- Home
- Sports
- Cricket
- యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ.. 17 ఏళ్ల తర్వాత వెస్టిండీస్ గడ్డ మీద రికార్డు కొట్టిన ఓపెనర్లు..
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ.. 17 ఏళ్ల తర్వాత వెస్టిండీస్ గడ్డ మీద రికార్డు కొట్టిన ఓపెనర్లు..
డొమినికా టెస్టులో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన యంగ్ సెన్సేషన్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్ శర్మతో కలిసి తొలి వికెట్‌కి శతాధిక భాగస్వామ్యం నెలకొల్పిన యశస్వి... క్లాస్ బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు..

Yashasvi Jaiswal
104 బంతుల్లో 7 ఫోర్లతో మొట్టమొదటి హాఫ్ సెంచరీ అందుకున్నాడు యశస్వి జైస్వాల్. అండర్19 వన్డే వరల్డ్ కప్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన యశస్వి జైస్వాల్, అప్పటి నుంచి రికార్డుల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు..
Yashasvi Jaiswal
రంజీ ట్రోఫీలో, దులీప్ ట్రోఫీలో, లిస్టు ఏ క్రికెట్‌లో డబుల్ సెంచరీలు సాధించిన యశస్వి జైస్వాల్, ఇరానీ కప్ ట్రోఫీలో సెంచరీ చేశాడు.. విజయ్ హాజారే ట్రోఫీలో సెంచరీ బాదిన యశస్వి జైస్వాల్, ఇండియా A టీమ్ తరుపున సెంచరీ సాధించాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో సెంచరీ చేసిన యశస్వి, ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన ప్లేయర్‌గా నిలిచి, అంతర్జాతీయ కెరీర్‌లో ఆరంగ్రేటం మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ బాదాడు..
ఆరంగ్రేటం టెస్టులో హాఫ్ సెంచరీ బాదిన రెండో భారత లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్‌గా నిలిచాడు యశస్వి జైస్వాల్. ఇంతకుముందు 2013లో ఆస్ట్రేలియాపై టెస్టు ఆరంగ్రేటం చేసిన శిఖర్ ధావన్, ఆరంగ్రేటం టెస్టులో 187 పరుగులు చేసి రికార్డు నెలకొల్పాడు..
Rohit Sharma
17 ఏళ్ల తర్వాత వెస్టిండీస్ పర్యటనలో తొలి వికెట్‌కి శతాధిక భాగస్వామ్యం నెలకొల్పింది టీమిండియా. 2006 పర్యటనలో వీరేంద్ర సెహ్వాగ్, వసీం జాఫర్ కలిసి తొలి వికెట్‌కి 159 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
అంతకుముందు 1971లో సునీల్ గవాస్కర్- అశోక్ మన్కడ్, 1976లో సునీల్ గవాస్కర్- అన్షుమాన్ గైక్వాడ్, 2006లో వీరేంద్ర సెహ్వాగ్ - వసీం జాఫర్ రెండు సార్లు.. విండీస్ పర్యటనలో తొలి వికెట్‌కి శతాధిక భాగస్వామ్యాలు నెలకొల్పారు..
Image credit: PTI
అల్జెరీ జోసఫ్ వేసిన ఇన్నింగ్స్ 37వ ఓవర్‌లో ఓ సిక్స్, ఫోర్ బాదిన రోహిత్ శర్మ, 106 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్ శర్మ టెస్టు కెరీర్‌లో ఇది 15వ హాఫ్ సెంచరీ.