- Home
- Sports
- Cricket
- ఇషాన్ కిషన్ ప్లేస్‌లో యశస్వి జైస్వాల్! వన్డేల్లో ఓపెనర్‌గా సూపర్ సక్సెస్, టీ20ల్లో మాత్రం అట్టర్ ఫ్లాప్...
ఇషాన్ కిషన్ ప్లేస్‌లో యశస్వి జైస్వాల్! వన్డేల్లో ఓపెనర్‌గా సూపర్ సక్సెస్, టీ20ల్లో మాత్రం అట్టర్ ఫ్లాప్...
అండర్19 వరల్డ్ కప్, రంజీ, దేశవాళీ టోర్నీలు, ఐపీఎల్.. ఇలా ఎంట్రీ ఇచ్చిన ప్రతీ సిరీస్‌లో దుమ్మురేపి టీమిండియాలోకి వచ్చాడు యశస్వి జైస్వాల్. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో 266 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్, టాప్ స్కోరర్‌గా నిలిచాడు..

ఐపీఎల్ 2023 సీజన్‌లో 14 మ్యాచులు ఆడిన యశస్వి జైస్వాల్, 48.07 సగటుతో 163.61 స్ట్రైయిక్ రేటుతో 625 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి..
Yashasvi Jaiswal
అయినా యశస్వి జైస్వాల్‌కి తొలి టీ20 మ్యాచ్‌లో చోటు ఇవ్వకపోవడం హాట్ టాపిక్ అయ్యింది. ఇషాన్ కిషన్ ప్లేస్‌లో యశస్వి జైస్వాల్‌ని ఆడించే బాగుంటుందని అంటున్నారు నెటిజన్లు..
దీనికి కారణం లేకపోలేదు. వన్డేల్లో ఓపెనర్‌గా హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు బాదిన ఇషాన్ కిషన్, మొదటి టీ20 మ్యాచ్‌లో 9 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసి అవుట్ అయ్యాడు... గత 15 టీ20 మ్యాచుల్లో ఒక్క 40+ స్కోరు కూడా నమోదు చేయలేకపోయాడు ఇషాన్ కిషన్...
27, 15, 26, 3, 8, 11, 36, 10, 37, 2, 1, 4, 19, 1 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచిన ఇషాన్ కిషన్, వెస్టిండీస్‌తో తొలి టీ20లో 6 పరుగులే చేశాడు. 15 టీ20ల్లో రెండు సార్లు మాత్రమే 30+ స్కోరు బాదిన ఇషాన్ కిషన్‌కి వరుసగా అవకాశాలు ఇవ్వడం హాట్ టాపిక్ అవుతోంది..
అంతేకాకుండా వికెట్ కీపింగ్‌లోనూ ఇషాన్ కిషన్ పెద్దగా మెప్పించలేకపోతున్నాడు. సంజూ శాంసన్ వంటి సీనియర్ వికెట్ కీపర్ జట్టులో ఉన్నా, ఇషాన్ కిషన్‌కి వరుస అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే అతనితో వికెట్ కీపింగ్ చేయిస్తోంది టీమిండియా..
Yashasvi Jaiswal
మొదటి టీ20లో ఓటమి తర్వాత టీమిండియాపై తీవ్రమైన ట్రోలింగ్ వచ్చింది. యశస్వి జైస్వాల్‌ని ఆడించాలని డిమాండ్ చేస్తున్నారు అభిమానులు. జైస్వాల్‌ని తుది జట్టులోకి తీసుకురావాలంటే టీ20ల్లో వరుసగా విఫలం అవుతున్న ఇషాన్ కిషన్‌ని తప్పించడం ఒక్కటే టీమిండియాకి ఉన్న ఏకైక మార్గం..