్చు.. మార్పులు జరిగినా ఒకరిద్దరు ప్లేయర్లకే పరిమతం కావచ్చు..

27

‘వరల్డ్ కప్ గెలవాలంటే అన్నింటికంటే ఎక్కువగా లక్ కలిసి రావాలి. 1983, 2011 వరల్డ్ కప్ టీమ్స్‌ని గమనిస్తే, ఆ రెండు సందర్భాల్లో భారత జట్టులో టాప్ క్లాస్ ఆల్‌రౌండర్లు ఉన్నారు. బ్యాటింగ్ చేయడంతో పాట 7, 8, 9 ఓవర్లు బౌలింగ్ చేయగల ప్లేయర్లు ఉండేవాళ్లు..

37

లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వచ్చే బౌలర్లకు కూడా బ్యాటింగ్ చేయడం తెలిసేది. అప్పటి జట్లకు అదే చాలా పెద్ద ప్లస్ పాయింట్. ధోనీ టీమ్‌లో సురేష్ రైనా, యువరాజ్ సింగ్, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ బౌలింగ్ చేయగలిగేవాళ్లు..
 

47

అలాగే ఇర్ఫాన్ పఠాన్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ వంటి బౌలర్లు కూడా బ్యాటింగ్ చేయగలిగేవాళ్లు. అదే టీమ్‌కి చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఆల్‌రౌండర్లతో నిండిన టీమ్‌ ఉంటే ఎలాంటి టోర్నీనైనా గెలవడం పెద్ద కష్టమేమీ కాదు..
 

57
Rohit Sharma and Yuvraj Singh

Rohit Sharma and Yuvraj Singh

గత ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఇంగ్లాండ్ టీమ్‌లోనూ ఆల్‌రౌండర్లు పుషల్కంగా ఉన్నారు. మనదగ్గర టాలెంట్ తక్కువ ఉందని కాదు. నాకౌట్ స్టేజీ దాటాలంటే మాత్రం టాలెంట్‌తో పాటు లక్ కూడా కలిసి రావాలి. నాకౌట్ మ్యాచుల్లో మనం ఓడిన ప్రతీ మ్యాచ్‌లోనూ అదృష్టం మనకి కలిసి రాలేదు..

67

2019 వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌ చూస్తే వర్షం కారణంగా మ్యాచ్ రెండు రోజులు సాగింది. వాతావరణం, పిచ్, పరిస్థితులు అన్ని న్యూజిలాండ్‌కి కలిసి వచ్చాయి. ఆ రోజు కొద్దిగా అదృష్టం తోడై ఉంటే, ఈజీగా ఫైనల్‌కి వెళ్లేవాళ్లం..

77

సౌరవ్ గంగూలీ టీమ్ అయినా విరాట్ కోహ్లీ టీమ్ అయినా లక్ ఫ్యాక్టర్ మిస్ అవ్వడం వల్లే వరల్డ్ కప్ గెలవలేకపోయింది.. ధోనీ టీమ్‌కి కలిసి వచ్చిన అదృష్టం, రోహిత్‌ సేనకి కలిసి వస్తే వరల్డ్ కప్ గెలవడం కష్టమేమీ కాదు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్.. 
 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 : టాస్ నుంచి సంజూ మాస్ వరకు.. విండిస్ పై టీమిండియా గెలుపుకు టాప్ 7 రీజన్స్
Recommended image2
T20 World Cup 2026 : రింకూ సింగ్ అందుబాటులో ఉన్నా సంజూనే ఎందుకు ఆడించారు..? టాప్ 4 రీజన్స్ ఇవే
Recommended image3
Sanju Samson : నేను కన్న కల ఇది.. సంజూ శాంసన్ కళ్లలో నీళ్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved