ఇషాన్ కిషన్‌లా డబుల్ సెంచరీ బాదడానికి ఒక్క రోజు చాలు కానీ... కోహ్లీపై మాజీ కెప్టెన్ కామెంట్..
సచిన్ టెండూల్కర్ క్రియేట్ చేసిన రికార్డులు ఒక్కొక్కటి బ్రేక్ చేస్తూ సాగుతున్నాడు విరాట్ కోహ్లీ. అయితే 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో విరాట్ కోహ్లీ ఇప్పటిదాకా వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించలేకపోయాడు. ఆసియా కప్ 2012లో పాకిస్తాన్‌పై చేసిన 183 పరుగులే వన్డేల్లో విరాట్ కోహ్లీ అత్యధిక స్కోరు...
బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో యంగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ 131 బంతుల్లో 210 పరుగులతో చెలరేగిపోయాడు. టీమిండియా తరుపున సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ తర్వాత వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన నాలుగో భారత బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...
virat kohli
ఇషాన్ కిషన్ అవుట్ అయ్యే సమయానికి సెంచరీకి చేరువులో ఉన్న విరాట్ కోహ్లీ, 91 బంతుల్లో 113 పరుగులు చేసి వన్డేల్లో 44వ శతకాన్ని అందుకున్నాడు. కెరీర్‌లో 72వ అంతర్జాతీయ సెంచరీ బాదిన విరాట్ కోహ్లీ, ఆఖరి ఓవర్ వరకూ ఉంటే డబుల్ సెంచరీ బాదుతాడని అభిమానులు భావించారు. అయితే సెంచరీ అయ్యాక కోహ్లీ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు...
ishan
‘కేవలం క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ మాత్రం విరాట్ కోహ్లీ కంటే ముందున్నాడు. ఇలాంటి మైలు రాళ్లు, ఒక్క రోజులో వచ్చేవి కావు. ఇషాన్ కిషన్‌లా వన్డేల్లో డబుల్ సెంచరీ బాదాలంటే ఒక్కరోజు బాగా ఆడితే సరిపోతుంది. అలాగే మరింత వేగంగా ఆడితే త్రిబుల్ సెంచరీ కూడా కొట్టేయొచ్చు...
కానీ 72 అంతర్జాతీయ సెంచరీలు చేయాలంటే... చాలా చాలా స్పెషల్ టాలెంట్ ఉంటాలి. నిలకడగా రాణించడం వల్లే కోహ్లీకి ఇది సాధ్యమైంది. ఎంతోమంది రోహిత్‌లు, ఇషాన్ కిషన్‌లు వస్తూ పోతూ ఉంటారు. కానీ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్లు తరానికి ఒక్కరే పుడతారు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ కెప్టెన్ అజయ్ జడేజా.
kishan
‘నాకు తెలిసి మరో ఎండ్‌లో ఇషాన్ కిషన్ ఎంతో కాన్ఫిడెంట్‌గా భారీ షాట్లు ఆడుతుండడం వల్ల విరాట్ కోహ్లీపై ప్రెషర్ లేకుండా పోయింది. క్యాచ్ డ్రాప్ చేసినందుకు లిటన్ దాస్‌కి ఏదైనా గిఫ్ట్ పంపించి ఉంటాడు. లిటన్ దాస్ మంచి ఫీల్డర్. తొలి వన్డేలో కళ్లు చెదిరే క్యాచులు కూడా అందుకున్నాడు...
ఈసారి విరాట్ కోహ్లీ క్యాచ్ అందుకుని ఉంటే వరుసగా వికెట్లు పడి ఉండేవి. మరో రెండు వికెట్లు పడినా ఇషాన్ కిషన్ ప్రెషర్‌లో పడిపోయి డబుల్ సెంచరీ చేసేవాడు కాదు... ’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్...